Pages

Monday, 17 June 2013

సకలపాప హరుడు పశుపతి నాథుడు

ఖాట్మండూ నేపాల్‌ దేశపు రాజధాని. ఘోరఖ్‌పూర్‌, 

వారణాసి నగరాల నుంచి రోడ్డు మార్గాన కానీ, ఢిల్లీ నగరం 

నుంచి విమానంలో కానీ ప్రయాణం చేసి ఇక్కడకు 

రావచ్చు. అంతకుముందీ ఊరిని కాష్ట మండప్‌గా పిలిచే 

వారని ప్రతీతి. తరువాత కాలంలో కాట్‌మండప్‌ అనీ 

తర్వాత కాట్మండనీ నేటికి ఖాట్మండ్‌ అన్న పేరున 

స్థిరపడింది.

kovela2క్రీ.శ. 724 ప్రాంతంలో ఈ నగరం నిర్మించినట్టు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఖట్‌ అంటే కొయ్యనీ, మండ అంటే దేవాలయమనీ అర్థం. రెండూ చేరి ఖాట్మండైందంటారు. ఇక్కడే సుప్రసిద్ధ పశుపతినాథ ఆలయం ఉంది. ఈ లింగానికి 5 ముఖాలుంటాయి. ఈశ్వరుని ఐదు ముఖాలకు ఇది సంకేతంగా చెబుతారు. నలువైపులా నాలుగు, పైన ఒకటి. బంగారంతో కప్పి ఉంటుందీ శివమూర్తి. అష్టమూర్తి లింగాలలో ఇది యజమాని లింగంగా ప్రసిద్ధి చెందింది.భాగమతీనది దక్షిణ తీరంలో ఆర్యా ఘాటనే చోట జపాను, చైనా దేశ సంప్రదాయాన్ని పోలి నిర్మితమైందీ ఆలయం. ఆలయ ఆవరణలోనే చిన్న ప్రాకారంలో 558 శివలింగాలు న్నాయి. అన్నిటినీ తాకుతూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు. దక్షిణ భారత బ్రాహ్మణులే ఇక్కడఇర్చకులు. ఇక్కడి ఈశ్వరుడు పశుపతినాథుడు. అమ్మవారు రాజరాజేశ్వరి. వీరే కాక ఇతర దేవతా మూర్తుల మందిరాలు కూడా ఎంతో మనోహరంగా ఉంటాయి. 

అందమైన హిమాలయ పర్వతాల సమీపంలో ఉన్న ఈ ఆలయ దర్శనం అమిత ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ మందిరం రెండంచెల బంగారు కప్పుతో, వెండి ద్వారాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అద్భుతమైన వాస్తు, శిల్పకళా సౌందర్యం ఈ మందిరంలో కనిపిస్తుంది. ఈ ఆలయంలోని పశుపతి నాథ లింగం ’పరసువేది’ అంటారు. అయితే ఇందుకు తగిన సాక్ష్యాధారాలు లేవు. ఏదిఏమైనా పశుపతి నాధ లింగ దర్శనం మానవ జీవితంలో కెల్లా పుణ్యకార్యమన్నది జనవాక్యం.
kovela‘జటేశ్వరం సమారభ్య యోగే శాన్తం మహేశ్వరి
నేపాల దేశో దేవేశి సాధకానాం సుసిద్ధితః ’


హిమాలయాల్లోని జటేశ్వరం మొదలు యోగేశ్వరం వరకు పరివ్యాప్తమైన దేశానికి నేపాళమని పేరు. ఈ ప్రదేశం సాధకులకు సిద్ధిప్రదమైంది. అందుకే నేపాల్‌నీ, అక్కడ వెలసిన పశుపతినాధుణ్ని చూడనిదే ఆధ్యాత్మిక అన్వేషణ పూర్తి అయినట్లు కాదని మన భారతీయుల విశ్వసిస్తాం. ఇక ఇక్కడ ప్రకృతి సౌంధర్యం కూడా మనోరంజకంగా ఉంటుంది. భారతీయులకు అత్యంత పుణ్యప్రదమైన ఈ క్షేత్రాన్ని అందరూ దర్శించి, పశుపతినాథుని అనుగ్రహం పొందవలసినదే