Followers

Monday, 17 June 2013

గంట ఎందుకు కొట్టాలి?


templebellగంట కొడితే గంటలోనుండి ఓంకారనాదం వస్తుంది. ఆ ధ్వని వల్ల శరీరం ఒక అనుభూతికి లోనవుతుంది , ఆ యొక్క ఓంకారనాద ధ్వనివల్ల మన మనస్సు, దృష్టి, శరీరం, దేవాలయంలో ఉన్న దేవతామూర్తిపైన ఉంచడం జరుగుతుంది మన మనస్సుని, దృష్టిని దేవుని పైన లగ్నం చేయడానికి గంటానాదం చేయడం జరుగుతుంది.

ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్‌!
కుర్యాద్ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంచనమ్‌!!

అంటే దేవతలు ఉండే చోట రాక్షసులు ఉండరు కదా. ఈ పరమ పవిత్రమైనటువంటి దేవాలయంలో దుష్టశక్తులు ఉండకూడదు కాబట్టి మీరు ఇక్కడనుండి వెళ్ళిపొండి అని గంట కొట్టి దేవతలను లాంఛనంగా ఆహ్వానించడానికి గంటానాదం చేయడం జరుగుతుంది..

Popular Posts