మనం ప్రేమించేవారికి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటే లాఫింగ్ బుద్ధను కొనిస్తే సరి. పెద్ద పొట్టతో హాయిగా నవ్వుతూ ఉండే బుద్ధుడు ఆయన. కుండలు పట్టుకుని లేదా వెనుకాల గోతం వేసుకొని ఉన్నట్టుగా ఈ విగ్రహాలు ఉంటాయి. ఇవన్నీ సంపదతో నిండి ఉంటాయని విశ్వా సం. అనంతమైన ఆనందం, ఓర్పు, దయ కలిగిన వాడే బుద్ధుడు. అన్ని కష్టాలను, సమస్యలను ఓర్చి వాటిని ఆనందం గా రూపాంతరం చెందిస్తాడని నమ్మకం. పిల్ల లు, పేదలు, బలహీనుల పక్షాన ఉంటాడని కూడా భావిస్తారు. ఈ విగ్రహాలు లోహం, టెర్రకోట, క్రిస్టల్స్ వంటివాటితో తయారు చేస్తారు. ఇవి రకరకాల పోజులలో కూడా ఉంటాయి. కానీ ప్రతి దానికీ ఒక ప్రాముఖ్యత ఉంటుంది.
ఈ ప్రపంచంలో మంచి జీవితాన్ని సాధించవచ్చనే బౌద్ధ సూత్రాలను ఇది ప్రతిఫలిస్తుంది. లాఫిం గ్ బుద్ధ లేక హాపీ హోతీ అనేక రూపాలలో దర్శనమిస్తాడు. లాఫింగ్ బుద్ధా పొట్టను రాయడం ఆనందాన్ని, అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని తెస్తుందని అనేకమంది భావన. చైనాలోని ఆలయాలలో ద్వారం వద్ద మన గణపతి విగ్ర హం వలెనే లాఫింగ్ బుద్ధా ప్రతిమ ను ప్రతిష్ఠిస్తారు. అదృష్టానికి, సౌ భాగ్యానికీ అధి దేవతగా పూజిస్తారు. తత్ఫలితంగానే ఫెంగ్‌షూయ్ లాఫింగ్ బుద్ధాను సంపదలకు, సౌభాగ్యాలకు ప్రతీకగా చెప్తుంది.
కాగా జపాన్‌లో అదృష్టాన్ని తెచ్చే ఏడుగురు షింటో దేవతలలో ఒకరిగా లాఫింగ్ బుద్ధాను పరిగణిస్తారు.
లాఫింగ్ బుద్ధ ఆఫ్ లవ్- ప్రేమ, దయ ఉట్టిపడేలా చూస్తూ కూచుని ఉన్న బుద్ధుడు.
లాఫింగ్ బుద్ధ ఫర్ ప్రాస్పరిటీ (సంపద)- ఒక కుండను లేదా బౌల్‌ను ఆకాశంలోకి ఎత్తిపట్టుకుని ఈ విశ్వం నుంచి అనంతమైన సంపదను అందుకుంటున్నట్టుగా ఉంటుంది.
సురక్షిత ప్రయాణానికి- ప్రయాణం చేసే సమయంలో భుజం మీద గోతం వేసుకున్న లాఫింగ్ బుద్ధాను దగ్గర పెట్టుకుంటే సజావుగా సాగుతుందని ఫెంగ్ షూయ్ నిపుణులు అంటారు.
ఇంట్లో సంతోషానికి- బలమైన పునాదికి సంకేతంగా ఒక పెద్ద బంగారు తిన్నె మీద కూర్చుని, మరొకరికి ఇచ్చేందుకు చేతిలో బంగారు ముద్దను పట్టుకుని ఉంటాడు.
ఆధ్యాత్మిక ప్రయాణానికి- ప్రయాణానికి సిద్ధమై, అవగాహన కోసం చేతిలో విసనకర్ర, అంతర్గత భావనలు పోగు చేసుకునేందుకు భుజం మీద గోతంతో ఉంటాడు.
సుదీర్ఘ జీవితానికి: తన టోపీతో కూర్చుని, ఆనందంగా కనుపించే లాఫింగ్ బుద్ధా ప్రతిమ.
లాఫింగ్ బుద్ధా ప్రతిమను కొనేటప్పుడు సా ద్యమైనంత పెద్దది కొనడం మంచిది. సంపద ను కోరుకునే వారు ఇతర ప్రతిమలను కాక కుండలో బంగారం ఉంచుకున్న లేదా భుజం పై సంచీ వేసుకున్న ప్రతిమను కొనుక్కోవడం మంచిది. కొన్న ప్రతిమను ద్వారానికి ఎదురు గా ముపె్ఫై అంగుళాల ఎత్తు మీద ఒక టేబుల్ మీద పెట్టుకోవాలి. ఆ విగ్రహాన్ని కింద పెట్టడమంటే అగౌరవపరచడమేననే భావన ఉంది.
విద్యార్ధులు మంచి ఫలితాల కోసం ఆ ప్రతిమను తమ టేబుల్‌పై ఉంచుకోవచ్చు.
ఆఫీసులో లేదా రిసెప్షన్ టేబుల్ మీద ఉంచడం వల్ల ఆదాయం బాగా ఉంటుంది. ఈ విగ్రహాలను దేవతా విగ్రహం వలే పూజించనవసరం లేదు. దాన్ని సరైన స్థలం లో ఉంచితే సరిపోతుంది. అయితే ఈ విగ్రహాలను బెడ్‌రూంలలోనూ, బాత్‌రూంలలో నూ, డైనింగ్ రూంలలోనూ పెట్టకపోవడమే మంచిదని ఫెంగ్‌షూయ్ నిపుణులు సూచిస్తున్నారు.