Followers

Thursday, 22 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభయ్యవ అధ్యాయం

                ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభయ్యవ అధ్యాయం

శ్రీరాజోవాచ
భగవన్యాని చాన్యాని ముకున్దస్య మహాత్మనః
వీర్యాణ్యనన్తవీర్యస్య శ్రోతుమిచ్ఛామి హే ప్రభో

స్వామీ,

కో ను శ్రుత్వాసకృద్బ్రహ్మన్నుత్తమఃశ్లోకసత్కథాః
విరమేత విశేషజ్ఞో విషణ్ణః కామమార్గణైః

కృష్ణ కథలు ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి., ఆయన కథలు ఎన్ని వింటే మాత్రం తృప్తి కలుగుతుంది.
మన్మధుని బాణములతో ఆర్తి పొందిన వారు పరమాత్మ కథలు వినే ఆ ఆర్తి తొలగించుకోవాలి

సా వాగ్యయా తస్య గుణాన్గృణీతే కరౌ చ తత్కర్మకరౌ మనశ్చ
స్మరేద్వసన్తం స్థిరజఙ్గమేషు శృణోతి తత్పుణ్యకథాః స కర్ణః

పరమాత్మ గుణములు పలికిన దాన్నే వాక్కు,అతని సేవ చేసినవే హస్తములు, అతన్ని స్మరించినదే మనసు, స్థావర జంగమాధులలో స్థిరముగా పరమాత్మ ఉన్నాడని స్మరించేదే మనసు. భగవంతుని పుణ్య కథలను వినేదే చెవ్వూ.

శిరస్తు తస్యోభయలిఙ్గమానమేత్తదేవ యత్పశ్యతి తద్ధి చక్షుః
అఙ్గాని విష్ణోరథ తజ్జనానాం పాదోదకం యాని భజన్తి నిత్యమ్


పరమాత్మ యొక్క సాకార నిరాకారా రూపమును నమస్కరించేదే శిరస్సు
పరమాత్మ రూపాన్ని చూచేదే కనులు. భగవంతుని భక్తులను సేవించే, వారి పాద తీర్థాన్ని సేవించే శరీరమే శరీరము, అవయవాలే అవయవాలు.
నీవు ఇంకా పరమాత్మ కథల్ను చెప్పవలసినది

సూత ఉవాచ
విష్ణురాతేన సమ్పృష్టో భగవాన్బాదరాయణిః
వాసుదేవే భగవతి నిమగ్నహృదయోऽబ్రవీత్

ఇలా పరీక్షిత్తు అడిగితే భగవానుని యందు మనసును ముంచేసి ఇలా చెబుతున్నాడు

శ్రీశుక ఉవాచ
కృష్ణస్యాసీత్సఖా కశ్చిద్బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః
విరక్త ఇన్ద్రియార్థేషు ప్రశాన్తాత్మా జితేన్ద్రియః

పరమాత్మకు బాల్య మిత్రుడు ఐన బ్రాహ్మణోత్తముడు ఒకడున్నాడు. ఆయనకు సంసారము మీద కానీ సాంసారిక విషయములయందు కాని అనురాగం లేదు. ఇంద్రియ జయం కలిగిన ఈయన

యదృచ్ఛయోపపన్నేన వర్తమానో గృహాశ్రమీ
తస్య భార్యా కుచైలస్య క్షుత్క్షామా చ తథావిధా

భగవంతుడు ప్రసాదించిన దానితో బతుకుతున్నాడు. గృహస్థుడు. ఆశలేని వాడు. అతని భార్య ఆకలితో బక్క చిక్కి ఉంది

పతివ్రతా పతిం ప్రాహ మ్లాయతా వదనేన సా
దరిద్రం సీదమానా వై వేపమానాభిగమ్య చ

వాడిపోయిన ముఖముతో ఆ పతివ్రత, ఇలా అంది వణుకుతూ

నను బ్రహ్మన్భగవతః సఖా సాక్షాచ్ఛ్రియః పతిః
బ్రహ్మణ్యశ్చ శరణ్యశ్చ భగవాన్సాత్వతర్షభః

నీవు ఒక సారి చెప్పావు, సాక్షాత్ శ్రియఃపతే నీ మిత్రుడు అని. బ్రాహ్మణ ప్రియుడు , అందరికీ రక్షకుడు అని చెప్పావు.. అతను సాధు పరాయణుడు

తముపైహి మహాభాగ సాధూనాం చ పరాయణమ్
దాస్యతి ద్రవిణం భూరి సీదతే తే కుటుమ్బినే

కాబట్టి అతన్ని చేరు. కుటుంబం కోసం బాధపడుతున్న నీకు ధనమిస్తాడు..

