Followers

Thursday, 20 June 2013

పంచాంగం విషయాలు

  1. అక్షయ తృతీయ,విజయదశమి,కార్తీక మాసంలో శుక్లపక్ష పాడ్యమి రోజున సాయంత్రం వరకు సాడేతీన్ ముహూర్తములు అంటారు. ఈ దినములలో పంచాంగం చూడకుండానే ప్రతి శుభకార్యం ప్రారంభించవచ్చు.
  2. రాహు కాలంలో శుభకార్యాలు,గులికకాలంలోఆశుభకార్యాలు ప్రారంభించరాదు.
  3. తిధులు: రెండు పక్షములన్దున చవితి,షష్టి,అష్టమి,నవమి,ద్వాదశి,చతుర్ధశి తిధులలో మంచి పనులు మొదలుపెట్టకూడదు. అమావాస్య రోజు పితృ కర్మలు చేయవచ్చును.శుభ కార్యాలు చేయరాదు.
  4. గ్రహణం పట్టుచుండగా స్నానం,పూర్తిగా పట్టినపుడు జపము,విడచిన పిమ్మట స్నానం చెయ్యాలి. గ్రహణం తర్వాత ఏడు రోజులు ఎటువంటి శుభకార్యాలు చేయరాదు.
  5. ప్రయానమునందు అపశకునము కలిగిన కాళ్ళు కడుగుకొని, కాస్త విశ్రమించి, బెల్లమును తిని బయలుదేరాలి.
  6. శన్యూషః కాలం: అనగా శనివారం రోజు సూర్యోదయమునకు ముందు రెండు ఘడియల (నలుభది ఎనిమిది నిముషాలు)నుంచి సూర్యోదయం వరకు వుండే కాలాన్ని శన్యూషః కాలం అంటారు. ఆ సమయంలో ఏ మంచి పని మీద అఐ నను ప్రయాణం మొదలెడితే, ఆ పని తప్పక నెరవేరుతుంది. అంటే ఆ సమయంలో ప్రయాణం చెయ్యాలి.

Popular Posts