శ్లోకం: ఇరావతీ దేనుమతిహిభూతం
సూయవసిన మనుషేదశస్యా
దాదర్ధపృదవీ మభితో మయూబై:
తాత్పర్యం: ఓ విష్ణుదేవా నీవే రోదసి కుహరమును నిలిపి పృదవిని దివమును వేరువేరుగా ఉండునట్లు స్తంభించి పట్టితివి. ఈ పృదవికి అభిముఖముగా సూర్యకిరణములను ప్రసరింపచేయుచున్నావు.దాని వలన భూమిపై జలములు ఏర్పడినవి, అవి మేఘములుగా ఏర్పడినవి అవి వర్షించినవి అన్నమేర్పడినది.పచ్చిక చక్కగా పెరుగుచున్నది. దానిని తినునట్టి దేనువు లేర్పడినవి. జీవులన్నియు ప్రసరించుట ఏర్పడినది. ఈ మొత్తము సంపదను నీవు మనువుకు దానం చేసితివి.అతడు మానవులకు కూడ దానం చేసెను.
బుగ్వేదం: మండలాలు 7 సూక్తములు 99, చందస్సు త్రిష్టుప్ బుషి మైత్రావరుణుడగు వశిష్టుడు.
గమనిక: గతవారం తరువాయి
శ్లోకం...
ఇంద్రా విష్ణు దృంహితా శంబరస్వ
నవ పురో నవతించశృధిష్టమ్
శతం వర్చినస్సహస్యం చసాకం
హధో అప్రత్యసురస్వ వీరాన్..
తాత్పర్యం: ఓ ఇంద్రా విష్ణువులారా మీకుద్రోహము తలపెట్టిన శంబరుడను రాక్షసుని యొక్క 9 పురములను (పట్టణములను) అటుపైన 90 పురణములను ద్వంసము చేసితిరి. తేజోవంతులగు 100తో 1000 మందితో కలిసి మీరు రాక్షసుని వీరులను వారి రథములను గుర్రములను కూడ మాయం చేసిరి.
శ్లోకం....
ఉరు యజ్ఙయ చక్రధురు లోకం
జనమంతా సూర్యముఫాసముగ్నిమ్
దాసస్యచిద్ వృషిని ప్రస్వమాయం
జఘ్నధుర్నరా పృతనాజ్యేషు.
తాత్పర్యము: ఓ ఇంద్ర విష్ణువులారా మీరు విసృతిని వేగమును కలుగ చేయుదురు.
ఈ లోకమును వేగవంతము విసృతమగును అగ్ని పుట్టింతురు వర్షము వలన ఉద్భవించినట్టి లక్షణము చేత వృషశిప్రుడు అని పిలువబడు దేవదారి అను మీ దాసునకు గల ఎట్టి మాయనైన మీరు తోలగింతురు. సేనల వినియోగముననరులై సేనా నాయకులై ముందు నడచి కార్యసాధన చేయుదురు.
శ్లోకం: ఇయం మనీఫా బృహతీహంతో
రుక్రమా తవసా వర్థయంతి
రరే వాం స్తోమం విదధేషువిప్లో
పిన్వతషో వృజనేష్వింద్ర
తాత్పార్యము: ఇంద్రా విష్ణువులారా ఈ మీస్తోత్రము ప్రజ్ఙయము చాల మహత్తర మై విసృతిని కలుగచేయును. ఉరుక్రము డైన విష్ణుని స్తోత్రము సృష్టిని వర్ధిల్లచేయు ను. పాపములను బాణములవలే ఖండిం చును. ఈ స్తోత్రములను చక్కగా స్తుతింప బడినచో సంపదను పోందగలరు.
శ్లోకం :
వషట్‌తో విష్ణవాస అకృణోమి
తన్మోజుషస్వ శిపివిష్ణు హవ్వమ్,
వర్ధంతు త్వా సుష్ణుతమోగిరోమే
మాయం పాత స్వస్థిభి స్వదాన:
తాత్పార్యము:
ఓ ఇంద్రా విష్ణువులారా మేము ఓ విష్ణు అని పిలువగా అపదము నందు విష్ణువు వసించుచుండును,శ్రద్ధతో ప్రత్యేక్షము చేసికోనుచు ప్రార్ధించుదము, ఆకారముచే మాయజ్ఙము నందు మీరు ప్రవేశించి మా అన్నమును యజ్ఙశేష ముగా ప్రసాధించుదురుగాక మిమ్ములను పుష్కములైన స్తోత్రములతో మేము స్తుతింతుముగాక అట్టి మా వాక్కులు మీ యేడల వర్ధిల్లునుగాక మీమ్ములను ఎల్లపుడును యోగ క్షమములతో రక్షింతురుగాక...
