ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం ఈ నాలుగు వేదాలు.
కృతయుగంలో దేవతలు రాక్షసులు ఒకటిగా చేరి క్షీరసాగర మధనం. ఆ సాగరమధనం నుండి శ్రీమహాలక్ష్మీ, కౌస్తుభామణి, ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు, దివ్యరత్నరాశులు. ఉచ్చైశ్శ్రవము, అమృతము పుట్టాయి. అన్నికంటే ముందుగా పుట్టింది హాలాహలం. అమృతంతో తరువాత ‘ధన్వంతరి’ జన్మించాడు. ఈయనను మహావిష్ణువు అవతారంగా భావిస్తారు. ధన్వంతరి జన్మిస్తూనే ఒక చేతిలో అమృతభాండాన్ని మరొక చేత ఆయుర్వేదాన్ని, పట్టుకొని ప్రత్యక్షమై వచ్చారు. ఈ ఆయుర్వేదమే సకల మానవకోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించే జీవనవేదం. ఈ ఆయుర్వేదాన్ని అధర్వణవేదానికి ఉపవేదంగా చెబుతారు.
శ్రీమహావిష్ణువు ప్రతిరూపమైన ధర్వంతిరియే రోగ మరణభయంలేని అమృతాన్ని దేవతలకు యిచ్చి అజరామరులుగా చేసాడు. పంచమవేదంగా ఆయుర్వేద భండారాన్ని బ్రహ్మదేవునికి ఇచ్చాడు శ్రీధన్వంతరి.
ఈ ఆయుర్వేదం బ్రహ్మదేవుని నుండి దక్షప్రజాపతికి లభించింది. దక్ష ప్రజాపతినుండి సురలోక వైద్యులైన అశ్వినీ కుమారులకు సంక్రమించింది.