Pages

Sunday, 28 July 2013

సోరియాసిస్-చుండ్రు



సొరియాసిస్ తల మీద ఉన్నప్పుడే వైద్య చికిత్సలు తీసుకుంటే అంతటితో సమస్య సమాప్తమయ్యేదే. కానీ, తలనుంచి పొడి పొడిగా రాలుతుంటే ఏదో చుండ్రులే అనుకుని ఎన్నాళ్లు నిర్లక్ష్యంగా ఉండిపోలేదు!. తలనుంచి చెవులు, మెడ దాటి నిలువెల్లా పాకేసిన తరువాత ఇప్పుడు అది సొరియాసిస్ అని తెలుసుకుని గగ్గోలు పెడితే ఏముంటుంది?
సొరియాసిస్ మొదలై అప్పటికే చాలా ఏళ్లు గడిచిపోయి ఉంటే, కిడ్నీలు, లివర్, గుండె వంటి శరీరంలోని కీలక భాగాలే వ్యాధిగ్రస్తం కావచ్చు. సొరియాటిక్ ఆర్థరైటిస్ మొద లై కాళ్లూ చేతులూ వంకర్లు పోయి కదల్లేని స్థితి ఏర్పడవచ్చు. అందుకే, అది చుండ్రో సొరియాసిస్సో వైద్యనిపుణులను సంప్రదించాక గానీ ఒక నిర్ధారణకు రాకూడదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పూజారి రవికుమార్.

చర్మాల మర్మం తెలుసుకోవడం అంత సులువేమీ కాదు. తలనుంచి పొడిగా రాలుతున్నంత మాత్రాన అది చుండ్రే అనుకుంటే ఎలా? తెలిసిన వ్యాధి లక్షణాన్నే ఆన్ని వ్యాధులకూ ఆపాదిస్తూ వెళితే చివరికి నష్టపోయేదెవరు? లక్షణాలు ఒకేలా కనిపించినంత మాత్రాన వ్యాధులన్నీ ఒకటే కావుకదా! ఒక్కోసారి అది ఫలానా వ్యాధి అని గుర్తించేలోపే వ్యాధి శ రీమంతా పాకిపోవచ్చు. సొరియాసిస్ లాంటి వ్యాధులు పైకి చర్మం మీదే ఉన్నట్లు అనిపించినా, లోలోపల అవి శరీరంలోని ఇతర అవయవాల మీదా తమ ప్రభావం చూపుతాయి. ప్రత్యేకించి, శరీరంలోని ఇతర కీలక అవయవాలన్నింటి మీదా ఎంతో తీవ్ర ప్రభావం చూపే సొరియాసిస్ నూటికి 90 మందిలో తలమీదే మొదలవుతుంది. చుండ్రు కూడా తలమీదే రావడం వల్ల చాలా మంది సొరియాసిస్‌ను చుండ్రుగా పొరబడుతుంటారు.

ఎన్నెన్ని పొరలో...
పైపైన చూస్తే చాలా విషయాలు ఒకేలా కనిపిస్తాయి. నిశితంగా చూస్తేనే కదా నిజాలు తెలిసేది. సహజంగానే శరీరమంతా ఉన్న చర్మానికీ , తల మీది చ ర్మానికీ ఎంతో వ్యత్యాసం ఉంది. శరీరం మొత్తాన్ని ఆవరించి, అవభాషిణీ, లోహిత, శ్వేత, తామ్ర, వేధిని, రోహిత మాంస అనే ఏడు పొరలు ఉంటాయి. అయితే, తలమీద చర్మంలో ఐదు పొరలే ఉంటాయి. మిగతా భాగాలకన్నా తల మీద తక్కువ పొరలు ఉండడం వల్ల సొరియాసిస్ ఎక్కువ మందిలో తల మీదే మొదలవుతుంది. తలమీద ఏదైనా పొరలాంటిది ఏర్పడినప్పుడు చాలా మంది దాన్ని చుండ్రుగానే భావిస్తారు. అయితే సొరియాసిస్ మచ్చల్లో దురద ఉండట వల్ల గోకడం మొదలెడతారు. ఈ గోకడంతో ఆ మచ్చలున్న చోట పొరలు పొరలుగా లేచిపోతూ ఆ తరువాత వాపు ఏర్పడుతుంది. వాపు ఏర్పడ్డాక కూడా ఇంకా అలాగే గోకుతున్నప్పుడు ఆ భాగంలో ఇన్‌ఫెక్షన్లు మొదలవుతాయి. ఈ దశలో యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్ షాంపూ వాడుతూ ఉంటారు. వీటి వల్ల సొరియాసిస్ తాత్కాలికంగా అణచివేయబడి ఆ భాగమంతా కొద్దిరోజులు పొడిపొడిగా ఉండిపోతుంది. కానీ, ఏదో ఒక దశలో సొరియాసిస్ పూర్తి రూపంలో బయటపడుతుంది.

చేప పొట్టులా రాలుతుంటే ...
ఏ కాస్త పరిశీలించినా చుండ్రుకూ, సొరియాసిస్‌కూ ఉన్న తేడా ఇట్టే తెలిసిపోతుంది. అలా పరిశీలించకపోవడం వల్లే సొరియాసిస్‌ను చాలా మంది చుండ్రుగా పొరబడుతుంటారు. వాస్తవానికి ఈ రెండింటికీ మధ్య ఒక స్పష్టమైన తేడా ఉంది. మూడు నాలుగు రోజులు తలస్నానం చేయకుండా ఉండిపోయి, ఆ తరువాత దువ్వితే పొడిలా రాలితే అది చుండ్రు. అలా కాకుండా చేపపొట్టులా పొట్టుగా పెళుసులు, పెళుసులుగా రాలితే అది సొరియాసిస్. ఇవి ఎవరైనా సులువుగా పసిగట్టగలిగే తేడాలు. కాకపోతే, అది సొరియాసిస్ అని గుర్తించి కూడా కొందరు, ఇంకా తలమీదే ఉంది కదా! అది శరీర ం మీదికి పాకిన తరువాత చూసుకోవచ్చులే అనుకుని మిన్నకుండిపోతారు. అది మరీ పమాదం. సొరియాసిస్ తలమీద ఒక కనిపించడం అంటే, అది శరీరమంతా వ్యాపించిన ఆమాన్ని అంటే విషపదార్థాల్ని సూచించడమే.

ముందు, శరీరమంతా ఆమం వ్యాపించాకే అది ఇప్పుడు ఇలా తలమీద ఒక లక్షణంగా కనిపిస్తోంది అంతే గానీ, సమస్య అంతా తలకే పరిమితమై ఉందని కాదు. ఈ దశలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే, కొద్దిరోజులయ్యాక ఒక్కొక్కటిగా ఏవేవో వ్యాధులు బయటపడటం మొదలవుతుంది. అప్పటిదాకా ఎంతో ఆరోగ్యంగా ఉన్నామనుకుంటూ ఉండిపోయిన వారిలో హఠాత్తుగా అధిక రక్తపోటు, మధుమేహం మొదలవుతాయి. ఆ తరువాత విపరీతంగా కీళ్లు సలిపే ఆర్థరైటిస్ సమస్య మొదలవుతుంది. ఆ తరువాత కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, గుండె జబ్బులు ఒక్కొక్కటిగా వ చ్చి బె ంబేలెత్తి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. వరుస పరంపరగా వచ్చిపడుతున్న వీటన్నింటి వెనుక సొరియాసిసే మూలంగా ఉందని తెలిసే నాటికి పరిస్థితి బాగా విషమించిపోవచ్చు.

ఎన్నాళ్లని కాదు...!

పైకి కనిపించినప్పుడే సమస్య ఉన్నట్లు కాదు కదా! కొన్ని వ్యాధుల దుష్ప్రభావాలు ఏళ్లు గడిస్తేగానీ బయటపడవు. కానీ, సొరియాసిస్ వాటికి భిన్నమైనది. సొరియాసిస్ ఎంత కాలంగా ఉంది? శరీరంలో ఎంత భాగం పాకింది? ఎంత తీవ్రంగా ఉంది? అన్నది విషయమే కాదు. వ్యాధి లక్షణాలు ఇప్పుడిప్పుడే బయటికి కనిపించి ఉండవచ్చు. కానీ, ఆ వ్యాధికారకమైన ఆమం శరీరంలో ఎప్పుడో మొదలై ఉంటుంది. అందుకే సొరియాసిస్‌గా చర్మం మీదే ఆగకుండా, శరీరంలోని వివిధ భాగాలకూ విస్తరిస్తూ వెళుతుంది. అది ఎక్కువ కాలంగా తల భాగానికే పరిమితమె ఉన్నా, రక్తంలోని హిమగ్లోబిన్ మాత్రం వేగ ంగా తగ్గుతూ వెళుతుంది. అది మరెన్నో ప్రమాదకర వ్యాధులకు దారి తీస్తుంది. సొరియాసిస్ ఏళ్ల పర్యంతంగా ఉంటేనే ఇతర భాగాలు దెబ్బతింటాయిని కాదు. కొందరిలో వ్యాధి మొదలైన మూడు మాసాలకే పలు రకాల వ్యాధులు మొదలైపోవచ్చు. కీళ్లన్నీ దెబ్బ తినే సొరియాటిక్ ఆర్థరైటిస్‌తో పాటు, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకోవచ్చు.