వివరణ: యజ్ఙము అనగా ఫలా ఫేక్ష లేక చేయునట్టి విశ్వశ్రే యమైన సత్కర్మము యజ్ఙములలో మొట్టమొదటి సృష్టి కర్మ దానికై అంతర్యామీ ప్రజ్ఙము ఇంద్రియా అధిపతి అయిన మ నస్సు యొక్క ప్రజ్ఙయు కావాలయును. ఆరెండింటిని విష్ణువు ఇంద్రుడు అనువారు ఆధిదేవతలు దేనిని ఉద్భవింపచేయుట కు లోకములను కల్పింపవలెను.వానిని కల్పించువాడిగా మొ దట సూర్యుని కల్పింపవలేను. దానిని కల్పించునదిగా ఉషస్సు ను కల్పించవలయును.ఉషస్సు అనగా సూర్యోదయానికి ముం దు కూడ ఉషస్సును పట్టును.అది సూర్య తేజస్సును నిర్మాణం చేయునట్టి అనంతమైన వేలుగు దానిని పుట్టించుటకు ముందు అగ్ని కావలేను. అగ్ని అనగా అంగముల యందు వివాహితమై మనలో జీవుడుగా వెలుగుచున్నది. మరియు అగ్రము అందు కొని రాబడునది (అన్నిటికనన ముందు పుట్టునది) అని అర్ధ ము. అది వ్యక్తము యొక్క మొదటి రూపమైన మహత్తు నుండి వ్యక్తి యగు అహాంకారము ( ఇది జీవుల అహాంకారము కాక ఒక సృష్టికి మొదటి అహాంకారము. ఇది బిందువుల వలేవ్యక్త మగు అంతర్యామీయైన విష్ణుత్వము నుండియే ఇది వ్యక్తమ గుచుండును, కనుకనే దేవతలందరిలో అగ్ని మొదటివాడు విష్ణువు చివరివాడని ఐతరేయం బోధించుచున్నది. ఈ విధము గా ఉషస్సు కోరకై అగ్ని వీరిద్దరును తెచ్చుచున్నారు. విష్ణుని వర్షా శక్తి వలన భూమిపై పుట్టిన జీవుడు వృషశిపుడు అను పేరుతో వ్యవహరింపబడుచున్నాడు.అతడు విష్ణువు నందు భా గమై జీవించుచున్నందున, విష్ణునకు దాసుడు అతనికి ఇంద్రీ య సుఖములందు సంపదలయందు చిక్కుకోనుట కలుగు చుండును. దానినే మాయ అంటారు.దానిని తోలగివచుటకు విష్ణుని అంతర్యామి ధ్యానమే తోడ్పడును మంచి చేడులను గూర్చిన అభిప్రాయములు సేనల వలే బారులు తీర్చి యుద ్ధభూమిని కల్పించుచుండును. ఈ సేనలకు నామకుడై విష్ణువే వైరాగ్య మార్గమున పరిష్కారము కలిగించి, విజయమును క ల్పించినది. ఇందలి భావముననే కురుక్షత్రమైన ఉభయ సేనల నడుమ నరునకు సారథిగా నారాయణుడు ఉన్నట్లు స్వీకరించి మహాభారత గ్రంథములో కృష్ణుని కథతో కలిసి వివరించేను.
వివరణ: పురణములతో ఇంద్రుడుశంబరసురుని చంపిన కథకిది మూలం. శంబసురుడనగా మాయ అనగా లేనిది ఉన్నట్లుగా కనిపించుట అని అర్ధం. ఈ విద్యను శాంబరి విద్య నందురు. దేని వలన సృష్టిలో సర్వము విష్ణుమయ మే అయినను మనస్సు ఇంద్రీయములు. దేహములు ఇంద్రీయార్ధములు సంపదలు చుట్టరికములు కష్టసుఖములు మొదలగునవి.నిజముగా ఉన్నట్లు నమ్మకం కలుగును. దానితో విష్ణుమయమైన సృష్టికి బాధలు కలుగును. దా నితో విష్ణుమయమైన సృష్టికి బాధలు కలుగును.కనుక ఇది ద్రోహరుపమైన నిర్మాణము. ఇది ఇంద్ర విష్ణువుల ధ్యానముచే తోలగిపోవును. కనుక వారిరు వురును శంబరుని పట్టణములను ద్వంసము చేసినట్లు చెప్పబడినది. శంబ రుని రధములు అనగా జీవుల దేహములను గుర్రములనగా, ఇంద్రయము లు, శంబరుని 9 పురము( పట్టణము) లనగా నవ ద్వారములు గల భౌతిక శరీరములు 99 అనగా సంఖ్యలో సృష్టి కర్మయందు హెచ్చింపబడుచున్న దేహములు. ఇచ్చట ఒకటి అను సంఖ్య మొదటి వాడగు ఇంద్రునకు 9 అను సంఖ్య ఈ నవ ద్వారపురములను నిర్మించిన శంబరునకును,పూర్ణమగు సం ఖ్‌య విష్ణువునకు సూచకములు 9 లో ఒకటి తాకినచో 9 మాయమై ఒకటి యు లేదా సున్నయు మిగులును.(9+1=10) అదేవిధంగా 99ని 1 కలిపిన (99+1=100) అవును. అనగా శంబరుని పురమును ఇంద్రుడు తాినచో పురముమాయమై ఇంద్రా విష్ణువులు మిగులుదురు. వీరిద్దరి 10, 100, 1000 మొదలగు సంఖ్యలు పుట్టును. ఇట్లు పుట్టుచున్న జీవులు తాత్కాలిక దేహములైన దేహముల ప్రజ్ఙనుండి విముక్తి చెంది విష్ణు లోకమున వర్ధిల్లుచున్నారన్నది భావం.