Pages

Friday, 14 June 2013

పడకగదిలో నెమలి ఫించం...!

ఇల్లన్న తర్వాత దేవుడి గది, వంట గది, డైనింగ్‌ హాల్‌, పడక గది, డ్రా యింగ్‌ రూమ్‌, స్టడీ రూమ్‌ ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి చిన్నవి కావచ్చు.. లేదంటే పెద్దవిగా కూడా ఉండవచ్చు. అయితే ప్రతి గదికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రత్యేకత రంగుల ద్వారా, ఫర్నీచర్‌ ద్వారా ఆయా గదులలో ఉండే ఇతర వస్తువుల ద్వారా కనబడుతూ ఉంటుంది.

ఎవరి అభిరుచి వారిదే అయినా రంగుల వాడకంలో వాస్తు నియమాలు పాటిస్తే మంచిదంటున్నారు వాస్తు నిపుణులు. ఏయే గదికి ఏ రంగు వేస్తే బావుంటుందో తెలుసుకుని ఆ రంగులను గదులకు వేస్తే మంచిది.



ఏ రంగు వాడాలి?
peacockఉదాహరణకు... వాస్తు ప్రకారం పడక గదు లకు లేత రంగు మంచిది. గోడలకు లేత గు లాబీ, నీలం, ఆకుపచ్చ, బూడిద రంగులు ఉం టే మనసు ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధి విక సిస్తుంది. అలాగే పసుపు, తెలుపు మార్బుల్‌ స్టోన్స్‌ను ఫ్లోర్‌కి వాడితే వాస్తు కుదురుతుంది. ప్రశాంతంగా, నిశ్శబ్ద వాతావరణం ఉండేలా ఇవి చూస్తాయి. దంపతుల మధ్య ఎటు వంటి సమస్యలు రావు. చక్కగా నిద్రపడుతుంది.


పడకగదిలో నెమలి పింఛమెందుకు?


పడకగదిలో అద్భుతమైన సీనరీలను ఉంచ డం ద్వారా మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలి గిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు.
అంతేకాదు.. రకరకాలైన పక్షులు జంటలుగా ఉంటే దృశ్యాలు పడకగదిలో ఉంచితే భార్యాభర్తల మధ్య అనురాగం పెంపొందుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
అయితే బెడ్‌రూమ్‌లో నెమలి పింఛా న్ని కన బడేటట్లు పెట్టి తెల్లవారు జా మున లేవగానే దానిని చూడడం వల్ల రాహుగహ్ర దోషాల నుంచి నివారణ కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటు న్నారు. నెమలి పింఛంతో తయారైన చిత్ర పటాలను పడకగదిలో ఉంచడం ద్వారా శుభ ఫలితాలుంటాయని వారు చెబు తున్నారు.
అలాగే.. పడకగదిలో కంటికి ఎదురుగా వికృతమైన పటాలు, చిలకకొయ్యలు, స్తంభాలు ఇతర అవరోధాలు లేకుండా జాగ్రత్తగా వహించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.