సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Monday, 17 June 2013
గంట ఎందుకు కొట్టాలి?
గంట కొడితే గంటలోనుండి ఓంకారనాదం వస్తుంది. ఆ ధ్వని వల్ల శరీరం ఒక అనుభూతికి లోనవుతుంది , ఆ యొక్క ఓంకారనాద ధ్వనివల్ల మన మనస్సు, దృష్టి, శరీరం, దేవాలయంలో ఉన్న దేవతామూర్తిపైన ఉంచడం జరుగుతుంది మన మనస్సుని, దృష్టిని దేవుని పైన లగ్నం చేయడానికి గంటానాదం చేయడం జరుగుతుంది.
అంటే దేవతలు ఉండే చోట రాక్షసులు ఉండరు కదా. ఈ పరమ పవిత్రమైనటువంటి దేవాలయంలో దుష్టశక్తులు ఉండకూడదు కాబట్టి మీరు ఇక్కడనుండి వెళ్ళిపొండి అని గంట కొట్టి దేవతలను లాంఛనంగా ఆహ్వానించడానికి గంటానాదం చేయడం జరుగుతుంది..