ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై ఐదవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
కామస్తు వాసుదేవాంశో దగ్ధః ప్రాగ్రుద్రమన్యునా
దేహోపపత్తయే భూయస్తమేవ ప్రత్యపద్యత
రుక్మిణీ కృష్ణులకు ఒక కుమారుడు కలిగాడు. పూర్వకాలం తను బాణం వేసిన శంకరుని చేత దగ్ధమైన మన్మధుడు శరీరాన్ని కోల్పోయాడు. మన్మధుడు వాసుదేవుడి అంశ కాబట్టి వాసుదేవున్నే ఆశ్రయించాడు. ఆ మన్మధుడే కొడుకుగా పుట్టాడు రుక్మిణీ కృష్ణులకు
స ఏవ జాతో వైదర్భ్యాం కృష్ణవీర్యసముద్భవః
ప్రద్యుమ్న ఇతి విఖ్యాతః సర్వతోऽనవమః పితుః
అతని పేరు ప్రద్యుమ్నుడు. ఇతను ద్వారకకు దగ్గరలో ఉన్న రాజ్యములో శంబద్రుడు అన్న ఒక్ రాక్షసుడు ఉన్నాడు.
తం శమ్బరః కామరూపీ హృత్వా తోకమనిర్దశమ్
స విదిత్వాత్మనః శత్రుం ప్రాస్యోదన్వత్యగాద్గృహమ్
నారదుడు శంబరుని వద్దకు వెళ్ళి రుక్మిణీ కృష్ణులకు పుట్టబోయేవాడే నిన్ను చంపుతాడు అని చెప్పాడు
తం నిర్జగార బలవాన్మీనః సోऽప్యపరైః సహ
వృతో జాలేన మహతా గృహీతో మత్స్యజీవిభిః
వీరికి ఎపుడు కొడుకు పుడతాడా అని ఎదురు చూస్తూ, పుట్టగానే తన మాయ చేత సముద్రములో పడేస్తే అందులో ఒక పెద్ద చేప మింగింది.
తం శమ్బరాయ కైవర్తా ఉపాజహ్రురుపాయనమ్
సూదా మహానసం నీత్వా వద్యన్సుధితినాద్భుతమ్
మత్స్య కారులు ఆ చేపను పట్టుకున్నారు. అంత పెద్ద చేపను శంబరాసురునికి కానుకగా ఇచ్చారు
దృష్ట్వా తదుదరే బాలమ్మాయావత్యై న్యవేదయన్
నారదోऽకథయత్సర్వం తస్యాః శఙ్కితచేతసః
బాలస్య తత్త్వముత్పత్తిం మత్స్యోదరనివేశనమ్
మన్మధుని భార్య ఐన మాయా దేవి నారదుని ఉపదేశముతో అప్పటికే అక్కడ వంటామెగా చేరింది. ఆ చేపను ఆమెకిచ్చి వండమన్నారు. ఆమె ఆ చేపను కోయగా పిల్లవాడు కనపడ్డాడు.
సా చ కామస్య వై పత్నీ రతిర్నామ యశస్వినీ
పత్యుర్నిర్దగ్ధదేహస్య దేహోత్పత్తిమ్ప్రతీక్షతీ
మళ్ళీ నారదుడే వచ్చి ఆ పిల్లవాడు నీ భర్త, జాగ్రత్తగా పెంచు అని చెప్పగా, చాలా శ్రద్ధగా ప్రేమగా భక్తిగా పెంచింది.
నిరూపితా శమ్బరేణ సా సూదౌదనసాధనే
కామదేవం శిశుం బుద్ధ్వా చక్రే స్నేహం తదార్భకే
నాతిదీర్ఘేణ కాలేన స కార్ష్ణి రూఢయౌవనః
జనయామాస నారీణాం వీక్షన్తీనాం చ విభ్రమమ్
ఎక్కువ కాలం కాకుండానే ఈ పిల్లవాడు నవ యవ్వనుడయ్యాడు.
