పరుశురామావతారం ఆరవది
భారత, రామాయణాల్లోనూ పరశురాముడు
పరశురాముడు విష్ణూమూర్తి దశావతారంలో ఆరవది. ఈ అవతారాన్ని ఆవేసావరమంటారు. అంటే భగవంతుడికి ఆవేశం ఉన్నంత వరేక పరసురముసు తన అవతార లక్ష్యాన్ని నేరవేర్చగలుతాడు. పరశురాముడు చిరంజీవుల్లో ఒకడిగా ప్రసిద్ధి చెందాడు. పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు అవతరించెనని స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణం తెలుపుచున్నవి. పరశురామ జయంతి రోజు ఉపవసించి, పరశురాముని షోడశోపచారంలతో పూజించి, జమదగ్నిసుత వీర క్షత్రియాంతక ప్రభో గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర అని అర్ఘ్యప్రదానం చేయవలెనని వ్రత గ్రంధాలు తెలుపుచున్నవి.
మహాభారతంలో పరశురాముడు
మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురుయ్యాడు. కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడు.
రామాయణంలో పరశురాముడు
సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను, రాముని శాంత వచనాలనూ పట్టించుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచందమ్రూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తి కొట్టైమని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసికోవడానికి వెళ్లిపోయాడు.
పరశురామ అజ్ఞాతవాసం
రేణుకా, జమదగ్నిల పుత్రుడు పరశురాముడు పితృవాక్యపరిపాలన వలన తల్లీని సంహరించి, మరలా అదే తండ్రీ వర్రపభావంచే తల్లిని పునర్జీవింపచేసిన విశిష్టలక్షణుడు. ఇంతటి పరశురాముడు ఊగ్రుడు, ముక్కొపి. శివుని మెప్పించి ఆయుధంగా గొడ్డలిని సంపాధించినవాడు. తన తండ్రికి జరిగిన ఘోరంనకు ప్రతీకారంగా 21 మార్లు క్షత్రియవంశ నిర్మూలన కావించి సకల ధరామండలం అంతటిని తన ఆధీనంలో తెచ్చుకున్నవాడు.
పరశురామక్షేత్రాలు
ఈ క్రింద కల 7 క్షేత్రాలను పరశురామ ముక్తి క్షేత్రాలు అంటారు. పరశురాముడు తన పరశువు(గొడ్డలి) ను సముద్రంలోకి విసరివేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ్డ భూమిలో గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు.ఈ క్షేత్రాలు అన్నీ కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుమలలో ఉన్నాయి.
ఉడిపి, కొల్లూరు, గోకర్ణ, కుక్కే సుబ్రమణ్య/సుబ్రమణ్య శంకరనారాయణ, కుంభాసి/ఆనేగడ్డ, కోటేశ్వర, భోపాల్‌లో ఒక ఆలయం కలదు.
పరశురాముని జన్మవృత్తాంతం
కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్లి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు.
ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా బుచీకుడు యాగం చేసి విప్ర మంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంతప్రూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్లతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత ప్రూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్ర పూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. పరశురాముడు శివుని వద్ద అస్తవ్రిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుంచి అఖండ పరశువు(గండ్ర గొడ్డలి) పొంది, పరశు రాముడైనాడు.
కార్తవీర్యునితో వైరం
హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాప వశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్లి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు.
పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి కార్తవీర్యార్జునునితో యుద్ధంచేసి అతని వెయ్యిచేతులు,
తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శిస్తాడు.