సామరస్యంతో జీవించడానికి, స్థిరత్వాన్ని సాధించడానికి ప్రాచీన శాస్త్రాలైన వాస్తు, ఫెంగ్‌షూయ్ కొన్ని ప్రాథమిక సూత్రాలను ప్రతిపాదించాయి. ప్రస్తుతం ఫెంగ్‌షూయ్ పట్ల నమ్మకాలు అన్ని చోట్లా పెరుగుతున్నాయి. వాస్తు శాస్త్రం జ్యోతిష్యాన్ని, ఖగోళ శాస్త్రాన్ని సమ్మిళితం చేసి సూచనలు చేస్తుంది. ఫెంగ్‌షూయ్ మాత్రం సామరస్యంతో, సంతోషంగా జీవితాన్ని గడపడానికి వివిధ శక్తులను సమతులం చేయడంపై దృష్టి పెడుతుంది. అయితే అటు వాస్తు ఇటు ఫెంగ్‌షూయ్ కూడా పంచభూతాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఏది ఏమైనా రెండింటి పరమార్థం మాత్రం మానవుడు సంతోషంగా, సామరస్యంగా, విజయవంతంగా జీవించడమే.
ప్రస్తుతం ఫెంగ్‌షూయ్ ప్రపం చ వ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంటోంది. జీవితంలో అనేక కో ణాలపై ప్రభావం చూపే ఫెంగ్‌షూయ్ ప్రేమ విషయంలోనూ చూపుతుంది. ప్రేమ జీవితం మరింత మధురంగా చేసుకోవాలన్నా, ప్రేమను పెంచుకోవాలన్నా కొన్ని చిట్కాలు పాటించమ ని చెప్తున్నారు ఫెంగ్‌షూయ్ నిపుణులు.మీరు అవివాహితులైనా, జీవితంలో ప్రేమ పొందాలనుకున్నా, వివాహం అయ్యి ఇంకా మీ బంధాన్ని పటిష్ఠం చేసుకోవాలనుకున్నా మొదట చేయవలసిన పని ఇంట్లోని ప్రేమ, సంబంధాల దిక్కును గుర్తించి అక్కడ సానుకూల శక్తిని పెంచేందుకు ప్రయ త్నం చేయాలి. నైరుతి మూల లేక దిక్కు ప్రేమ నిసించే స్థలంగా చెప్పుకోవచ్చని ఫెంగ్‌షూయ్ చెప్తుంది.నైరుతి మూలలో పెట్టిన చెత్తను వెంటనే తీసివేసి, విరిగిన వాటిని బాగు చేయించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రతికూల వైబ్రేషన్లను కలుగ చేస్తాయి. ఇంట్లో ఏ దిక్కున ఇటువంటివి చెత్త ఉన్నా తీసిపారేయడం మంచిది.ప్రేమను పెంచే దిక్కును ఎరుపు, పింకు, తెలుపు రంగులు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇవి అనుబంధాలను పెంచే రంగులు. అలా అని ఈ రంగులతో మీ గోడలను నింపి వేయక్కరలే దు. ఆ దిక్కున ఒక ఫ్ల వర్ వేజ్ ఉంచి రోజా రంగు పువ్వులను పెట్టుకోవచ్చు. అయితే అవి వడలిపోగానే తీసి వేసి తాజా వాటిని పెడుతుం డడం మంచిది. అలాగే ఇంట్లో కాక్టై లేక ఇతర ముళ్ళ ముక్కలను పెట్టుకోవడం మంచిది కాదు. ఇది కుటుంబ సభ్యుల మధ్య వాద ప్రతివాదనలను పెంచుతుంది. ప్రధ్వి అనే ది ప్రేమకు మూలకం అయినందు న చిన్న చిన్న గులకరాళ్ళను ఇంటి నైరుతి దిక్కున అలంకరిస్తే అదృష్టం వరిస్తుంది. ఇంట్లో జంటగా ఉన్న పక్షులు లేదా మనుషుల ఫోటోలు, చిత్రాలు ఉంచడం మంచిది. ఇది ఆనందకరమైన సంసార జీవితానికి సంకేతం. జంట కొంగల లేదా డాల్ఫిన్స్ బొమ్మలను ఉంచుకోవడం మంచి సంకేతం. లేదా ఆనందంగా ఉన్న ఒక జంట లేదా ప్రేమ పక్షుల బొమ్మలు పెట్టుకున్నా పర్లేదు. ముఖ్యమైన విషయమేమిటంటే మీరు పెట్టుకునే బొమ్మ ఏదైనా జంటగా ఉండాలి, ఆనందంగా ఉండాలి.రాత్రి వేళలో సెంటెడ్ కాండిల్స్‌ను కొద్ది ని మిషాలు వెలిగించడం ద్వారా ప్రేమ పెరిగేందు కు దోహదం చేయవచ్చు. ఈ సెంటెడ్ కాండి ల్స్ కూడా ఎరుపు రంగువైతే మరీ మంచిది.