సా తమ్పతిం పద్మదలాయతేక్షణం ప్రలమ్బబాహుం నరలోకసున్దరమ్
సవ్రీడహాసోత్తభితభ్రువేక్షతీ ప్రీత్యోపతస్థే రతిరఙ్గ సౌరతైః
అతనిలో అన్ని కళ్యాణ గుణాలూ వచ్చిన తరువాత అప్పటిదాకా పెంచిన మాయా దేవి సిగ్గు పడుతూ ఓరచూపు చూస్తూ ఉండగా
తామహ భగవాన్కార్ష్ణిర్మాతస్తే మతిరన్యథా
మాతృభావమతిక్రమ్య వర్తసే కామినీ యథా
అమ్మా ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నావు. మాతృ భావాన్ని విడిచిపెట్టి కామినిలా ప్రవర్తిస్తున్నావు. అంటే
రతిరువాచ
భవాన్నారాయణసుతః శమ్బరేణ హృతో గృహాత్
అహం తేऽధికృతా పత్నీ రతిః కామో భవాన్ప్రభో
నాయనా నీవు నారాయణుని పుత్రుడివి, నిన్ను శంబరుడు సముద్రములో పడవేశాడు, నేను నీకు పత్నిని, నా పేరు రతి, నీవు కాముడవు. పురిటిలోనే నిన్ను ఈ రాక్షసుడు అపహరించి సముద్రములో పడేస్తే, నిన్ను చేపను మింగితే ఆ చేప కడుపులోఉ ఉన్న నీవు చేపతో బాటుగా ఇక్కడకు వచ్చావు. నారదుడు నాతో నిన్ను జాగ్రత్తగా పెంచమని చెప్పాడు
ఏష త్వానిర్దశం సిన్ధావక్షిపచ్ఛమ్బరోऽసురః
మత్స్యోऽగ్రసీత్తదుదరాదితః ప్రాప్తో భవాన్ప్రభో
తమిమం జహి దుర్ధర్షం దుర్జయం శత్రుమాత్మనః
మాయాశతవిదం తం చ మాయాభిర్మోహనాదిభిః
ఈ రాక్షసున్ని నీవు చంపాలి, ఇతను మహా మాయావి. అతని మాయను జయించే మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆ మంత్రముతో నీవు సిద్ధిని పొంది ఆ రాక్షసుని మీదకు యుద్ధానికి వెళ్ళు అని చెప్పి ఆ మహా విద్యను తాను బోధించింది.
పరీశోచతి తే మాతా కురరీవ గతప్రజా
పుత్రస్నేహాకులా దీనా వివత్సా గౌరివాతురా
ప్రభాష్యైవం దదౌ విద్యాం ప్రద్యుమ్నాయ మహాత్మనే
మాయావతీ మహామాయాం సర్వమాయావినాశినీమ్
ఆ విద్యలో సిద్ధి పొంది శంబరుని మీదకు దండేత్తి వెళ్ళి యుద్ధానికి ఆహ్వానించాడు
స చ శమ్బరమభ్యేత్య సంయుగాయ సమాహ్వయత్
అవిషహ్యైస్తమాక్షేపైః క్షిపన్సఞ్జనయన్కలిమ్
సోऽధిక్షిప్తో దుర్వాచోభిః పదాహత ఇవోరగః
నిశ్చక్రామ గదాపాణిరమర్షాత్తామ్రలోచనః
ఆ రాక్షసుడు కూడా అసహనముతో ఎర్రబారిన కళ్ళతో గదను తీసుకుని అతని మీదకు వచ్చాడు
పరస్పరం యుద్ధం చేసుకున్నారు. ప్రద్యుమ్నుడు వశం కాకపోవడం గమనినంచి శంబరుడు తన మాయను ప్రయోగించాడు
గదామావిధ్య తరసా ప్రద్యుమ్నాయ మహాత్మనే
