ఒకసారి వసిష్ఠ, భరద్వాజ, అంగీరస, అత్రి, దుర్వాస, భృగు, విశ్వామిత్రాది మహర్షులందరూ హిమవత్పర్వతంమీద సమావేశమైనపుడు, మానవాళి రోగాల బారినపడి నిశ్శేషమైపోతున్న విషయం చర్చకు వచ్చింది. దేవలోకంనుండి ఆయుర్వేదాన్ని భూలోకానికి రప్పించాలని అందరూ నిశ్చయించుకొన్నారు. భరద్వాజ మహర్షి దేవలోకం వెళ్ళి ఆయుర్వేదాన్ని అభ్యసించి వచ్చి ‘ఆత్రేయుడు’ అనే మహర్షికి బోధించాడు. ఈ మహర్షి తదనంతరం అగ్నివేశ మహర్షికి ఉపదేశం చేసాడు. ఆత్రేయునివద్ద నేర్చుకొన్న ఆయుర్వేద రహస్యాలను మహా శాస్త్రంగా రచించాడు అగ్నివేశుడు. దీనినే “అగ్నివేశతంత్రం” అంటారు. ఈ అగ్నివేశతంత్రం క్రీపు.2000-1000 “చరకసంహిత” గా రూపుదిద్దుకొంది. ఈ చరకుదినే మన ఆయుర్వేదానికి ఆదిగురువుగా ఇపుడు పూజిస్తున్నాం.
శ్లో|| నమామి ధన్వంతిరి మాదిదేవం, సురాసురైర్వందిత పాదపద్మం
లోకేజరారుగ్భయ మృత్యునాశం, ధాతారమీశం వివిధౌషదీనాం