సాధారణ మనుష్యుని సూక్ష్మశరీరం అంటే ప్రేతదేహం.స్వర్గలోకం వరకు చేరుతుంది.మహర్లోకం చేరిన తరువాత దేహం నశించిపోతుంది. కేవలం పొగ మిగిలిఉంటుంది .ఆవాయుశరీరాన్ని ఆధారమ్ చేసుకునే పైలోకాలకు లేవవలసి ఉంటుంది. మహర్లోకంలో శరీరం నశించిపోయేంతవరకు అనుభవించాలన్న కోరిక పిసరంత మిగిలిఉన్నా అతని పతనం తప్పదు. అంటే స్థూలశరీరం లేకపోవడం వలన అతను భూలోకం వచ్చి శరీరధారన చేయవలసి ఉంటుంది.
అతను స్వర్గంలోకం లోంచి ఆకాశంలోకి వస్తాడు. మబ్బులద్వారా వర్షమయి భూగోళానికి దిగివచ్చి నేలను చేరుతాడు. తరువాత మొక్కగా మారుతాడు.దాన్ని మనుషులు తినవచ్చులేదా పశువులు తింటాయిఅలా తిండిద్వారా రక్తంలోకి వెళ్లి వీర్యమయి తల్లికడుపులోకి చేరుతాడు.మనిషిగాగాని లేదా పశువుగానైనా ఏదో ఒకజీవరూపం పొందుతాడు. కర్మానుసారంగా ఉంటుంది ఆజీవి జన్మ .అంతకుపూర్వం అనుభవించగా మిగిలిఉన్నదాన్ని ఆజీవి ఇప్పుడనుభవిస్తుంది . ఈవిధంగా ఆజీవిభోగం[అనుభవం]పూర్తవుతుంది.