ప్రక్షిప్య వ్యనదన్నాదం వజ్రనిష్పేషనిష్ఠురమ్
తామాపతన్తీం భగవాన్ప్రద్యుమ్నో గదయా గదామ్
అపాస్య శత్రవే క్రుద్ధః ప్రాహిణోత్స్వగదాం నృప
స చ మాయాం సమాశ్రిత్య దైతేయీం మయదర్శితమ్
ముముచేऽస్త్రమయం వర్షం కార్ష్ణౌ వైహాయసోऽసురః
తన మాయతో రక రకాల వర్షాలు కురిపించాడు. అపుడు రతి బోధించిన మహా విద్యను ప్రయోగించాడు. అపుడు ఆ మాయలన్నీ మాయమైపోయాయి. అపుడు ఖడ్గముతో శంబరాసురుని శిరస్సుని హరించాడు
బాధ్యమానోऽస్త్రవర్షేణ రౌక్మిణేయో మహారథః
సత్త్వాత్మికాం మహావిద్యాం సర్వమాయోపమర్దినీమ్
తతో గౌహ్యకగాన్ధర్వ పైశాచోరగరాక్షసీః
ప్రాయుఙ్క్త శతశో దైత్యః కార్ష్ణిర్వ్యధమయత్స తాః
నిశాతమసిముద్యమ్య సకిరీటం సకుణ్డలమ్
శమ్బరస్య శిరః కాయాత్తామ్రశ్మశ్ర్వోజసాహరత్
ఆకీర్యమాణో దివిజైః స్తువద్భిః కుసుమోత్కరైః
భార్యయామ్బరచారిణ్యా పురం నీతో విహాయసా
దేవతలు శంబరాసుర సంహారాన్ని చూచి అతని మీద పుష్ప వర్షం కురిపించారు.
అన్తఃపురవరం రాజన్లలనాశతసఙ్కులమ్
వివేశ పత్న్యా గగనాద్విద్యుతేవ బలాహకః
శతృ విజయాన్ని సాధించి భార్యను తీఎసుకుని విమానములో బయలు దేరి ద్వారకా నగరానికి వచ్చారు
తం దృష్ట్వా జలదశ్యామం పీతకౌశేయవాససమ్
ప్రలమ్బబాహుం తామ్రాక్షం సుస్మితం రుచిరాననమ్
ద్వారకా నగర పుర వీధులలో భార్యా భర్తలు వస్తోంటే అతనిని చూచిన స్త్రీలు కృష్ణుడే అనుకుని సిగ్గుతో కాస్త లోకపలకు దాక్కున్నారు. మళ్ళీ జాగ్రత్తగా చూచి కృష్ణుడి లాంటి వాడు కానీ కృష్ణుడు కాదు అని తెలుసుకున్నారు.
స్వలఙ్కృతముఖామ్భోజం నీలవక్రాలకాలిభిః
కృష్ణం మత్వా స్త్రియో హ్రీతా నిలిల్యుస్తత్ర తత్ర హ
అవధార్య శనైరీషద్వైలక్షణ్యేన యోషితః
ఉపజగ్ముః ప్రముదితాః సస్త్రీ రత్నం సువిస్మితాః
ఆయన కాదని తెలుసుకుని ముందుకు వచ్చారు
అథ తత్రాసితాపాఙ్గీ వైదర్భీ వల్గుభాషిణీ
అస్మరత్స్వసుతం నష్టం స్నేహస్నుతపయోధరా
అచ్చం కృష్ణునిలాగే ఉన్నారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటే ఆ మాట విని రుక్మిణి కూడా బయటకు వచ్చింది. తన కొడుకు బ్రతికి ఉంటే ఈపాటికి ఇలాగే ఉండి ఉండేవాడు
కో న్వయమ్నరవైదూర్యః కస్య వా కమలేక్షణః
ధృతః కయా వా జఠరే కేయం లబ్ధా త్వనేన వా
ఈ పుండరీకాక్షుడు ఎవరు, ఏ తల్లి ఇతనిని తొమ్మిది నెలలు మోసింది. నా కొడుకు బతికి ఉంటే ఇంతటి వాడే అయి ఉండేవాడు
