పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీ కృష్ణ భగవానుడి రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడుశ్రీ కృష్ణుడు వ్రతకథతో సహా వ్రత విధానాన్ని వివరించాడు.
సప్తమి తిథిన సూర్యోదయానికి ముందే నెత్తిమీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకుని స్నానం చేయాలి. ఈ తర్వాత శక్తికొద్దీ బంగారంతో కాని, వెండితో కాని రథాన్ని చేయించి దానికి ఏడు గుర్రాలను, సూతుడిని అమర్చాలి. అందులో సూర్యప్రతిమను పెట్టాలి. ఒక కొత్త గుడ్డను పరిచి దానిమీద ఈ రథాన్ని ఉంచాలి. సాయంకాలం వరకూ ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది, సరోవర తీరాలలో చెయ్యడం మేలు. ఆ మరునాడు సూర్యుడికి మళ్లీ పూజలు చేసి దానధర్మాలు, వ్రత పారాయణ అనంతరం రథాన్ని, సూర్యప్రతిమను ఉత్తములూ, అర్హులూ అయిన వారికి దానమివ్వాలి.
పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక లేక ముసలితనంలో ఓ కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు. జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్నివైద్యాలు చేయించినా ఫలింతం లేకపోయే సరికి క్రాంత ధర్శనులైన ఋషూలను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషూలు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గత జన్మనంతటినీ అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవరికీ కొద్దిపాటి దానం కూడా చేయలేదు. అయితే అతడు జీవితం చివరిదశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథ సప్తమి వ్రతాన్ని చూసాడు అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్యం కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలుండి దానం చెయ్యని పాపానికి రాజకుటుంబంలో జన్మించినా నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషూలు చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండిబయట పడటానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. అప్పుడు ఆ ఋషూలు రథసప్తమీ వ్రతాన్ని శాస్త్ర విధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు.
మాఘ శుద్ధ షష్ఠినాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది, చెరువు, నుయ్యి ఇలా ఏదో ఒకచోట స్నానం చేయాలి. ఆ తరువాత సూర్య ఆలయానికి వెళ్లి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిథిన సూర్యోదయానికి ముందే నెత్తిమీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకుని స్నానం చేయాలి. ఈ తర్వాత శక్తికొద్దీ బంగారంతో కాని, వెండితో కాని రథాన్ని చేయించి దానికి ఏడు గుర్రాలను, సూతుడిని అమర్చాలి. అందులో సూర్యప్రతిమను పెట్టాలి. ఒక కొత్త గుడ్డను పరిచి దానిమీద ఈ రథాన్ని ఉంచాలి. సాయంకాలం వరకూ ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది, సరోవర తీరాలలో చెయ్యడం మేలు. ఆ మరునాడు సూర్యుడికి మళ్లీ పూజలు చేసి దానధర్మాలు, వ్రత పారాయణ అనంతరం రథాన్ని, సూర్యప్రతిమను ఉత్తములూ, అర్హులూ అయిన వారికి దానమివ్వాలి. ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని కాంభోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషూలు చెప్పిన విషయాన్ని కృష్టూడు ధర్మరాజుకు చెప్పాడు.ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రథం లాంటివి లేకపోయినా చిక్కుడు కాయలతో చేయడం కనిపిస్తుంది.
‘‘యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మను తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ’’
ఏటా మాఘశుద్ధ సప్తమినాడు తలమీదా, భుజాలమీదా, మోచేతి మడతలమీద, అరచేతుల్లోనూ (మొత్తం ఏడు) జిల్లేడాకులు ఉంచుకుని పై పద్యం చదువుతూ సూర్యుడికి నమస్కరించి స్నానం చేయడం మన సంప్రదాయం. గత ఏడు జన్మలలోనూ నేను చేసిన పాపాలను, రోగాలను, శోకాలనూ, మకర రాశిలోని సప్తమి హరించు గాక అని దీనర్థం. ఆ రోజున హిందువులంతా సూర్యుణ్ణి పూజించి ఆరు బయటక సూర్యకాంతి పడే ప్రదేశంలో పిడకల మంట మీద పరమాన్నం వండి దాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు. చిక్కుడు కాయలతో రథం తయారు చేసి దినకరుడికి సమర్పించుకుంటారు.ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే..
రథ సప్తమి నాడు స్నానం చేసేటప్పుడు పలించే శ్లోకం
శ్లో యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు
తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమీ
రథ సప్తమినాడు స్నానం ఏసేటప్పుడు జిల్లేడు ఆకు, రేగు పండు తల మీద ఉంచుకుని ఈ శ్లోకం పఠిస్తే ఏడు జన్మలనుంచి వెన్నంటి వస్తున్న సమస్త పాపాలు నశిస్తాయి.
పురాణాల ఆధారంగా : ఈరోజు సూర్య జయంతి. ఏడు గుర్రాలు కలిగిన ఏకచక్ర రథంపై రెండు చేతులా తెల్లటి పద్మాలు ధరించి ఉషస్సమయాన ఉదయించే ప్రత్యక్ష నారాయణుడి పుట్టినరోజు. రామాయణ, భారతాలకు సూర్యుడితో గట్టి సంబంధమే ఉంది.రాముడిది రఘుపంశం. అంటే ఆయన సూర్యవంశజుడన్న మాట! అగస్త్యుడు శ్రీ రాముడికి బోధించిన మంత్రాలే ఆదిత్య హృదయంగా ప్రాచుర్యం పొందాయి. తనను పండుగా భావించి మింగేయబోయిన చిన్నారి హనుమంతుడికి గురువుగానూ రామాయణంలో కనిపిస్తాడు సూర్యుడు.అటు భారతంలోనూ కర్ణుని పాత్ర గురించి ప్రత్యేకంగా ఎప్పనక్కరలేదు. దుర్వాస మహాముని నుంచి మంత్రోపదేశం పొందిన కుంతికి ముందుగా గుర్తొచ్చింది సూర్యుడే. సత్రాజిత్తుకు శమంతకమనిని, ధర్మరాజుకు అక్షయపాత్రనూ, ఇచ్చింది భాస్కరుడే.
ఈ రోజు ఖగోళపరంగా:- సూర్యుడు తన సంచార గతిని మార్చుకునే రోజు అని చెప్పవచ్చు, ఈరోజెనుంచే భూమి సూర్యుడికి దగ్గరవటం ప్రారంభిస్తుంది. ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించటం మొదలవుతుంది.