Followers

Thursday, 29 May 2014

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం పదవ అధ్యాయం

             

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం పదవ అధ్యాయం

సూత ఉవాచ
స ఏవమనుభూయేదం నారాయణవినిర్మితమ్
వైభవం యోగమాయాయాస్తమేవ శరణం యయౌ

పరమాత్మ నారాయణుని యోగమాయ చూచి, ఆ వైభవాన్ని చూచి

శ్రీమార్కణ్డేయ ఉవాచ
ప్రపన్నోऽస్మ్యఙ్ఘ్రిమూలం తే ప్రపన్నాభయదం హరే
యన్మాయయాపి విబుధా ముహ్యన్తి జ్ఞానకాశయా

పరమాత్మా, నిన్ను ఆశ్రయించిన వారికి అభయమిచ్చే నీ పాద మూలాన్ని ఆశ్రయిస్తున్నాను
కొంచెం జ్ఞ్యానం ఉంది అని భావించే దేవత్లు కూడా నీ మాయ వలన మోహం పొందుతూ ఉంటే నేను ఎంతటివాడిని

సూత ఉవాచ
తమేవం నిభృతాత్మానం వృషేణ దివి పర్యటన్
రుద్రాణ్యా భగవాన్రుద్రో దదర్శ స్వగణైర్వృతః

పరమభాగవతోత్తముడైన మార్కండేయుని పార్వతీ దేవితో వెళుతున్న పరంశివుడు చూచాడు

అథోమా తమృషిం వీక్ష్య గిరిశం సమభాషత
పశ్యేమం భగవన్విప్రం నిభృతాత్మేన్ద్రియాశయమ్

ఈయనను చూస్తే శరీరం ఉన్నట్లు కనప్డడం లేదు
ఇంద్రియాలనూ మనసునూ ఎక్కడో ఉంచాడు

నిభృతోదఝషవ్రాతో వాతాపాయే యథార్ణవః
కుర్వస్య తపసః సాక్షాత్సంసిద్ధిం సిద్ధిదో భవాన్

తపస్సు బాగా చేస్తున్నాడు నీ కోసమే
అటువంటి వారిని నీవు అనుగ్రహిస్తావు కద. ఏమి కోరబోతున్నాడో అడిగి చూదాము అని అన్నది పార్వతి

శ్రీభగవానువాచ
నైవేచ్ఛత్యాశిషః క్వాపి బ్రహ్మర్షిర్మోక్షమప్యుత
భక్తిం పరాం భగవతి లబ్ధవాన్పురుషేऽవ్యయే

ఈ మార్కండేయుడు పరమాత్మ యందు పరమ భక్తి పొందాడు. ఇలాంటి వారు ఏ కోరికా కోరరు. చివరకు ఆయనే వచ్చి మోక్షం ఇస్తానని అన్నా కోరరు

అథాపి సంవదిష్యామో భవాన్యేతేన సాధునా
అయం హి పరమో లాభో నృణాం సాధుసమాగమః

ఐనా నీవు అన్నావు కాబట్టి ఆయన వద్దకు వెళదాము. సకల ప్రాణులకూ సజ్జన సమాగమం పెద్ద లాభం

సూత ఉవాచ
ఇత్యుక్త్వా తముపేయాయ భగవాన్స సతాం గతిః
ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వదేహినామ్

ఇలా చెప్పి స్వామి అక్కడకు వెళ్ళాడు
ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వదేహినామ్

తయోరాగమనం సాక్షాదీశయోర్జగదాత్మనోః
న వేద రుద్ధధీవృత్తిరాత్మానం విశ్వమేవ చ

ఈ మార్కండేయునికి వారు వచ్చిన సంగతే తెలియలేదు. జగత్తును చూడడమే లేదు.

భగవాంస్తదభిజ్ఞాయ గిరిశో యోగమాయయా
ఆవిశత్తద్గుహాకాశం వాయుశ్ఛిద్రమివేశ్వరః

శంకరుడు ఆ విషయం తెలుసుకుని తన యోగ మాయతో ఆయన హృదయములో తాను భాసించాడు, చిద్రం లభిస్తే వాయువు వెళ్ళినట్లుగా అతని హృదయాకాశానికి ఆయన వెళ్ళాడు

ఆత్మన్యపి శివం ప్రాప్తం తడిత్పిఙ్గజటాధరమ్
త్ర్యక్షం దశభుజం ప్రాంశుముద్యన్తమివ భాస్కరమ్

త్రినేత్రుడు, పది భుజాలతో ( పంచముఖుడై), ఉదయిస్తున్న సూర్యునిలా ఉన్నాడు

వ్యాఘ్రచర్మామ్బరం శూల ధనురిష్వసిచర్మభిః
అక్షమాలాడమరుక కపాలం పరశుం సహ

పది ఆయుధాలతో

బిభ్రాణం సహసా భాతం విచక్ష్య హృది విస్మితః
కిమిదం కుత ఏవేతి సమాధేర్విరతో మునిః

ఇటువంటి పరమ శివుడు హృదయములో భాసించడం చూచి సమాధినుండి బయటకు వచ్చి పార్వతితో ఉన్న స్వామిని సేవించాడు

నేత్రే ఉన్మీల్య దదృశే సగణం సోమయాగతమ్
రుద్రం త్రిలోకైకగురుం ననామ శిరసా మునిః

శిరస్సు వంచి స్వామికి నమస్కరించాడు

తస్మై సపర్యాం వ్యదధాత్సగణాయ సహోమయా
స్వాగతాసనపాద్యార్ఘ్య గన్ధస్రగ్ధూపదీపకైః

అర్ఘ్య పాద్యాదులతో పూజించాడు

ఆహ త్వాత్మానుభావేన పూర్ణకామస్య తే విభో
కరవామ కిమీశాన యేనేదం నిర్వృతం జగత్

మహానుభావా నీవు పూర్ణ కాముడవు. నీకు మేమేమి సేవ చేయగలము.

నమః శివాయ శాన్తాయ సత్త్వాయ ప్రమృడాయ చ
రజోజుషేऽథ ఘోరాయ నమస్తుభ్యం తమోజుషే

నీవే రజో గుణ తమో గుణ స్వరూపుడవు. ఐనా నీవు అఘోరుడవు (భయంకరుడవు కావు) సుఘోరుడవు ( భయంకరుడవూ అవుతావు) అని స్తోత్రం చేసాడు

సూత ఉవాచ
ఏవం స్తుతః స భగవానాదిదేవః సతాం గతిః
పరితుష్టః ప్రసన్నాత్మా ప్రహసంస్తమభాషత

ఇలా స్తోత్రం చేయబడి సంతోషించి ఇలా అంటున్నాడు

శ్రీభగవానువాచ
వరం వృణీష్వ నః కామం వరదేశా వయం త్రయః
అమోఘం దర్శనం యేషాం మర్త్యో యద్విన్దతేऽమృతమ్

బ్రహ్మ విష్ణు పరమేశ్వరులమైన మేము ముగ్గురమూ వరములిచ్చేవారము.
మా దర్శనం వ్యర్థం కాకూడదు. మా దర్శనముతో మర్త్యుడు అమర్త్యుడవుతాడు

బ్రాహ్మణాః సాధవః శాన్తా నిఃసఙ్గా భూతవత్సలాః
ఏకాన్తభక్తా అస్మాసు నిర్వైరాః సమదర్శినః

వైరం లేని వారు సమభావనతో ఉండేవారు ఏకాంత భక్తులు, అందరూ మమ్ము సమభావముతో నమస్కరిస్తారు పూజిస్తారు ఉపాసిస్తారు

సలోకా లోకపాలాస్తాన్వన్దన్త్యర్చన్త్యుపాసతే
అహం చ భగవాన్బ్రహ్మా స్వయం చ హరిరీశ్వరః

నేనూ బ్రహ్మా హరి,

న తే మయ్యచ్యుతేऽజే చ భిదామణ్వపి చక్షతే
నాత్మనశ్చ జనస్యాపి తద్యుష్మాన్వయమీమహి

జ్ఞ్యానులైన వారు నా యందూ విష్ణువు యందూ భేధమును ఏ కొంచెమూ కూడా చూడరు
నేను ఇక్కడకు రావడానికి కారణం నీలో ఇంకా ఆ భేధ బుద్ధీ ఇంకా ఏమైనా ఉన్నదేమో చూద్దామని వచ్చాను

న హ్యమ్మయాని తీర్థాని న దేవాశ్చేతనోజ్ఝితాః
తే పునన్త్యురుకాలేన యూయం దర్శనమాత్రతః

నీకు వరాలివ్వడానికి రాలేదు. నిన్ను చూచి నేను పవిత్రతను పొందడానికి వచ్చాను
నీరు మాత్రమే పుణ్య తీర్థములు కావు
చైతన్యం లేకుండా శిలామయముగాఉన్నవారే దేవతలు కాదు.
నదులనూ ఆలయాలలో అర్చావతారాలనీ ఎంతో కాలం సేవిస్తే గానీ అనుగ్రహించరు.
కానీ నీవంటి సజ్జనులను చూడడం చేతనే పవిత్రులవుతారు

బ్రాహ్మణేభ్యో నమస్యామో యేऽస్మద్రూపం త్రయీమయమ్
బిభ్రత్యాత్మసమాధాన తపఃస్వాధ్యాయసంయమైః

వేదమయమైన మా రూపాన్ని ధరించే బ్రాహ్మణోత్తములకు మేము నమస్కారం చేస్తున్నాము
సమాధీ తపస్సు స్వాధ్యాయమూ నిగ్రహముతో మా రూపాన్ని ధరించే బ్రాహ్మణోత్తములకు నమస్కారం చేస్తున్నాము

శ్రవణాద్దర్శనాద్వాపి మహాపాతకినోऽపి వః
శుధ్యేరన్నన్త్యజాశ్చాపి కిము సమ్భాషణాదిభిః

మీలాంటి మహానుభావులను వింటే చాలు చూస్తే చాలు, మాహా పాపాలు పోతాయి, మహాపాపులు కూడా తరిస్తారు
మీ పేరు వింటేనే మిమ్ము చూస్తేనే మహాపాతకులైన తరిస్తారు. ఇంక మీలాంటి వారితో మాట్లాడితే మేలు కలుగుతుంది అని వేరే చెప్పాలా. అందుకే మేము వచ్చాము

సూత ఉవాచ
ఇతి చన్ద్రలలామస్య ధర్మగహ్యోపబృంహితమ్
వచోऽమృతాయనమృషిర్నాతృప్యత్కర్ణయోః పిబన్

ఇలా పరమశివుడు మాట్లాడిన అమృతం వంటి ధర్మ రహస్యాన్ని విని చెవులతో తాగుతూ తృప్తి పొందలేదు

స చిరం మాయయా విష్ణోర్భ్రామితః కర్శితో భృశమ్
శివవాగమృతధ్వస్త క్లేశపుఞ్జస్తమబ్రవీత్

చాలా కాలం పరమాత్మ మాయ వలన చిక్కిపోయాడు.
పరమాత్మ మాయలో తిరిగి తిరిగి అలసిన మార్కండేయుని అలసటను తగ్గించాడు పరమ శివుడు

శ్రీమార్కణ్డేయ ఉవాచ
అహో ఈశ్వరలీలేయం దుర్విభావ్యా శరీరిణామ్
యన్నమన్తీశితవ్యాని స్తువన్తి జగదీశ్వరాః

పరమాత్మ లీల దేహధారుల ఊహకు అందనిది
తమ చేత పరిపాలించబడే వారికి తామే నమస్కరించి తామే స్తోత్రం చేస్తారు

ధర్మం గ్రాహయితుం ప్రాయః ప్రవక్తారశ్చ దేహినామ్
ఆచరన్త్యనుమోదన్తే క్రియమాణం స్తువన్తి చ

లోకములో ధర్మాన్ని ఆచరింపచేయడానికి ఇలా వీరు మాట్లాడుతూ ఉంటారు
సజ్జనులు ఆచరించిన దానిని ఆమోదిస్తారు, స్వయముగా ఆచరిస్తారు, చేస్తున్నా వారిని పొగడుతూ స్తోత్రం చేస్తారు

నైతావతా భగవతః స్వమాయామయవృత్తిభిః
న దుష్యేతానుభావస్తైర్మాయినః కుహకం యథా

ఇలా స్తోత్రం చేసినంత మాత్రాన మీ ప్రభావానికీ మహిమకూ లోటు ఉండదు.

సృష్ట్వేదం మనసా విశ్వమాత్మనానుప్రవిశ్య యః
గుణైః కుర్వద్భిరాభాతి కర్తేవ స్వప్నదృగ్యథా

జగత్తును సృష్టించి అందులో తాను ప్రవర్తించి, కలగంటున్నట్లుగా జగత్తును సృష్టించి అందులో ప్రవేశించి వాటిని గుణములతో కలుపుతారు

తస్మై నమో భగవతే త్రిగుణాయ గుణాత్మనే
కేవలాయాద్వితీయాయ గురవే బ్రహ్మమూర్తయే

పరబ్రహ్మ, గురువైన ఆ స్వామికి నమస్కరిస్తున్నాను.

కం వృణే ను పరం భూమన్వరం త్వద్వరదర్శనాత్
యద్దర్శనాత్పూర్ణకామః సత్యకామః పుమాన్భవేత్

మీరు మాకు దర్శనం ఇవ్వడమే గొప్ప వరము.
మీ వంటి మాహానుభావుల దర్శనముతో పూర్ణకాములవుతారు, సత్యకాములవుతారు

వరమేకం వృణేऽథాపి పూర్ణాత్కామాభివర్షణాత్
భగవత్యచ్యుతాం భక్తిం తత్పరేషు తథా త్వయి

ఐనా నేను ఒక వరం అడుగుతాను
పరమాత్మ యందు ఉన్న భక్తి తొలగిపోకుండా
పరమాత్మ భక్తులయందూ, మీయందూ భక్తీ తొలగిపోకుండా ఉండు గాక. (భగవత్ భాగవత ఆచార్యుల యందు ఉన్న భక్తి తొలగిపోకుండా ఉండు గాక)

సూత ఉవాచ
ఇత్యర్చితోऽభిష్టుతశ్చ మునినా సూక్తయా గిరా
తమాహ భగవాఞ్ఛర్వః శర్వయా చాభినన్దితః

అలా స్తోత్రం చేయబడీ పూజించబడి, పార్వతీ దేవితో కలసి మార్కండేయున్ని అభినందించారు

కామో మహర్షే సర్వోऽయం భక్తిమాంస్త్వమధోక్షజే
ఆకల్పాన్తాద్యశః పుణ్యమజరామరతా తథా

నీవు పరమాత్మ యందే భక్తి కలిగి ఉన్నావు
కల్పాంతం వరకూ ఆయువును ఇస్తున్నాను.జరా మరణం లేకుండా వరం ఇస్తున్నాను

జ్ఞానం త్రైకాలికం బ్రహ్మన్విజ్ఞానం చ విరక్తిమత్
బ్రహ్మవర్చస్వినో భూయాత్పురాణాచార్యతాస్తు తే

త్రికాల జ్ఞ్యానం ఇస్తున్నాను. అహంకారం రాకుండా వైరాగ్యముతో కూడిన విజ్ఞ్యానాన్ని ఇస్తున్నాను
నీవు ఒక పురాణాన్ని కూడా చెప్పేవాడవు అవుతావు

సూత ఉవాచ
ఏవం వరాన్స మునయే దత్త్వాగాత్త్ర్యక్ష ఈశ్వరః
దేవ్యై తత్కర్మ కథయన్ననుభూతం పురామునా

ఇలా శంకరుడు వరాన్ని ఇచ్చాడు.ఇలా శంకరుడు వరాలిచ్చి అంతర్ధానమయ్యాడు
ఇదంతా పార్వతీ దేవికి వివరించుకుంటూ వచ్చాడు

సోऽప్యవాప్తమహాయోగ మహిమా భార్గవోత్తమః
విచరత్యధునాప్యద్ధా హరావేకాన్తతాం గతః

మార్కండేయుడు కూడా ఇంత గొప్ప మహిమను పొంది, శ్రీమన్నారాయణుని యందు ఏకాంత భక్తి గలవాడై ఇప్పటికీ మార్కండేయుడు సంచరిస్తూ ఉన్నాడు

అనువర్ణితమేతత్తే మార్కణ్డేయస్య ధీమతః
అనుభూతం భగవతో మాయావైభవమద్భుతమ్

ఇలాంటి మార్కండేయుని ప్రభావాన్ని నీకు వివరించాను.
ఎవడూ ఇప్పటివరకూ శ్రీమన్నారాయణుని అద్భుతమైన మాయా వైభవాన్ని ఈయన తప్ప ఎవరూ చూడలేదు

ఏతత్కేచిదవిద్వాంసో మాయాసంసృతిరాత్మనః
అనాద్యావర్తితం నౄణాం కాదాచిత్కం ప్రచక్షతే

ఇదంతా కాదాచిత్కముగా (ఎపుడో ఒకప్పుడు జరిగేదిగా) కొందరు మహానుభావులు పరమాత్మ మాయా ప్రభావాన్ని చెబుతారు

య ఏవమేతద్భృగువర్య వర్ణితం రథాఙ్గపాణేరనుభావభావితమ్
సంశ్రావయేత్సంశృణుయాదు తావుభౌ తయోర్న కర్మాశయసంసృతిర్భవేత్

చక్రపాణి ఐన పరమాత్మ ప్రభావముతో ఏర్పడిన ఈ గొప్ప ఆశ్చర్యకరమైన ఈ వర్ణనను వినిపించినవాడూ విన్నవాడికి, మళ్ళీ ఈ సంసారము అంటదు

                                                        సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts