Followers

Monday, 17 June 2013

కార్యాచరణ గీతవల్లే సాధ్యం

నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.

Bhagavad-Gitaశ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయంః సాంఖ్యాయోగః

శ్లోకంః కథం భీష్మ మహం సంఖ్యే

ద్రోణం చ మధుసూదన!

ఇషుభిః ప్రతియోత్స్యామి

పూజార్హా వరిసూదన 
హే శ్రీకృష్ణా ! నీవు అసురులను మాత్రమే సంహ రించితివని వింటిని, బంధువులను కాదుగదా! భక్తులకు శత్రువులైనవారిని గూడ సంహరించెదవని తెలియునుగాని, గురువులను కాదుగదా! ద్రోణుడు నాకు గురువు, భీష్ముడు మాకు పితామహుడు. వీరిరువురను సంహరించమనుట నీకు తగునా? సాందీపుడు మొదలగు గురువులను నీవు సంహరింపలేదు. పుష్పాదులతో పూజించితివి. నాకు వీరున్నూ అట్లు పూజింపదగినవారై యుండగా వీరిని బాణములతో ఎదిరించి పోరాడమనుచున్నావే? ఇది నీకు తగునా? ఎట్లు చేయగలను నేనీ యుద్ధము? 
శ్లోకంః నచైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వాజయేమ యది వా నో జయేయు
యానేవ హత్వా న జిజీవిషామః
తే‚ వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః 

యుద్ధము చేయుట మంచిదో, కాదో ఏది యుక్తమో మాకు తెలియకున్నది. కృష్ణా! ఒకవేళ యుద్ధమే జరిగితే మేమే జయింతుమో, లేదా వారే జయింతురో చెప్పుట కష్టము గద! అయినా ఏ సోదరుల ఎడబాటు క్షణమైనా ఓర్వజాలమో, అట్టివారిని చంపివేసినచో, మరి జీవించగలమా కృష్ణా ! కాని, ఆ పెదనాన్న గారి పుత్రులు కౌరవులు యుద్ధ సన్నద్ధులై యుద్ధరంగమున ఎట్టెదుట చంపుటకో, చనిపోవుటకో సంసిద్ధులై నిలచియున్నారే. నాకిది కష్టముగా యున్నది. అంటాడు అర్జునుడు. కాని ఏమనాలి? మమ్ము చెప్పరాని కష్టాలకు బటిచేసినవారిని చంపకుండ మేమెట్లు జీవించగలము.

Popular Posts