Followers

Sunday, 9 June 2013

గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోతే శ్రేయస్కరమా ?

ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్నిసార్లు గృహ నిర్మాణాన్ని మధ్యలోనే 
ఆపేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు వాస్తు రీత్యా 
ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇలాంటి సమయంలో 
తప్పకుండా పూర్తి చేయాల్సిన పనులేమిటి? పూర్తి చేయాల్సివస్తే.. ఏఏ 
నిర్మాణాలను పూర్తి చేయాలి 
House_Under_Constructionకొత్త ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోతే చాలామంది.. నిర్మాణాన్నంతటినీ ఆపివేస్తారు. కొంతమందికి కొన్నింటిని పూర్తి చేయాలని తెలిసినా.. వేటిని పూర్తిచేయాలో, వేటిని వదిలేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇంటి నిర్మాణాన్ని మధ్యలో ఆపివేయడం వాస్తూ రీత్యా అనేక దోషాలకు కారణమవుతుంది. అందువల్ల ఇల్లు నిర్మించేటప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటి పనులను ఆపవలసి వస్తే ప్రత్యేకించి కొన్నింటిని మాత్రమే వాయిదావేయాలి. మిగిలినవి తప్పకుండా పూర్తి చేయవలసి ఉంటుంది. అవేమిటో ఓసారి పరిశీలిస్తే...
* ఇల్లు కట్టేటప్పుడు ఇంటిలోపల ఫ్లోరింగ్‌ ఆపవచ్చు. కానీ వాస్తు రీత్యా ఆర్డినరీ గచ్చు వాటాన్ని వేయాలి. అంతేకాదు ఇంటి లోపలలో లెవల్‌ పెట్టకూడదు.
House_Under_Construction1* లోపల గదులకు ద్వారాలు, కిటికీలు, కప్‌ బోర్డులు, షో కేసులు తదితర వాటికి సంబంధించిన చెక్కపని ఆపవచ్చు.
* ఇంటిలోపల టాయ్‌లెట్‌ కోసం గది నిర్మించినప్పటికీ లోపల పనిముట్లు పెట్టకుండా వాయిదా వేయవచ్చు.
* ఇంటి ఫ్లోరింగ్‌కు సంబంధించి అన్ని గదుల్లోనూ టైల్స్‌ పని ఆపవచ్చు.
* ఇంటి ఆవరణలో సిమెంట్‌ చేయించటం ఆపవచ్చు. కానీ వాస్తురీత్యా మట్టి వాటం వచ్చేటట్లు వేయించాలి.
* అలాగే ఇంటికి గచ్చు వేయించేదాకా మట్టి కొట్టుకుపోకుండా జాగ్రత్తపడాలి. పూజగది కట్టిన తర్వాత దానిలోని అలంకరణకు సంబంధించిన పని.. అనగా టైల్సు వేయటం వంటి మొదలైన పనులను వాయిదా వేసుకోవచ్చు.
House_Under_Constructio* గ్రిల్‌కు సంబంధించిన ్వదారాలు, కాంపౌండ్‌ గేట్లు ఆపుచేసుకోవచ్చు. అదేవిధంగా మెట్లు కట్టకుండా వాయిదా వేసుకోవచ్చు.
* కిటకీలకు గుమ్మాలకు రంగులు వేయటం ఆపేయవచ్చు.
* ఇంటికి సంబంధించిన కాంపౌండ్‌ వాల్‌ను ఆపవచ్చు కానీ, గోడ కట్టు మాత్రం సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి.
* పెద్ద ఇంటికి ప్లాను వేయించి అందులో కొంత ఇప్పుడు కట్టి భవిష్యత్తులో మిగిలిన దానిని కట్టుకోవచ్చు.
* శ్లాబు వాస్తురీత్యా వాటం సరిగా లేనప్పుడు శ్లాబుపై ప్లాస్టరింగ్‌లు, ఫినిషింగ్‌లు తప్పనిసరిగా చేయించాలి.
* ఇంటిలోపల ఉన్న టాయిలెట్లు వాడకంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా తలుపులు ఉండాలి.
* అదేవిధంగా గృహ ఆవరణలో మట్టి నింపే పని ఉన్నపుడు దానిని అసంపూర్ణంగా వదిపెట్టకూడదు.
* మేడ మీద, మెట్ల మీద పిట్ట గోడలు కట్టకుండా ఆపకూడదు. బయట ద్వారాలకు తలుపులు పెట్టకుండా ఆపనే కూడదు.
* గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత గృహప్రవేశం చేయకుండా ఉండకూడదు.
* గృహనిర్మాణం పూర్తయిన తరువాత గృహ ఆవరణలో ఆగ్నేయ, నైరుతి, పశ్చిమ, వాయవ్య దిశలలో పెద్ద వృక్షాలను పూర్తిగా తొలగించకూడదు.

Popular Posts