Followers

Friday, 14 June 2013

ఫెంగ్‌షూయ్‌తో.. అందమైన జీవితం

feng-shui-living-roomమన పరిసరాలతో సరైన సామరస్యాన్ని సాధించేందుకు ఫెంగ్‌షూయ్‌ సాయపడుతుంది. భారతీయ వాస్తులాగే ఫెంగ్‌షూయ్‌ కూడా పురాతన శాస్త్రం కావడం, అది ప్రాణ శక్తి ఆధారంగా పనిచేయడమే కాదు ఆ శక్తి ఆరోగ్యవంతంగా ప్రవహించేందుకు దోహదపడుతుందని భావిస్తారు. ఈ ప్రాణశక్తినే చైనీయులు ‘చీ’ అంటారు. మనం ఉండే పరిసరాలు ఆరోగ్యవంతంగా, ఆహ్లాదంగా ఉండేందుకు ఫెంగ్‌షూయ్‌ తోడ్పడుతుంది. ఈ విషయాలన్నీ కొత్తవేమీ కాకపోయినప్పటికీ దానిని ఉపయోగించుకోవడం ఎలా అన్నది తెలుసుకోవడంలో అనౌచిత్యం మాత్రం కాదు.

ఫెంగ్‌షూయ్‌ ప్రకారం అన్ని మూలలు, వసారాలు ప్రాణ శక్తిని నిర్వీర్యం చేస్తాయి. కనుక దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మూలల్లో బల్బులు పెట్టడమో లేదా మీకెంతో ఇష్టమైన పెయిం టింగ్‌ను అక్కడ తగిలించడమో చేయాలి. ఆ పెయింటింగ్‌ రంగు రంగులదైతే మరీ మంచిది.

మరొక మంచి సూచన ఏమిటంటే అక్కడ గుం డ్రటి ఆకులు గల చిన్న మొక్కను కుండీలో పెట్టి పెట్టడం మంచిది. అయితే ఆ ఆకులు సూది మొనలతో, ముళ్ళతో లేకుండా చూసుకోవాలి. డ్రాయింగ్‌ రూం పెద్దగా కనిపించడం కోసం అద్దాలను వాడుకోవడం మంచిది. అది విశాలంగా కనిపించేలా ఫర్నిచర్‌ను సర్దుకోవాలి.

feng-shui-living-room1డ్రాయింగ్‌ రూమ్‌లో అద్దాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వాటిని సరిగా పెట్టకపోతే ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది. అందుకే వాటిని ఏర్పాటు చేసే సమయంలో అవి మీకిష్టమైన వాటిని, మీరు పదే పదే చూడాలనుకునే వాటినీ ప్రతిఫలించేలా ఏర్పాటు చేసుకోండి. ఉదాహరణకు కిటికీలోంచి మీకిష్టమైన సీనరీని చూసేలా...

డ్రాయింగ్‌ రూంను అట్టహాసంగా ఏర్పాటు చేసుకుంటున్నామనే భావనతో కిక్కిరిసిపోయినట్టుగా ఫర్నిచర్‌ను పెట్టకూడదు. అలాగే టివిని లేదా సౌండ్‌ సిస్టంను ప్రముఖంగా పెట్టకూడదు. ఎందుకంటే టీవీ తాలూకు ఎలక్ట్రో మాగ్నెటిక్‌ తరంగాలు ప్రాణ శక్తి ప్రవాహానికి అడ్డు తగలవచ్చు.

ఫెంగ్‌షూయ్‌ అనేది స్ర్తీ, పురుష శక్తులను (యిన్‌, యాంగ్‌) సమతులం చేస్తుంది. కనుక డ్రాయింగ్‌ రూంలో మెత్తటటి కుషన్లను లేదా పువ్వులను పెట్టి దాన్ని మరింత ఫెమినైన్‌గా ఉం డేలా చూడాలి. అలా అని ఎండిపోయిన పువ్వుల ను పెట్టకూడదు. చైనీయుల సంప్రదాయం ప్రకారం ఇది మంచి శకునం కాదు.
డ్రాయింగ్‌ రూమ్‌ను ఎలా సర్దుకోవాలంటే అందులోకి ప్రవేశించగానే విశ్రాంత భావన పొందేలా చూసుకోవాలి. కనుక ఫర్నిచర్‌ను గోడలకు తగిలించి పెట్టడం కాకుం డా దాన్ని మధ్యలో గుండ్రంగా వచ్చేలా సర్దుకుంటే వచ్చిన అతిథులు కూడా సౌకర్యాన్ని పొందగలుగుతారు.