మమ చాప్యాత్మజో నష్టో నీతో యః సూతికాగృహాత్
ఏతత్తుల్యవయోరూపో యది జీవతి కుత్రచిత్
కథం త్వనేన సమ్ప్రాప్తం సారూప్యం శార్ఙ్గధన్వనః
ఆకృత్యావయవైర్గత్యా స్వరహాసావలోకనైః
ఆకారములో గానీ అవయవాలతో గానీ గమనముతో గానీ మాటా నవ్వు చూపూ ఇలా కృష్ణ పరమాత్మతో సామ్యం పొంది ఉన్నాడు. తను అతనే ఐ ఉంటాడా
స ఏవ వా భవేన్నూనం యో మే గర్భే ధృతోऽర్భకః
అముష్మిన్ప్రీతిరధికా వామః స్ఫురతి మే భుజః
ఏవం మీమాంసమణాయాం వైదర్భ్యాం దేవకీసుతః
దేవక్యానకదున్దుభ్యాముత్తమఃశ్లోక ఆగమత్
ఇతనిని చూస్తే నా హృదయములో ప్రేమ పెల్లుబికుతోంది. ఇలా అనుకుంటూ ఉంటే ఆ మాట కృష్ణుడిదాకా వెళ్ళింది. ఆయన తల్లి తండ్రుల వద్ద ఉన్నాడు.
విజ్ఞాతార్థోऽపి భగవాంస్తూష్ణీమాస జనార్దనః
నారదోऽకథయత్సర్వం శమ్బరాహరణాదికమ్
అన్నీ తెలిసిన్ స్వామి కూడా నాలాగే ఉన్నాడన్న ఆశ్చర్యాన్ని ప్రకటించి చూస్తూ కూర్చున్నాడు. అపుడు నారదుడు వచ్చి మొత్తం విషయాన్ని చెప్పాడు
తచ్ఛ్రుత్వా మహదాశ్చర్యం కృష్ణాన్తఃపురయోషితః
అభ్యనన్దన్బహూనబ్దాన్నష్టం మృతమివాగతమ్
ఈ విషయాన్ని విని అంతః పుర స్త్రీలంతా మహాశ్చర్యం పొంది రుక్మిణీ కృష్ణులనూ ప్రద్యుమ్నుడినీ భార్యనూ కూడా అభినందించారు
ఎపుడో వెళ్ళి ఇన్నేళ్ళకు వచ్చాడు, చనిపోయిన వాడు బతికి వచ్చినంత ఆనందముగా ఉంది
దేవకీ వసుదేవశ్చ కృష్ణరామౌ తథా స్త్రియః
దమ్పతీ తౌ పరిష్వజ్య రుక్మిణీ చ యయుర్ముదమ్
పిల్లవాడిని దగ్గర తీసుకుని దంపతులను ఆలింగనం చేసుకుని తన పుత్రున్ని దగ్గరకు తీసుకుని అమితానందాన్ని పొందింది.
నష్టం ప్రద్యుమ్నమాయాతమాకర్ణ్య ద్వారకౌకసః
అహో మృత ఇవాయాతో బాలో దిష్ట్యేతి హాబ్రువన్
రుక్మిణీ కృష్ణుల అదృష్టమే అదృష్టం.కొడుకు పుట్టాడనుకున్నారు. కానీ వెంటనే పోయాడు. పోయిన కొడుకు మళ్ళీ దొరికాడు
యం వై ముహుః పితృసరూపనిజేశభావాస్
తన్మాతరో యదభజన్రహరూఢభావాః
చిత్రం న తత్ఖలు రమాస్పదబిమ్బబిమ్బే
కామే స్మరేऽక్షవిషయే కిముతాన్యనార్యః
కృష్ణుని భార్యలే అతన్ని చూచి కృష్ణుడే అనుకుని మోహం పొందితే వేరే స్త్రీలు మోహం పొందడములో ఆశ్చర్యం ఏముంది. అతని సౌందర్యం చూచి స్త్రీలందరూ మోహం చెందారు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు