- శొంఠిని, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను సమభాగాలు తీసుకొని కల్కంగా (ముద్దగా) నూరాలి. దీనికి ఆవునెయ్యిని, నువ్వుల నూనెనల మిశ్రమాన్ని నాలుగు భాగాలు కలపాలి. పెరుగు మీద తేటను 8 రెట్లు కలిపి ద్రవాంశం మొత్తం ఆవిరైపోయే వరకూ చిన్న మంట మీద మరిగించి వడపోసుకొని నిల్వ చేసుకోవాలి. దీనిని ఉదయ సాయంకాలాలు 10-20 మిల్లీలీటర్లు మోతాదులో తీసుకుంటుంటే ఉదర వ్యాధుల్లో హితకరంగా ఉంటుంది.
- శొంఠి కషాయానికి స్వర్జికాక్షారం (చాకలి సోడా/ సోడియం కార్బోనేట్)ను, తేనెను కలిపి పుక్కిట పడితే నోటికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అలాగే తిప్పతీగ కాండాన్ని, వేప బెరడును ముద్దగా నూరి తేనె, నువ్వుల నూనె కలిపి పుక్కిట పట్టవచ్చు కూడా.
- శొంఠి కషాయానికి బెల్లం కలిపి రెండు ముక్కు రంధ్రాల్లో నస్యంగా వేసుకుంటే బాధిర్యం, చెవుల్లో శబ్దాలు రావటం వంటివి తగ్గుతాయి.
- శొంఠి ముద్దను వేడిచేసి వేపాకుల ముద్దను కలిపి కొద్దిగా రాతి ఉప్పును కలిపి కనురెప్పల మీద ప్రయోగిస్తే కళ్లవాపు, దురద, నొప్పి వంటివి తగ్గుతాయి.
- శొంఠి కల్కాన్ని పాలకు కలిపి రెండు నాసికా రంధ్రాల్లో నస్యంగా వేసుకుంటే తీవ్రమైన తలనొప్పి సైతం తగ్గుతుంది.
- శొంఠి కల్కాన్ని, బెల్లాన్ని కలిపి తయారుచేసిన ద్రవాన్ని ముక్కు రంధ్రాల్లో నస్యంగా వేసుకుంటే తలకు సంబంధించిన సమస్యల్లో ఉపశమనం లభిస్తుంది.
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