ఆస్తేऽధునా ద్వారవత్యాం భోజవృష్ణ్యన్ధకేశ్వరః
స్మరతః పాదకమలమాత్మానమపి యచ్ఛతి
కిం న్వర్థకామాన్భజతో నాత్యభీష్టాన్జగద్గురుః

ఇపుడు అతను ద్వారకలో ఉన్నాడు. అతని పాదాలు స్మరిస్తే తననుకూడా తాను ఇచ్చుకుంటాడు
అర్థకామాలను కోరేవాడికి మాత్రం అంత ఎక్కువ ఇవ్వడట.

స ఏవం భార్యయా విప్రో బహుశః ప్రార్థితో ముహుః
అయం హి పరమో లాభ ఉత్తమఃశ్లోకదర్శనమ్

ఐనా మనం జీవయాత్ర  కోసం యాచిస్తున్నాము కదా
ఇలా భార్య మృదువుగా మెత్తగా ప్రేమగా వినయముగా భయముగా గౌరవముగా మనసు నొప్పించకుండా చెప్పగా కుచేలుడు "అడగడం సంగతి తరువాత. ఈ వంకతో భగవానుని దర్శనం అవుతుంది" అనుకున్నాడు

ఇతి సఞ్చిన్త్య మనసా గమనాయ మతిం దధే
అప్యస్త్యుపాయనం కిఞ్చిద్గృహే కల్యాణి దీయతామ్

ఇది ఆలోచించి, సరే వెళదాము అని సంకల్పించుకున్నాడు.
ఉత్త చేతులతో వెళ్ళకూడదు కాబట్టి ఏదైనా ఇంటిలో ఉంటే ఇవ్వు వెళతాను అన్నాడు

యాచిత్వా చతురో ముష్టీన్విప్రాన్పృథుకతణ్డులాన్
చైలఖణ్డేన తాన్బద్ధ్వా భర్త్రే ప్రాదాదుపాయనమ్

పక్కనున్న బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి నాలుగు పిడికిళ్ళ అటుకులు భర్తకు ఇచ్చింది

స తానాదాయ విప్రాగ్ర్యః ప్రయయౌ ద్వారకాం కిల
కృష్ణసన్దర్శనం మహ్యం కథం స్యాదితి చిన్తయన్

అటుకులు తీసుకుని ఈ బ్రాహ్మణోత్తముడు ద్వారకా నగరానికి వెళ్ళాడు. నా లాంటి బీదవాడికి అంతఃపురములో ఉన్న కృష్ణ దర్శనం అవుతుందా

త్రీణి గుల్మాన్యతీయాయ తిస్రః కక్షాశ్చ సద్విజః
విప్రోऽగమ్యాన్ధకవృష్ణీనాం గృహేష్వచ్యుతధర్మిణామ్

ఇలా ఒక్కో గుమ్మాలనూ దాటుకుంటూ వెళుతున్నాడు. అన్ని అంతఃపురాలూ దాటుకుంటూ "బ్రహ్మానందం" అనే అంతఃపురానికి వెళ్ళాడు

గృహం ద్వ్యష్టసహస్రాణాం మహిషీణాం హరేర్ద్విజః
వివేశైకతమం శ్రీమద్బ్రహ్మానన్దం గతో యథా

తం విలోక్యాచ్యుతో దూరాత్ప్రియాపర్యఙ్కమాస్థితః
సహసోత్థాయ చాభ్యేత్య దోర్భ్యాం పర్యగ్రహీన్ముదా

ప్రియురాలితో పర్యంకం మీద కూర్చుని ఉన్న కృష్ణుడు కుచేలున్ని చూచి తన బాహువులతో ఆనందముగా ఆలింగనం చేసుకున్నాడు

సఖ్యుః ప్రియస్య విప్రర్షేరఙ్గసఙ్గాతినిర్వృతః
ప్రీతో వ్యముఞ్చదబ్బిన్దూన్నేత్రాభ్యాం పుష్కరేక్షణః

