స్వస్తిక్ యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా ఇంట్లో శక్తి వలయాలను పెంచుకోవచ్చు. అయితే ఈ పద్ధతి అవలంబించేం దుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు తెలిసిన వారి పర్యవేక్షణలో ఇది జరగాలి.
ఈశాన్య కోణంలో తూర్పు దిక్కున టాయిలెట్ నిర్మాణం ఆ ఇంట్లో ఉండేవారికి అనేక వ్యాధులకు కారణమవుతుంది. కనుక టాయిలెట్‌ను ఎప్పుడూ దక్షిణం లేదా పశ్చిమ దిక్కున నిర్మించాలి. లెట్రిన్‌ను కూడా మనం ఉత్తరం లేదా పశ్చిమ అభిముఖంగా కూచునేలా ఏర్పాటు చేసుకోవాలి.
వంటింట్లో గ్రైండర్, ఫ్రిజ్, షెల్ఫ్ వంటి భారీ వస్తువులను దక్షిణం లేదా పశ్చిమ గోడ వైపుగా పెట్టుకోవడం మంచిది.
ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుం టే మీ మంచం ఎలా వేసుకున్నారో చూసుకోండి. వాస్తుశాస్త్రం ప్రకారం మంచానికి ఎ ప్పుడూ నాలుగు కోళ్ళు ఉండాలి. బాక్స్ తర హా మంచాలు గాలి ప్రవాహాన్ని నిలిపివేస్తాయి. అనారోగ్యానికి ఇదే ప్రధాన కారణమవుతుంది.
మంచాన్ని దూలం కింద కాకుండా పక్కకు వేసుకొని పడుకోవాలి.
పిరమిడ్లను ఇంట్లో పెట్టుకోవడం కూడా వాస్తు దోషాలను పరిహరిస్తుంది. వీటిని ఇం ట్లో కీలకమైన స్థానాలు అంటే మధ్య లేదా ఏదైనా ఒక నిర్దేశిత గదిలో లేదా శక్తికి కీలకమైన కేంద్రంలో పెట్టుకోవచ్చు. పిరమిడ్లు మా నవ ఆరా తాలూకు విద్యుదైస్కాంత క్షేత్రాన్ని సమతులం చేస్తుంది తద్వారా శరీరం, మనస్సు, పరిసరాల మధ్య సామరస్యాన్ని పెంచుతుంది.
ఏడుస్తున్న యువతి, యుద్ధ సన్నివేశాలు, శృంగార సన్నివేశాలు, ఆగ్రహంతో ఉన్న వ్య క్తి, గుడ్లగూబ, డేగ వంటి పోస్టర్లు అపశకు నం. కనుక అటువంటివి ఏవైనా ఇంట్లో ఉం టే వాటిని తక్షణమే తొలగించడం మంచిది.
ఇక తలుపుల విషయానికి వస్తే, తలుపులు బయటకు తెరుచుకునేలా ఉంటే తక్షణమే వాటిని మార్చి ఇంట్లోకి తెరుచుకునేలా పెట్టిం చుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇంట్లో ఉండే శక్తి ఇంట్లోనే ఉండాలంటే తలుపులు లోపలికే తెరుచుకోవాలి.
ఇంట్లో ఎడారి మొక్కలను పెంచడం మంచిది కాదు.
అలాగే తలుపులు కిర్రుమంటూ తెరుచుకోకూడదు. కనుక గడియలు, గొళ్ళెం వంటి వాటిని నూనె వేసి వదులు చేస్తుండాలి.
తులుపులు ఎప్పుడూ కుడి వైపుకి తెరుచుకోవడం మంచిది.
అలాగే హను మంతుడి ఫో టోను లేక బొమ్మను ఆగ్నేయం వైపు చూస్తున్నట్టుగా పెట్టడం మంచిది కాదు. ఇది అశుభాన్ని చేకూరుస్తుంది.
గది సీలింగ్‌కు ఐదు మూలలు ఉండరాదు. తలుపులు, కిటికీలు నైరుతి దిక్కున ఉండకూడదు.
ఆహారం తీసుకునేటప్పుడు కంచం ఆగ్నే యం దిక్కుగా ఉండాలి.
వంటగది ఆగ్నేయ మూల ఉండడం మంచి ది. ఒకవేళ అలా సాధ్యం కాని సందర్భంలో ఇంటికి వాయువ్య మూలన ఉంచడం మం చిది.
వంటగట్టు తూర్పు లేదా ఉత్తర గోడను అంటుకోకుండా చూసుకోవాలి. అలాగే స్టౌ బయటకు కనుపించేలా పెట్టుకోవడం మంచిది కాదు.
అలాగే స్టౌకు దగ్గరలోనే పంపులు, సింకులు ఉండకుండా చూసుకోవాలి. అగ్ని, జలం రెండూ పరస్పర విరుద్ధ పదార్ధాలు.
వంటగదిలో అల్మరాలు ఈశాన్య దిక్కున ఉంటే అందులో తేలికపాటి వస్తువులను మాత్రమే పెట్టుకోవాలి.
వంటగదిలో అటకలు ఎప్పుడూ వంటగట్టుపై ఉండరాదు.
వంటగదిలో పెద్ద కిటికీలు తూర్పు దిక్కున, చిన్నవి దక్షిణ దిక్కున ఉండేలా చూసుకోవాలి.
వంటగదికి అనువైన రంగులు ఆకుపచ్చ, లేత గులాబీ, ఆరెంజ్.
suryapradeephyd@gmail.com