Pages

Friday, 14 June 2013

రంగుల్లో ఫెంగ్‌షుయ్‌ వాస్తు

ఆకర్షణీయమైన గృహాలలో రంగుల ఎంపికే కీలకం. ప్రస్తుతం రంగు రంగుల వర్ణాలతో నిర్మిస్తున్న వాణిజ్య సముదాయాలు, గృహాలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. దీనికి కారణం నిర్మాణం పూర్తయిన భవనానికి వాడేందుకు ఎంచుకునే రంగులే ప్రధానం. గృహాలను మనకు తోచిన విధంగా నిర్మించడమే కాకుండా.. గృహానికి వేసేందుకు వాడే రంగులను ఎంపిక చేసుకోవడం కీలకం. అయితే గృహాలతో పాటు ఇతర వ్యాపార సముదాయాలకు వేసే రంగుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఫెంగ్‌షుయ్‌ శాస్త్రం వివరిస్తోంది. అందుకే ఈ శాస్త్రంలో రంగులకు అత్యంత ప్రాధాన్యత ఉంది.

strutresఒక గృహానికి లేదా వాణిజ్య సముదాయా నికి వాడబడే రంగులను బట్టే మనలో ఉత్సాహం, శక్తి పెరుగుతుందని, అందువల్ల గృహానికి అనుకూలమైన రంగులు వాడడం కూడా చాలా అవసరమని ఫెంగ్‌ షుయ్‌ పేర్కొంటోంది. గృహమే కాకుండా పడకగది, బాత్‌రూం, వంటగది, ఆఫీసు గది, పూజగది ఇలా ఏదైనా కావచ్చు వాటికి ఉపయోగించే రంగులు, అక్కడ ఉండే వ్యక్తుల అభి రుచికి తగినట్టుగా వుండాలి.మనిషి పెరుగుదల, పేరు ప్రతిష్టలు ఆర్జనలో రంగులు కీలకపాత్ర వహిస్తాయని ఫెంగ్‌షుయ్‌ శాస్త్రం పేర్కొంటోంది. ముఖ్యంగా నలుపు, తెలుపు, ఎరుపు రంగులు ఇందులో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. వ్యాపార కార్యకలాపాలు వృద్ధిలో నలుపు రంగుతోనూ, పేరు ప్రఖ్యాతులకు ఎరుపు రంగుతోనూ అవినాభావ సంభంధం ఉంది. తెలుపు రంగు స్వచ్ఛతకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. houseఅయితే చైనీయులు మాత్రం ఈ తెలుపు రంగును దహన సంస్కారాల్లో ఉపయోగిస్తున్నారు. కొన్ని ప్రాశ్చాత్య దేశాలకు చెందిన వారు తెలుపు రంగును వివాహ సమయాల్లో విధిగా ధరిస్తారు. అలాగే భారతీయులు ముఖ్య శుభ కార్యక్రమాల్లోనే కాకుండా శవం మీద కప్పేందుకు తెలుపు రంగు గుడ్డనే వాడుతారు. పిల్లల గదులు, వంట గదులు తెలుపు రంగులో ఉండటం శ్రేయదాయకం. రంగుల ప్రాధాన్యతను భారతీయ వాస్తు శాస్త్రం చర్చింది. అయితే వాస్తు శాస్తజ్ఞ్రులు మాత్రం ఈ అంశం పట్ల అధిక శ్రద్ధ చూపకపోవడంతో రంగుల ప్రాధాన్యత అంతగా పట్టించుకోవడం లేదు. 

స్నానపు గదుల వాస్తు తీరు
tubsఇంటిలో పడకగదులను బట్టి ఎటాచ్‌డ్‌ బాత్రూమ్స్‌ లెట్రిన్స్‌ వాస్తు రీత్యా ఏర్పాటు చేసుకోవాలి. వాస్తు రీత్యా కాకుండా ఎలా పడితే అలా నిర్మంచుకోవడం వలన చెడు ఫలితాలు కలుగుతాయి. ఇంటినంతా వాస్తు రీత్యా నిర్మించి వీటి విషయంలో అశ్రద్ధ వహిస్తే చెడు ఫలితాలే కలుగు తాయి. నైరుతీ మూలలో పడక గది మంచి ఫలితాలు కలిగిస్తుంది. ఈ పడక గదిలో తూర్పువైపుల దక్షిణపు గోడను ఆనుకొని ఉండేటట్లుగా బాత్రూమ్‌, లెట్రిన్‌ను నిర్మించుకోవాలి.housesఇందులో లెట్రిన్‌ పాట్‌ను దక్షిణగోడకు ఆనించి కనీసం ఒక అడుగైనా ఎత్తు ఉండేలా నిర్మించాలి. అదే దక్షిణం గోడకు వెంటిలేటర్‌ అమర్చాలి. బాత్‌రూమ్‌ తలుపును బాత్రూమ్‌ పశ్చిమ లేదా వాయువ్యంలో ఉంచాలి. నైరుతీ మూలన రెండు పడకగదులకు ఎటాచ్‌డ్‌ బాత్రూమ్‌లు ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పు డు నైరుతిలో ఒక పడక గదిని కట్టి, దాని తూపు వైపున రెండు బాత్రూమ్స్‌ నిర్మించి రెండోవ బాత్రూమ్‌ను ఆనుకొని తూర్పు వైపుకు మరొక పడకగదిని ఏర్పాటుచేయాలి. ఈ నిర్మాణాలు దక్షిణ గదిని ఆనుకుని ఉండాలి. ఆగ్నేయ భాగంలో వంటగదిని నిర్మించే చోటు వదలాలి. నైరుతి నుండి తూర్పు భాగం వైపు - దక్షి ణాన్ని ఆనుకొని నిర్మించిన పడకగదులలో దక్షిణం వైపు తల ఉండేటట్లు పడకలు ఏర్పా టు చేసుకోవాలి. నిద్ర లేవగానే ఉత్తరదిశను చూసి, అటువైపు కొంచెం నడక సాగించి, అటునుంచి పశ్చిమంగా గానీ వాయువ్యంగా గానీ బాత్రూమ్‌లోకి వెళ్లడం మంచిది. ఈ విధమైన నడకలు మంచి ఫలితాలు ఇస్తాయి.