ప్రియమిత్రుడైన బ్రాహ్మణుడి శరీర స్పర్శతో పరమానందాన్ని పొందాడు. పుండరీకాక్షుడైన స్వామి కళ్ళ నుండి ఆనందాశ్రువులు రాలాయి

అథోపవేశ్య పర్యఙ్కే స్వయమ్సఖ్యుః సమర్హణమ్
ఉపహృత్యావనిజ్యాస్య పాదౌ పాదావనేజనీః

తాను కూర్చున్న పర్యంకం మీదనే అతనిని కూర్చోబెట్టి పాదాలు కడిగి అతని పాద తీర్థాన్ని స్వయముగా తన శిరస్సున జల్లుకున్నాడు, సకలలోకములనూ పావనం చేసే పరమాత్మ

అగ్రహీచ్ఛిరసా రాజన్భగవాంల్లోకపావనః
వ్యలిమ్పద్దివ్యగన్ధేన చన్దనాగురుకుఙ్కమైః

గంధమూ చందనం అగరు కుంకుమాదులతో పూజించాడు. ధూప దీపాదులతో, తాంబూలాదులతో, గోదానముతో, స్వాగతం చెప్పి

ధూపైః సురభిభిర్మిత్రం ప్రదీపావలిభిర్ముదా
అర్చిత్వావేద్య తామ్బూలం గాం చ స్వాగతమబ్రవీత్

కుచైలం మలినం క్షామం ద్విజం ధమనిసన్తతమ్
దేవీ పర్యచరత్సాక్షాచ్చామరవ్యజనేన వై

ఎముకల గూడులా ఉన్న బ్రాహ్మణుడికి రుక్మిణీ దేవి చామరముతో వీస్తూ ఉంది

అన్తఃపురజనో దృష్ట్వా కృష్ణేనామలకీర్తినా
విస్మితోऽభూదతిప్రీత్యా అవధూతం సభాజితమ్

అంతఃపుర పరిజనం అంతా పరమాశ్చర్యాన్ని  పొందారు, ఈ అవధూత అదృష్టమేమి, ఇంత గౌరవం పొందుతున్నాడు

కిమనేన కృతం పుణ్యమవధూతేన భిక్షుణా
శ్రియా హీనేన లోకేऽస్మిన్గర్హితేనాధమేన చ

సంపదా లేదు, అందరిచేతా నిందించబ్డేంత అధముడిగా ఉన్నాడు

యోऽసౌ త్రిలోకగురుణా శ్రీనివాసేన సమ్భృతః
పర్యఙ్కస్థాం శ్రియం హిత్వా పరిష్వక్తోऽగ్రజో యథా

శ్రీనివాసునితో సాక్షాతూ ఆదరించబడుతున్నాడు
తన పక్కన ఉన్న లక్ష్మీ దేవిని కూడా వదిలిపెట్టి అన్నను కౌగిలించుకున్నట్లు కౌగిలించుకున్నాడు

కథయాం చక్రతుర్గాథాః పూర్వా గురుకులే సతోః
ఆత్మనోర్లలితా రాజన్కరౌ గృహ్య పరస్పరమ్

తామిద్దరూ చదువుకున్నపుడు జరిగిన గురుకుల వృత్తాంతాలు చెప్పుకున్నారు
చేతులూ చేతులూ పట్టుకుని పాత రోజు ముచ్చట్లు చెప్పుకున్నారు

శ్రీభగవానువాచ
అపి బ్రహ్మన్గురుకులాద్భవతా లబ్ధదక్షిణాత్
సమావృత్తేన ధర్మజ్ఞ భార్యోఢా సదృశీ న వా

బ్రాహ్మణోత్తమా గురుకులం నుంచి ఇంటికి వచ్చిన తరువాత నీకు తగిన వధువును భార్యగా స్వీకరించావా

ప్రాయో గృహేషు తే చిత్తమకామవిహితం తథా
నైవాతిప్రీయసే విద్వన్ధనేషు విదితం హి మే

చదువుకున్నప్పటి రోజునుంచీ నీ మనసు సంసారమంటే విముఖముగా ఉండేది
ధనం, సంపదలూ సంసార సుఖాలూ నీవు కోరుకోలేదన్న విషయం నాకు తెలుసు