ఇన్ ఫెక్షన్లు తీవ్రమై...
సిస్టమిక్ లూపస్ ఎరిథమ్యాటోసిస్ (ఎస్ఎల్ఇ) అనే మరో సమస్య కూడా ఉంది. దీనికీ సొరియాసిస్‌కూ దగ్గరి పోలికలు ఉన్నాయి. ఇది త ల మీది నుంచే మొదలవుతుంది. తల మీద ఒక చిన్న మచ్చలా పొక్కులా ఏర్పడుతుంది. అక్కడ ఒకసారి వెంట్రుకలు రాలిపోతే, మళ్లీ ఎప్పుడూ అక్కడ వెంట్రుకలు మొలవవు. తలకే పరిమితం కాకుండా అది శరీరమంతా పాకుతుంది. చాలా మంది ఈ సమస్యను సొరియాసిస్‌గానే భావించే ప్రమాదం ఉంది. అప్పటికైనా ఆ సమస్యను గుర్తించకపోతే, గుండెను, కిడ్నీలను, లివర్‌ను దుష్ప్రభావానికి గురిచేసే ప్రమాదం ఉంది. నిజానికి ఇది ఒక ప్రాణాంతక వ్యాధి. అయితే దీనికీ, సొరియాసిస్‌కూ సంబంధం లేదు.

కాకపోతే ఈ ఎస్ఎల్ఇ, సొరియాసిస్ ఈ రెండూ ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో వచ్చే సమస్యలే. ఈ వ్యాధులకు అల్లోపతిలో శాశ్వత చికిత్సలేమీ లేవు. వాస్తవానికి ఈ వ్యాధి వ్యాధినిరోధక శక్తిని పెంచడం ద్వారా మాత్రమే తగ్గుతుంది. ఆ పెంచడం అన్నది ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సలు, రసాయన చికిత్సలతోనే సాధ్యమవుతుంది. అల్లోపతిలో స్టెరాయిడ్స్, ఇమ్యూనో సప్రెసార్స్, చివరికి కేన్సర్ మందుల దాకా వెళుతున్నారు. ఇవన్నీ వ్యాధిని తాత్కాలికంగా అణచివేసినా, చివరికి ఇవి మనిషిని నిర్జీవంగా మార్చి చివరికి ప్రాణాపాయ స్థితికి తీసుకువెళతాయి. అలర్జిక్ డెర్మటైటిస్ అనే మరో వ్యాధి కూడా తలమీదే మొదలవుతుంది. దురద ఆ తరువాత పొట్టు రాలడం వంటి లక్షణాలతో ఆ తరువాత ఎగ్జిమాగా మారుతుంది. అయితే, చివరికి ఏదో ఒక దశలో తప్పనసరిగా ఇది సొరియాసిస్‌గా మారుతుంది.

వేళ్లను పెకిలించకుండా వైద్యాలా?
సొరియాసిస్ కేవలం చర్మంలోంచి పుట్టుకొచ్చే వ్యాధి కాదు. శరీరమంతా వ్యాపించిన ఆమం అంటే విషపదార్థాల పరిణామమది. సొరియాసిస్ రావడానికి శరీరంలో విషపదార్థాలు పేరుకుపోవడం ఒక కారణమైతే, వ్యాధినిరోధక శక్తి తగ్గడం మరో కారణం. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, విసర్జన క్రియ సరిగా లేకపోవడం ద్వారా శరీరంలో ఆమం ఏర్పడటానికి ప్రధాన కారణాలుగా ఉంటాయి. వ్యాధినిరోధక శక్తి తగ్గడానికి ఏదో ఒక రీతిన సూక్ష్మాతి సూక్ష్మ పరిమాణంలో మనలోకి ప్రవేశించే విషపదార్థాలే కారణం అవి ఆహారంలోంచి గానీ, నీటిలోంచి గానీ, లే దా గాలిలోంచి గాని వచ్చి చేరవచ్చు.

