ఆలస్య వివాహం అనగా...
ఆలస్య వివాహం అనగా 28 సంవత్సరాలు ఆపైన జరిగేవి.1. లగ్నంలో సప్తమ స్థానంలో పాపగ్రహాలు అనగా శని, రాహు, కేతువు, రవి, కుజ గ్రహాలు ఉన్నప్పుడు,
2. సప్తమస్థానంలో రెండుగాని అంతకన్నా ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు,
3. ద్వితీయ అష్టమ భావాలలో పాపగ్రహాలు గాని, వక్రగ్రహాలు గాని ఉన్నప్పుడు,
4. శుక్రుడు రాహువుతోగాని, శనితోగాని కలిసి ఉన్నప్పుడు,
5. శుక్రుడు రవిగ్రహానికి 430 201 ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు,
6. జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచంలో గాని, వక్రించి గాని ఉన్నప్పుడు
సప్తమ భావంపై సప్తమాది పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వివాహం ఆలస్యమవుతుంది.
ఈ విధంగా జాతకంలో శ్రీఘ్ర వివాహమా? ఆలస్య వివాహమా? అని నిర్ణయించిన తరువాత జరుగుతున్న దశ, అంతర్దశలను బట్టి గోచారంలో గురువు. శుక్రగ్రహాలను బట్టి వివాహకాలాన్ని నిర్ణయించాలి.
వివాహ కాలం నిర్ణయించడానికి జాతకునికి 21 సంవత్సరాలు దాటిన తరువాత వచ్చే దశ, అంతర్దశలను పరిశీలించాలి. సప్తమాది యొక్క లేదా సప్తమభావమును చూస్తున్న లేదా సప్తమాధిపతితో యతి వీక్షణలు పొందుతున్న గ్రహాల యొక్క దశ, అంతర్దశల్లో వివాహం జరుగుతుంది. అలాగా నవాంశ లగ్నాధిపతి యొక్క లేదా సప్తమాధిపతి నవాంశమందున్న రాశి నాదుని యొక్క దశ, అంతర్దశలలో వివాహం జరుగుతుంది. ఈ విధంగా వివాహం జరుగు కాలాన్ని నిర్ణయించిన తరువాత గురుగ్రహం యొక్క గోచార గమనాన్ని బట్టి వివాహం జరుగుతుంది.
ఉత్తరాయణ కాలంలో జన్మించినవారికి నవాంశలో గురువు ఉన్న రాశిలోనికి గాని, గురువుకు 5, 9 స్థానాల్లోగాని రవి గోచార రీత్యా వచ్చిన నెలలో వివాహం జరుగుతుంది. దక్షిణాయణంలో జన్మించినవారికి నవాంశలో శుక్రుడున్న రాశిలోగాని, శుక్రునికి 5, 9 స్థానాలల్లోనికి గాని గోచార రవి వచ్చిన నెలలో వివాహం జరుగుతుంది. ఈ విధంగా గురువు యొక్క సంచారాన్ని బట్టి వివాహం జరుగు సంవత్సరం, రవి యొక్క సంచారాన్ని బట్టి వివాహం జరుగు నెల నిర్ణయించాలి. తదుపరి చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి వివాహం జరిగే రోజు నిర్ణయించాలి.
జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఆలస్య వివాహానికి కారణం తెలుసుకొని తత్సంబంధమైన గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసినచో దోషాలు తొలగి శ్రీఘ్ర వివాహం జరుగుతుంది. సప్తమస్థానంపై రాహు, కేతువుల ప్రభావం ఉన్నప్పుడు ఎన్ని వివాహ సంబంధాలు చూసినా వివాహం జరగదు. కొన్ని సందర్భాల్లో నిశ్చితార్ధం జరిగిన తరువాత వివాహం ముందురోజు కూడా ఏవో కారణాల వల్ల వాయిదా పడుతుంటాయి. ఇటువంటి వారు కనకదుర్గమ్మ వారికి ఎనిమిది శుక్రవారాలు కుంకుమార్చన జరిపించినచో దోషాలు తొలిగిపోతాయి. ముఖ్యంగా వివాహం తొందరగా కావాలని కోరుకునే వారు ఎనిమిది మంగళవారాలు హనుమాన్ ఆలయంలో స్వామివారికి 108 తమల పాకులతో అర్చన జరిపించినచో వివాహం కుదుదరుతుంది. శనిగ్రహ దోషం వల్ల వివాహం ఆలస్యమవుతుంటే తమల పాకులలో తేనెపోసి నల్ల చీమలకు ఆహారంగా ఉంచిన దోషం తొలుగుతుంది.