నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతిఇంటా పఠించవలసిన భగవద్గీత పారాయణం చేయడం చాలా మందికి వీలుపడని విషయం. అందుకే కనీసం రోజుకి రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.
శ్రీమద్భగవద్గీత- ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోం
దృతరాష్ట్ర ఉవాచ.
యథాభాగ మవస్థితాః
భీషె్మై మేవాభిరక్షంతు
భవంత స్సర్వ ఏవ హి
ఆచార్యా! భీష్ముడు పాండవ సేనను మాత్రమే చంపుతాడు. పాండవుల్ని చంపడు. కనుక పాండవులు భీష్ముని హింసించడానికి ప్రయత్నిస్తారు. మీమీ యోగ్య స్థానాల్ని వదలకుండా అప్రమత్తతతో భీష్మ పితామహుని మాత్రం జాగ్రత్తగా కాపాడండి.
శ్లోకంః తస్య సంజనయన్ హర్షం
కురువృద్ధః పితామహః
సింహనాదం వినద్యోచె్చైః
శంఖం దధ్మౌ ప్రతాపవాన్
కురువృద్దుడు, అత్యంత పరాక్రమవంతుడు అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని పిరికితనమును గ్రహించి, అతనికి ఉత్సాహం పుట్టించదలచి హుర్రే..అని ఒక సింహగర్జన చేసి శంఖమును పూరించాడు.