ప్రకాశం జిల్లా అద్డంకి దగ్గర్లో ఉన్న శింగరకొండలో లక్ష్మీ నృశింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వాముల దేవాలయాలు చాలా ప్రసిద్ధిచెందాయి. శింగరకొండపై లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉండగా కొండ దిగువన చెరువు ఒడ్డున ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంది. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే భూతప్రేత పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని స్థానికులు చెప్తారు.
లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని 14వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.క్షేత్ర మాహత్యాన్ని అనుసరించి, 14వ శతాబ్దానికి చెందినా సింగన్న అనే నృసింహస్వామి అనే భక్తుడు ఉండేవాడు. సింగన్న కూతురు నరసమ్మ. ఆమె రోజూ ఆవులను మేపేందుకు కొండమీదికి వెళ్ళేది. ఆ ఆవుల్లో ఒక ఆవు పాలు ఇవ్వకపోవడాన్ని సింగన్న గమనించాడు. ఒకటి రెండు రోజులైతే అనారోగ్యం అనుకోవచ్చు. కానీ ఇన్నిరోజులఆటు ఎందుకు ఇవ్వడంలేదా అని ఆలోచించాడు. అసలు సంగతి ఏమిటో కనిపెట్టాలని సింగన్న కూడా కొండమీదికి వెళ్ళాడు. పాలు ఇవ్వని ఆవును అనుసరించి వెళ్ళాడు. ఆవు కొండపైన ఒక రాయి దగ్గరికి వెళ్ళింది. ఆ రాతిలోంచి ఒక బాలుడు ఉద్భవించి, ఆవుపాలను తాగి వెళ్ళడం చూసిన సింగన్న ఆశ్చర్యానికి అంతులేదు. తన ఆరాధ్య దైవం అయిన నృసింహ స్వామి బాలుని రూపంలో వచ్చి పాలు తాగడంతో సింగన్న మహదానందపడిపోయాడు.. తన కళ్ళతో రాయి నుండి బాలుడు రావడం చూశాడు గనుక ఆ రాతిని పరమ పవిత్రంగా భావించి అక్కడే నృసింహ స్వామికి దేవాలయం కట్టించాడు.
ప్రసన్నాంజనేయ స్వామి స్థల పురాణానికి వస్తే, శింగరకొండపై లక్ష్మీ నృసింహస్వామి ఆలయ నిర్మాణం జరుగుతున్న దశలో ఒక మహాయోగి ఆ గ్రామానికి విచ్చేసి, కొండ దిగువన చెరువు గట్టున ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెళ్ళాడు. అలా మహర్షి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడం కొండమీద ఆలయ పనిలో ఉన్నవారెందరో చూశారు. వాళ్ళు కొండ దిగి వచ్చి చూసేసరికి ఆ పుణ్యమూర్తి కనిపించలేదు. మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహోజ్వలంగా వెలిగిపోతూ కనిపించింది. దాంతో ఆ గ్రామస్తులు, చుట్టుపక్కలవారు కలిసి, లక్ష్మీ నృసింహ దేవాలయ నిర్మాణం పూర్తయ్యాక కొండ దిగువన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా కట్టించారు