గృహ నిర్మాణానికి స్థలం ఎంపికే ఆయువు పట్టు. ఇంటి నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసుకునే ముందు కొనుగోలు చేయబోయే స్థలం గురించి జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా.. స్థలం దిశల కోణాలను నిశింతంగా పరిశీలించాలి. ఎంపిక చేసుకునే స్థలం చతుర్రసాకారంలో ఉండేలా చూసుకోవాలి. లేని పక్షంలో.. మూలలకు సంబంధించిన దోషాలు కలిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని దిశల స్థలాలను పరిశీలించినట్టియితే.. వాటి వల్ల కలిగే లాభ నష్టాలను పరిశీలిద్దాం.
* దక్షిణ ఆగ్నేయం పెరిగిన స్థలం మంచిది కాదు. అయితే.. ఇలాంటి స్థలాలను సరి చేసుకోవచ్చు.
* నైరుతి మూలను.. మూలమట్టాల నుంచి 90 డిగ్రీలు చేసి తూర్పు భాగానికి తాడును లాగి హద్దు చేసుకుని మిగిలిన స్థలాన్ని వదిలివేయడం మంచిది. అలాగే.. దక్షిణ నైరుతి పెరిగిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టకుండా ఉంటే మంచిది. గత్యంతరం లేని పక్షంలో ఈ స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టదలిస్తే.. మూలలను సరిచేసుకోవడం మంచిది. దక్షిణ నైరుతి పెరిగిన స్థలాన్ని సరి చేసుకునేందుకు ఆగ్నేయ మూలను మూలమట్టాన్ని వుంచి 90 డిగ్రీలుగా పడమరకు తాడును లాగి, హద్దు చేసుకుని మిగిలిన స్థలాన్ని వదిలివేయాలి.* ఇకపోతే.. తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం పెరిగిన స్థలం ఇంటి నిర్మాణానికి పనికిరాదు. దీన్ని నివారించాలంటే.. ఈశాన్యం మూలన మూలమట్టాన్ని ఉంచి 90 డిగ్రీలు చూసి, దక్షిణ భాగానికి తాడులాగి హద్దు చేసి, అలాగే.. నైరుతిమూలన మూల మట్టం నుంచి 90 డిగ్రీలు చూపి తూర్పు భాగా నికి తాడులాగి హద్దు చేసుకుని, మిగిలిన స్థలాన్ని వదిలివే యాలి.
గృహనిర్మాణానికి పనికిరాని స్థలాలు...
ఇంటి నిర్మాణానికి అనుకూలమైన స్థలాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని వాస్తు శాస్త్రా పేర్కొంటున్నాయి. అందులో ముఖ్యంగా భారతీయ వాస్తు శాస్త్రాలు తెలిపిన, గృహనిర్మాణానికి పనికిరాని స్థలాల్ని పరిశీలిస్తే...
1. స్థలములోని నాలుగు భుజములు హెచ్చుతగ్గులుగా ఉన్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్న స్థలం అశుభాలను కలిగిస్తుంది.
2. స్థలము లోని పొడవు ఎక్కువగా ఉండి, భుజములు హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారోగ్యం కలిగిస్తుంది.
3. చేట ఆకారంలో గల స్థలం కూడా మంచిది కాదు. ఎంత సంపాదించినా నిలువ ఉండటం అసాధ్యం. క్రమంగా దారిద్య్రానికి దారితీస్తోంది. నిరంతరం మానసిక అశాంతికి గురికావటం జరుగుతుంది.
4. డమరకపు ఆకారంలో ఉండే స్థలము మంచిది కాదు. సంతానం కలగటంలో సమస్యల, నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయి.
5. లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలము ఆర్థిక పతనానికి దారి తీస్తోంది.
6. కుంభాకార స్థలం, భయం, అంటు వ్యాధులు, సుఖశాంతులు లోపించటం జరుగుతుంది.
7. విసన కర్ర ఆకార స్థలం... ఎటువంటి ఆస్తిమంతుల్నైనా ఆర్థికంగా అణగారిపోయేలా చేస్తుంది.
8.మద్దెల ఆకారంలో గల స్థలాలు భాగస్వాముల మధ్య వివాదాలను విడిపోయే ఆస్కారాలను అధికంగా కలిగిస్తాయి.
9. అర్థ చంద్రాకార స్థలాల వలన మానసిక భ్రాంతి కలుగుతుంది. తరచుగా దోపిడీలు జరుగుతుంటాయి.
గృహాలకు మెట్టను ఎలా నిర్మంచుకోవాలి....ఇంటికి మెట్లను నిర్మించటంలో కొన్ని పద్ధతులను పాటించాలని వాస్తు శాస్త్రాలు తెలుపుతున్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లలను ఏవిధంగా నిర్మిస్తే శుభదాయకాలనే అంశాలను పరిశీలిస్తే..
1. మేడపైకి మెట్లు నిర్మించేటపుడు ఒక వరుస మెట్లను... తూర్పు నుండి పడమరకు లేదా, ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కే విధంగా నిర్మించాలి.
2. రెండు వరుసలుగా నిర్మించేటపుడు.. మొదటి వరుస మెట్లను.. తూర్పు నుండి పడమరకు వెళ్ళే విధంగానూ, రెండవ వరుస మెట్లు ఏ దిక్కుకైనా తిరిగినా పడమర నుండి తూర్పుకు ఎక్కే విధంగా నిర్మించాలి.
3. రెండు వరుస మెట్లను నిర్మించేటపుడు ఒక వరుస ఉత్తరం నుండి దక్షిణం వైపు ఎక్కేవిధంగాను, రెండవ వరుస.. ఎటు తిరిగినా దక్షిణము నుండి ఉత్తరం ఎక్కే విధంగా నిర్మించుకోవచ్చు.
4. మెట్లను ‘ఎల్’ ఆకారంలో ఉండే విధంగా నిర్మించాలనుకునేవారు ముందు తూర్పు నుండి పడమరకు గానీ, లేదా ఉత్తరం నుండి దక్షిణానికి గానీ ఎటువైపుకైనా నిర్మించుకోవచ్చు.
5 గృహానికి వెలుపలి భాగంలో నిర్మించదలచే వారు... ఈశాన్య, వాయవ్య, నైఋతి, ఆగ్నేయాలలో ఏ భాగంలో నైనా నిర్మించుకోవచ్చు.
6. ఈశాన్య దిక్కుగా మెట్లను నిర్మించేటప్పుడు గృహానికి తూర్పు, ఈశాన్యము, లేదా ఉత్తర- ఈశాన్యాలవైపు నిర్మించుకోవచ్చు.
7. ఈశాన్యం వైపు నిర్మించే మెట్లు ప్రహరీ గోడకు సమీపంలో ఉండకూడదు.