కేచిత్కుర్వన్తి కర్మాణి కామైరహతచేతసః
త్యజన్తః ప్రకృతీర్దైవీర్యథాహం లోకసఙ్గ్రహమ్

కొందరు జ్ఞ్యానులు కోరికలతో కట్టుబడకుండా ధర్మ కృత్యములు ఆచరిస్తారు. సాంసారిక విషయాలు చేసినా వారికి దాని యందు ఆసక్తి ఉండదు. జ్ఞ్యానులు పని చేస్తారు కాన్ని ఆసక్తితో చేయరు.
(సక్తాః - కర్మణి - అవిద్వాంసః - యథా - కుర్వంతి - భారత
కుర్యాత్ - విద్వాన్ - తథా - అసక్తః - చికీర్షుః - లోకసంగ్రహం - భగవద్గీత)
లోకాన్ని ఆచరింపచేయడానికి నీవంటి వారు పని చేస్తారు
నేనెలా లోక సంగ్రహం కోసం పని చేస్తున్నానో నీవు కూడా అలాగే  పని చేస్తున్నావా

కచ్చిద్గురుకులే వాసం బ్రహ్మన్స్మరసి నౌ యతః
ద్విజో విజ్ఞాయ విజ్ఞేయం తమసః పారమశ్నుతే

మనం గురుకులములో ఉన్న రోజులు జ్ఞ్యాపకం చేసుకుంటునావా
గురువుగారి దగ్గర తెలుసుకోవలసిన వాటిని తెలుసుకున్నవాడే అజ్ఞ్యానాన్ని పోగొట్టుకుని జ్ఞ్యానాన్ని పొందుతాడు

స వై సత్కర్మణాం సాక్షాద్ద్విజాతేరిహ సమ్భవః
ఆద్యోऽఙ్గ యత్రాశ్రమిణాం యథాహం జ్ఞానదో గురుః

అటువంటి వాడే ద్విజుడు అనబడతాడు.
నేనెలా అందరికీ జ్ఞ్యానం ప్రసాదిస్తానో గురువు కూడా అలాగే జ్ఞ్యానాన్ని ప్రసాదిస్తాడు

నన్వర్థకోవిదా బ్రహ్మన్వర్ణాశ్రమవతామిహ
యే మయా గురుణా వాచా తరన్త్యఞ్జో భవార్ణవమ్

ఏ వర్ణాశ్రమ వాసులు గురువు గారి చేత బాగా బోధించబడతారో వారు తాము పొందవలసిన వాటిని బాగా తెలిసినవారు.
వారు సులభముగా సంసారాన్ని దాటుతారు
 గురువంటే నేనే. గురువు వాక్కు నేనే. ఇతరులెందరు చెప్పినా కలగని జ్ఞ్యానం గురువు చెబితే కలుగుతుంది. ఎందుకంటే నేనే గురువాక్యాన్ని

నాహమిజ్యాప్రజాతిభ్యాం తపసోపశమేన వా
తుష్యేయం సర్వభూతాత్మా గురుశుశ్రూషయా యథా

గురువును సేవించడం వలన తృప్తి పొందినట్లు యజ్ఞ్యముతో కానీ సంతానముతో కానీ గృహస్థారమముతో గానీ తపస్సుతో కానీ ఇంద్రియ నిగ్రహముతో కానీ నేను తృప్తి పొందను

అపి నః స్మర్యతే బ్రహ్మన్వృత్తం నివసతాం గురౌ
గురుదారైశ్చోదితానామిన్ధనానయనే క్వచిత్

గురువుగారి ఇంటిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన నీకు గుర్తు ఉన్నదా
గురువుగారి భార్య వంట చెరుకు కోసం సమిధల కోసం పంపింది

ప్రవిష్టానాం మహారణ్యమపర్తౌ సుమహద్ద్విజ
వాతవర్షమభూత్తీవ్రం నిష్ఠురాః స్తనయిత్నవః

మన ఇద్దరమూ వెళ్ళాము. కాలం కాని కాలములో పెద్ద వాన వచ్చింది. మేఘాలు కఠినముగా గర్ఝిస్తున్నాయి

సూర్యశ్చాస్తం గతస్తావత్తమసా చావృతా దిశః
నిమ్నం కూలం జలమయం న ప్రాజ్ఞాయత కిఞ్చన

సూర్యాస్తమయం అయ్యింది, అంతా జలమయం అయ్యింది. వంపులన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ ఎత్తో ఎక్కడ పల్లమో తెలియలేదు

వయం భృశమ్తత్ర మహానిలామ్బుభిర్నిహన్యమానా మహురమ్బుసమ్ప్లవే
దిశోऽవిదన్తోऽథ పరస్పరం వనే గృహీతహస్తాః పరిబభ్రిమాతురాః

మనమిద్దరం గాలి వానలో కొట్టబడి నీటిలో మునిగి ఎటుపోవాలో తెలియక ఒకరి చేయి ఒకరు పట్టుకుని తిరిగాము. రాత్రనతా అలాగే గడిపాము. సూర్యోదయం అవగానే సాందీపని (గురువుగారు) మనన్ వెతుక్కుంటూ వచ్చారు

ఏతద్విదిత్వా ఉదితే రవౌ సాన్దీపనిర్గురుః
అన్వేషమాణో నః శిష్యానాచార్యోऽపశ్యదాతురాన్



అహో హే పుత్రకా యూయమస్మదర్థేऽతిదుఃఖితాః
ఆత్మా వై ప్రాణినామ్ప్రేష్ఠస్తమనాదృత్య మత్పరాః

మీరు నా కోసం ఇంత కష్టపడ్డారా
లోకములో అందరికీ ఇష్టమైనది శరీరము. అలాంటి శరీరాన్ని నా కోసం కాదనుకుని ఇంత కష్టపడ్డారు

ఏతదేవ హి సచ్ఛిష్యైః కర్తవ్యం గురునిష్కృతమ్
యద్వై విశుద్ధభావేన సర్వార్థాత్మార్పణం గురౌ

ఇదే సచ్చిష్యులు గురువుగారికి నిష్కృతిగా ఆచరించవలసినది.
పరిశుద్ధ భావనతో గురువుగారికి ఆత్మార్పణ చేయడమే నిజమైన కర్తవ్యం..

తుష్టోऽహం భో ద్విజశ్రేష్ఠాః సత్యాః సన్తు మనోరథాః
ఛన్దాంస్యయాతయామాని భవన్త్విహ పరత్ర చ

నేను సంతోషించాను మీ వలన, మీ కోరికలన్నీ సత్యములగు గాక. మీరు చదువుకున్న వేదములన్నీ మరపులేకుండా ఉండుగాక ఉభయలోకాలలో

ఇత్థంవిధాన్యనేకాని వసతాం గురువేశ్మని
గురోరనుగ్రహేణైవ పుమాన్పూర్ణః ప్రశాన్తయే

ఇలా మనం గురువుగారి ఇంటిలో ఉన్నపుడు ఎన్ని ఇబ్బందులు వచ్చాయి. అవి అన్నీ గురువుగారు అనుగ్రహముతో తరించాము.
గురువుగారి దయతోటే మానవుడు పరిపూర్ణుడవుతాడు.

శ్రీబ్రాహ్మణ ఉవాచ
కిమస్మాభిరనిర్వృత్తం దేవదేవ జగద్గురో
భవతా సత్యకామేన యేషాం వాసో గురోరభూత్

నీవు నాతో కలసి ఉన్నపుడు మనం గురుకులములో చేయని పనేమిటి.
నీతో కలసి ఉన్నాను. నీవు అనుకున్నదానిని అనుకున్నట్లు చేసేవాడివి. నీతో కలసి నాకు గురుకులములో నివాసం సంభవించింది. అలాంటపుడు మనం పొందనిదీ సాధించనిదీ ఏమైనా ఉంటుందా

యస్య చ్ఛన్దోమయం బ్రహ్మ దేహ ఆవపనం విభో
శ్రేయసాం తస్య గురుషు వాసోऽత్యన్తవిడమ్బనమ్

పరమాత్మ శరీరం వేదమే. ఆయన శరీరం సకల జగత్తే . పరమాత్మ దేహం సకల శ్రేయస్సులకూ మూల స్థానం.  అటువంటి పరమాత్మ గురుకులములో ఉండడమేమిటి. అది అంతా నీవాడిన ఒక నాటకం.

                                                         సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts