దైవశక్తి అనేది అఖండమైనది. అపరిమితమైనది కూడా. ఆ శక్తి ముందు
ఏదైనా అల్పంతో సమానమే. చీకటిలో ఓ దీపాన్ని వెలిగిస్తే ఆ కాంతి
కొంతవరకే పరిమితం అవుతుంది. కానీ, సూర్యుడు ఉదయిస్తే
సర్వదిక్కులు వెలుగులతో నిండిపోతాయి. ఇదే దైవశక్తి.
అదేవిధంగా భగవంతునికి తనను తాను అర్పించుకోవడం వల్ల మానవశక్తి
ద్విగుణీకృతమవుతుంది. అందుకే అంటారు మన ఋషులు... దైవశక్తికి
మానవుడే వారసుడని. తనను తాను దైవార్పితం చేసుకున్న మానవుడు
కూడా దైవస్వరూపుడుతో సమానం.
అదేవిధంగా నిత్యం భగవంతుని నామస్మరణ చేసినట్టయితే, మనస్సులోని
అహంకారం పూర్తిగా తొలగిపోయి భగవద్భక్తి పెంపొందుతుందన్నది వేదాల
సారాంశం.