పడకగదిలో చేయవలసినవి,చేయకూడనివి..
మీ పడక గదిలో సానుకూల శక్తి ప్రవహించేలా సర్దుకోవాలి. చక్కగా విశ్రాంతి పొందేందుకు సంసిద్ధంగా ఉండాలి.
ఏ దిక్కు నుంచీ కూడా మీరు పడుకునే మంచం ప్రతిబింబించేలా గదిలో అద్దాన్ని పెట్టుకోరాదు. ఇది ప్రతికూల వైబ్రేషన్లను పెంచి వైవాహిక విచ్ఛిన్నానికి దారి తీసే అవకాశం ఉంటుంది.
అలాగే పడకగదిలో టివి పెట్టుకోవడం కూ డా మంచిది కాదు. ఇది కూడా అద్దం లాగే ప్రతికూల వస్తువు.
మంచాన్ని కిటికీకి కిందా తలుపు కు ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి. మూడు వైపుల నుంచి దిగేందుకు వీలుగా మంచాన్ని వేసుకోవాలి.
పడకగదికి బాత్‌రూమ్ అటాచ్డ్‌గా ఉంటే ఎప్పుడూ దాని తలుపు మూసే ఉంచాలి.
పడకగదిలో మొక్కలు, అక్వేరియం పెట్టుకోవడం మంచిది కాదు. ఎదిగే మొక్కలు, చురుకుగా తిరిగే చేపలు బెడ్‌రూంలో విశ్రాంతి వాతావరణంతో విబేధిస్తాయి.
మంచం కింద ఉండే అన్ని వస్తువులను తీసి వేయడం మంచిది. శక్తి నిరాటంకంగా ప్రవహించాలంటే ఆ ప్రదేశం పరిశుభ్రంగా, ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలి. ఇది వైవాహిక సంబంధాలకు మంచిది.
కిటికీ పక్కన పింక్ లేదా హృదయాకారం లో ఉన్న క్రిస్టల్స్‌ను తగిలించుకోవాలి లేదా ఒక పింక్ క్వార్ట్‌జ్ క్రిస్టల్‌ను వెలుగు పడేలా బల్ల మీద ఉంచాలి. తద్వారా అది ప్రేమకు సంబంధించి సానుకూల శక్తిని పెంచుతుంది.
వ్యాయామం చేసే పరికరాలు, కంప్యూటర్, పనికి సంబంధించిన ఇతర సామాగ్రిని పడక గదిలో నుంచి వేరే గదికి తరలించాలి. వాటిని బెడ్‌రూంలో ఉంచడం వల్ల మీ మధ్య సంబం ధాలు కూడా పనికి సంబంధించిన వాటిలానే అనిపిస్తాయి.
అలాగే సూది మొనలు కలిగిన ఫర్నిచర్‌ను బెడ్‌రూంలో ఉంచుకోకపోవడం మంచిది. ఇవి విషపు బాణాలలా పని చేస్తాయి. గుం డ్రటి అంచులు కలిగిన ఫర్నిచర్ ఉత్తమం.