ఒకవేళ మరింత లో తుగా ఫెంగ్‌షూయ్‌ను ఉపయోగించాలనుకుంటే బా గువాను ఉపయోగించవచ్చు. అది ఎలా అంటే మీ ఇల్లు ఏ దిక్కున ఉన్నదో ముందుగా చూసుకోండి. తర్వాత దానిని మీ జీవితంలో కీలకమైన ఎనిమిది భాగాలుగా విభజించుకోండి.

మీకు రావలసిన అదనపు రాబడి ఎందుకు రావడం లేదో పరిశీలించుకోండి. మీ ఇంటి సౌభాగ్య స్థానంలో కాక్టస్‌ వంటి మొక్కలను పెట్టారేమో చూసుకోండి. మీరు ఎందులో ముందుకు పురోగమించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన మూలను కనుగొని అక్కడ ఒక చిన్న అక్వేరియంను ఏర్పాటు చేసుకోండి లేదా క్రిస్టల్స్‌ను లేదా విండ్‌ చైమ్స్‌ను పెట్టుకోవచ్చు.

ప్రాథమికంగా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ఇంట్లోకి ప్రవేశించే మార్గంలో చెత్తలేకుండా, కిక్కిరిసినట్టు సామాన్లు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మార్గం ద్వారానే ప్రాణశక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కను క అక్కడ బాగా విశాలంగా, వెలు తురు వచ్చేలా చూసుకోవాలి. అలాగే ప్రధాన ద్వారం ఎదుట అద్దాన్ని పెట్టవ ద్దు. ఎందుకంటే ఇది ప్రాణశక్తిని బయటకు పంపేలా చేస్తుంది.
ఇక డ్రాయింగ్‌ రూంకు వేసే రంగులు లేతవిగా, ఆహ్లాదం కలిగించేవిగా ఉండాలి. పేసల్‌ కలర్స్‌ అద్భుతంగా ఉంటాయి. అలాగే డ్రాయింగ్‌ రూంలో తివాచీ పరిచేటప్పుడు కూడా దిక్కులను గమనించాలి. మీరు ఉండే ఇల్లు ఏ ముఖంగా ఉన్నదో దానిని బట్టి రంగును ఎంపిక చేసుకోవడం మంచిది. ఫెంగ్‌షూయ్‌ నిపుణులను సంప్రదిస్తే వారు సరిపోయే రంగులను సూచిస్తారు.

ఫెంగ్‌షూయ్‌ని నమ్మి నా నమ్మకపోయినా ఆరోగ్యవంతంగా జీవించాలంటే గదులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం. అలాగే గదులలో సామాను కిక్కిరిసినట్టు లేకుండా అందంగా సర్దుకోవడం వల్ల మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆర్భాటంగా ఉండాలన్న ఆసక్తితో పెద్ద పెద్ద ఫర్నిచర్‌ను తెచ్చి మనం ఎటూ కదిలే వెసులుబాటు లేకుండా సర్దుకోవడం వల్ల వచ్చేది చికాకు తప్ప మరింకేమీ కా దు. అక్కడక్కడ అద్దాలను పెట్టుకోవడం, చక్కటి చిట్టిపొట్టి చేపలను పెంచుకోవడం వంటివి చేయడం వల్ల ఇళ్ళు కళాత్మకంగా కనిపిస్తుందే తప్ప వాటిల్లే నష్టం ఏమీ ఉండదు. ఇక విండ్‌చైమ్స్‌ అంటారా? అది నమ్మకం లేనప్పుడు లేకపోయినా పర్లేదు. కానీ ఇంట్లోకి గాలి వెలుతురు బాగా ప్రసరిం చేలా సామాను అడ్డం పడకుండా, మూలల్లో చెత్తలేకుండా చూసుకోవడం మంచిది.

హేతుబద్ధంగా చూసుకున్నా మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే పరిసరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. అయితే వ్యక్తులు తమ జీవితాలను సుఖమయం చేసుకోవాలనే ఉద్దేశంతోనే పెద్దలు వాటిని సంప్రదాయాలుగా మలిచారు. ఇంటి ముందు ఊడ్చుకొని ముగ్గేసుకోవాలన్న దాని దగ్గర నుంచి ఇంట్లో చెత్త లేకుండా, సామాన్లు కిక్కిరిసి లేకుండా చూసుకోవాలనే మాట వరకూ అన్నింటి వెనుకా ఉన్నవి శాస్ర్తీయ కారణాలే. ఆ మాత్రం మనం గ్రహిస్తే మనకే మేలు.

Popular Posts