Pages

Friday, 14 June 2013

ఆత్మవివేకం

సాధారణంగా మనం ఆత్మ, ఆధ్యాత్మ అంటాం. కానీ వాటి అర్ధం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం మాత్రం చెయ్యం. ముఢత్వంలోనే మన బుద్ధి మగ్గుతూవుంటుంది. ఈ మూఢత్వం నుంచి బయటపడటమే ముక్తి. ఆత్మ అనే పదం ‘అతమ’ అనే మాటకి సంక్షిప్త రూపం. అతమ అంటే చీకటి వరకూ అంటే శూన్యం వరకూ వ్యాపించి ఉండే వెలుగు అని అర్ధం. ఈ వెలుగునే జ్యోతిస్టు అంటారు. సూర్యజ్యోతిస్టులో ఒక కణం అని కూడా వ్యవహరిస్తారు. ఆధ్మాత్మ అంటే ప్రతీశరీరంలో ఆధిక్యత వహించి అంతటా ఉండే ఆత్మ. దానికే సూర్యజ్యోతిస్టు కదం అని కూడా అంటాం.

atmaఅన్ని జీవరాసుల్లోను వెతికినా కనబడని అతి శూక్ష్మమైన ఆత్మను గురించి తెలుసుకోవడాన్నే ఆత్మవిద్య అంటారు. ఈ ఆత్మ, సూర్యజోతిస్టు ఏ శరీరంలోనైనా ఉన్నదో లేదో తెలుసుకోవడం ఎలా? ఐదు జ్ఞానేంద్రి యాల్లో, ఐదు కర్మేంద్రియాల్లో కదలికలనే చేతనత్వం అంటాం. దానికి మరో పేరే చైతన్యం. జ్ఞానేంద్రి యాలు, త్వక్‌ (చర్మం) చక్షు (నేత్రం), శ్రోత్ర (చెవులు) , జిహ్వ (నాలుక), ఆఘ్రణం (ముక్కు). అలాగే కర్మేంద్రియాలు, వాక్‌ (నోరు), పాణి (చేతులు), పాద (కాళ్ళు) పాయు (మలవిసర్జన అంగం), ఉపక్ష (జననాంగం). ఆత్మ అంటే సూర్యజ్యోతిస్టు కణాన్ని మన శరీరంలో ఉద్భవించే వేడిని బట్టి లేదా తాపాన్ని బట్టి గుర్తించగలుగుతాం. 

వేడి అనేది మనకి కేవలం సూర్యభగవానుడి నుండే లభిస్తుంది. తాపాన్ని పుట్టించేవాడు కనుకనే సూర్యుని తపనుడు అని కూడా పిలుస్తాం. ఏ జీవి శరీరంలోనైనా ఆత్మ అనేది ఉందని చెప్పడానికి శరీరంలో వేడి ఉత్పత్తి కలగడమే నిదర్శనం. ఏదేని వస్తువులో గానీ, శరీరంలోగానీ ఆత్మ ఉన్నదా, లేదా అని నిర్ధారణ చేసుకోవ డం చాలా సులభం. రాపిడి కలిగించడం ద్వారా వేడి ఉత్పన్నమ వుతుంది. అంటే ఆత్మ అందులో ఉన్నట్టు. వేడి లేకుండా చల్లబడిపోతే ఆత్మ/సూర్యజ్యోతిస్టు లేనట్టే లెక్క. మరణించిన వాని గురించి చెప్పేటప్పుడు వీడి జ్యోతి ఆరిపోయింది అంటూం టాం. అలా జ్యోతి పోవడానికి నిర్ధారణ శరీరం పూర్తిగా చల్లబ డిపోవడం. 
atmaaమరి చలన రహితమైన వస్తువుల్లో కూడా వేడితో కూడిన వెలుగు ఉంటుంది అని రాపిడి ద్వారా మనకు తెలియ వస్తుంది. శిధిలావస్తకు చేరని వస్తుసముదాయాల్లో కూడా మనం సూర్యజ్యోతిస్టు గమనించబచ్చు. ఏదిఏమైనా ఆత్మ అంటే సూర్య జోతిస్టు అని సూర్యుడే పరమాత్మ. ఆ పరమాత్మలోని సూక్ష్మ కణాలే ఆత్మలు. దీనిని యోగసాధనతో తెలుసుకోగలడమే ఆధ్యా త్మవిద్య. ఈ ఆధ్యాత్మ విద్య లభ్యమయ్యేది కేవలం సూర్యని ఆరా ధించడం వల్లనే సాధ్యమవుతుంది. సూర్యోదయాన్ని, మధ్యా హ్నం, సూర్యాస్తమ యంలో సూర్యునికి నమస్కరించి దోసిలిలో నీళ్ళతో ఆర్ఘ్యం ఇవ్వాలి. సూర్యునికి నీరు ఎందుకు? అనే సంశ యం కలగకపోదు. ఎందుకంటే, సూర్యజ్యోతి ముందు నీరు గాను, తర్వాత ఘనీభవించిన మట్టిగాను మారుతోంది. అంతా పృధివి, ఆపత్‌, తేజ, వాయు, ఆకాశాత్‌ అనే చిన్న సూత్రంలోనే అంతా ఇమిడి ఉంది.