Pages

Friday, 14 June 2013

వ్యాపార విజయానికి ఫెంగ్‌ షూయ్‌


సాధారణంగా మనకు కలసిరానప్పుడు ఇంట్లో మార్పులు చేసుకుంటే సరిపోతుందనుకుంటారు చాలా మంది. కానీ అది నిజం కాదు. ఇంటితో పాటు మన వ్యాపకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సాధ్యమైనంతవరకూ మార్పులు చేసుకోగలిగితే మనం అనుకున్నది సాధించేందుకు కొంత అనుకూలత ఉంటుంది. వ్యాపారంలో విజయం సాధించడానికి దానికి సంబంధించిన కార్యాలయంలో మార్పులు చేసుకుంటే సరిపోతుందని ఫెంగ్‌షూయ్‌ చెప్తుంది. మన వ్యాపార విజయానికి, కార్యాలయంలో ప్రశాంతతకు చేయవలసినవి, చేయకూడని పనులు కొన్నింటిని సూచిస్తోంది.

housendనాయకత్వం వహించే వారు దానిని నిలుపుకోవాలంటే ముఖద్వారానికి ఐమూల గా కూర్చోవాలి. ద్వారానికి ఈ స్థానం సాధ్యమైనంత దూరంగా ఉండాలి.వ్యాపారం విజయవంతం కావాలంటే ము ఖ ద్వారం బయట పరిశుభ్రం గా ఉండడం అవసరం. ద్వారం బయట రక్షణ కోసం ఫూ డాగ్స్‌ లేదా లయన్స్‌ బొమ్మలను పెట్టుకోవచ్చు.ద్వారానికి ఎదురుగా కూర్చోవడం మంచిది కాదు. ఎందుకంటే ప్రతికూల శక్తి ప్రవహించే దారిలో మీరు కూర్చున్నట్టు అవుతుంది.కూర్చున్నప్పుడు వెనుక గోడ ఉండేలా చూసుకోవాలి. ఆ గోడకు మూల నుంచి ఏదైనా కొయ్య ముక్కలాంటిది ముందుకు పొడుచుకు వచ్చినట్టుగా ఉంటే దానికి ఒక చిన్న కుండీలో మొక్కను ఉంచి వేలాడదీయండి.

మీరు కూర్చున్న కుర్చీ వెనుక ఒక పొడవాటి భవనం ఫోటో తగలించుకుంటే మంచిది. ఇది మీకు అండనిస్తుంది. వ్యాపారాన్ని నిర్వహించేవారు ద్వారానికి వీపు పెట్టి కూచోకూడదు. ఎందుకంటే వ్యాపార అవకాశాలు ద్వారం గుండానే వస్తాయి కనుక వాటికి వీపు పెట్టి కూర్చోకూడదు. ఏదైనా బహుళ అంతస్థుల భవనం లో కార్యాలయం ఉన్నప్పుడు కారిడార్‌కు లేదా మెట్లు లేదా స్టోర్‌ రూమ్‌లు, లిఫ్టులు, టాయిలెట్లు వంటివి వాటి ముఖంగా కూర్చోకూడదు.సృజనాత్మక శక్తి బాగా పెంపొందేందు కు కంప్యూటర్‌ను వాయువ్య దిశలో పెట్టుకోవాలి. ఆదాయం ఎక్కువగా లభించాలనుకునే వారు తమ కంప్యూటర్‌ను ఆగ్నేయ దిక్కున పెట్టుకోవాలి. 
interior-houseఆఫీసులో తూర్పు ది క్కున లేదా ఉత్తరాన లే దా ఆగ్నేయ దిక్కున ఆక్వేరియంను లేదా టేబుల్‌ టాప్‌ ఫౌంటెన్‌ను పెట్టుకోవాలి. మీ డెస్క్‌కు ఉత్తరాన నలుపు లేదా నీలం రంగు చేపలు వేసిన చిన్న కుండీని పెట్టుకోవడం వల్ల లేదా కార్యాలయంలోనైనా సరే పెట్టడం వల్ల మీ వాణిజ్యం, కెరీర్‌ విజయవంతం అవుతాయి.పశ్చిమాన లేక వాయువ్య దిక్కున లోహం తో తయారు చేసిన సేఫ్‌ను పెట్టుకోవాలి. ఎం దుకంటే ఈ రెండు దిక్కు లూ లోహానికి సంకేతాలు. వ్యాపారంలో ఆర్ధిక భద్రతకు, సంపదకు సేఫ్‌ ఒక సంకేతం. 

పని ప్రదేశాన్ని డెకొరేట్‌ చేసేటప్పుడు యిన్‌-యాం గ్‌లు రెండూ సమతులం గా ఉండేలా చూసుకోవా లి. లేత, ముదురు రంగులను సమతులం చేసుకోవాలి. అలాగే ప్రతి అలంకరణలోనూ రెండింటినీ సమతులం చేసుకోవడం అవసరం. అది కిటికీలకు సంబంధిం చిందైనా, ఫర్నిచర్‌కు సంబంధించి అయినా, ఫ్లోరింగ్‌కు సంబంధించింది అయినా.ఆఫీసులో అద్దాలు పెట్టుకోవడం మంచిది కాదు. ఇది క్లైంట్ల నుంచి వచ్చే ప్రతికూల శక్తిని ఆ గదిలో ఉన్నవారిపై ప్రతిఫలింప చేస్తుంది. కార్యాలయంలో శక్తిపై ఎప్పుడూ నియంత్రణ అవసరం. 
మీ ఆఫీసులో ఫైళ్ళను గౌరవించాలి. ఎందుకంటే అవి వ్యాపార గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
house-offcieకార్యాలయంలో వైర్లు వంటి వాటిని లోపలికి ఉండేలా చూసుకోవాలి. వైరింగ్‌ అంతా అంతర్గతంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల చెత్త పోయి ప్రాణాధార శక్తి ఎటువంటి ఆటంకాలూ లేకుండా ప్రవహిస్తుంది.కార్యాలయంలో లోహంతో చేసిన విండ్‌ చైమ్‌లను ఎర్రని రిబ్బన్‌తో కట్టడం ఎంతో మంచిది. ఇది మీ వ్యాపారంలోకి మరింత డబ్బు వచ్చి చేరేందుకు ఉపకరిస్తుంది. వీటిని ద్వారం వద్ద కానీ ఫెంగ్‌షూయ్‌ సంపద మూలలో కానీ కట్టవచ్చు. 

అలాగే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు సంపద మూలన ఒక ప్రపంచ పటాన్ని తగిలించడం ఎంతో మేలు చేస్తుంది. లేదా ఒక గ్లోబ్‌ను పెట్టవచ్చు. దానితో పాటుగా మీరు విజయవంతంగా చేసిన ప్రాజెక్టు తాలూకు కాపీని లేదా ఒక పర్పుల్‌ కలర్‌ ఫోల్డర్‌పై బంగారు రంగు అక్షరాలతో మీ కంపెనీ పేరు లేదా లోగో ముద్రించి ఉన్నది పెట్టుకోవాలి.ముఖ ద్వారం బయట గుండ్రటి ఆకులు గల మొక్కలను పెట్టుకోవడం క్లైంట్లకు,ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలను పెంచుతుంది.