ఆమం శరీరంలో క్రమేణా పెరుగుతూ పోయి ఒక దశలో మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని సమూలంగా హరించి వేస్తుంది. ఫలితంగా బీటా సెల్స్, టీ-సెల్స్ అతిగా పనిచే స్తూ,కొన్ని రకాల రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి శరీరంలో సమస్త వ్యవస్థలను దారుణంగా దెబ్బ తీస్తాయి. అల్లోపతి వైద్య విధానాల్లో బ్యాక్టీరియల్ డిసీస్ ఉంటే యాంటీ- బ్యాక్టీరియల్ మందులు, వైరల్ డిసీస్ ఉంటే, యాంటీ వైరల్ మందులు ఇస్తున్నారు. ఇక మిగతా అన్ని చర్మ వ్యాధులకూ స్టెరాయిడ్స్ మీదే ఆధారపడుతున్నారు. ఇవన్నీ వ్యాధిని తాత్కాలికంగా అణచివేయడానికే తప్ప వ్యాధి శాశ్వతంగా నిర్మూలించడానికి ఎంతమాత్రమూ పనికి రావు.

ఆయుర్వేదం ఒక వరం
చుండ్రునుంచి సొరియాసిస్ దాకా ఏ చర్మ వ్యాధికైనా ఆయుర్వేదంలో సమర్థవంతమైన వైద్య చికిత్సలు ఉన్నాయి. ప్రత్యేకించి, పంచకర్మ చికి త్సలు, రసాయన చికిత్సల ద్వారా వ్యాధినిరోధక శక్తిని ఘననీయంగా పెంచే అవకాశాలు ఉన్నాయి. సొరియాసిస్ తలమీద మొదలైనప్పుడు చాలా మంది గుర్తించడం లేదు. ఏవో షాంపూలతో, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ మందులతో కాలయాపన చేస్తున్నారు. ఒక దశలో అది శరీరమంతా వ్యాపించిపోతే , బెంబేలెత్తిపోతున్నారు. కానీ, తలమీద ఉన్నప్పుడే సొరియాసిస్‌ను గుర్తించగలిగితే, ఆయుర్వేద మందులతో దాన్ని తొలగించడమే కాకుండా, అది శరీరమంతా పాకకుండా పూర్తిగా నివారించవచ్చు. సొరియాసిస్ తల భాగానికే పరిమితమై ఉంటే, శిరోధార చికిత్స ద్వారా, తగ్గించవచ్చు. ఆయుర్వేద చికిత్సలు సొరియిసిస్ లక్ష్యంగా చేసినా, అవి మునుముందు రాబోయే పలు రకాల వ్యాధులకు ముందే అడ్డుకట్ట వేస్తాయి. కాకపోతే, వైద్య చికిత్సలంటే ఎంత కాలం పడుతుందో ఏమిటో అనుకుంటారు కానీ, ఏళ్లపర్యంతంగా ఉన్నా సొరియాసిస్‌ను నయం చేయడానికి మూడు నాలుగు వారాలకన్నా ఎక్కువ సమయం పట్టదు.

కాకపోతే జీవితంలో మరోసారి సొరియాసిస్ రాకుండా చేయడానికి మరికొద్ది రోజులు మందులు వాడవలసి ఉంటుంది. ఏవో తాత్కాలిక వైద్యాలకు వె ళ్లడం అంటే సమస్యను చేతులారా జటిలం చేసుకోవడమే. ఎవరైనా సొరియాసిసేమో అన్నప్పుడల్లా ...అబ్బే అదేం కాదులే అని ఎన్నాళ్లని దాటవేస్తారు. అది సొరియాసిసేనని ఒప్పుకునే దాకా మీరు ఆయుర్వేద వైద్య చికిత్సలకు వెళ్లరు. వైద్య చికిత్సలకు వెళితేగానీ, సమస్యనుంచి శాశ్వతంగా మిముక్తం కాలేరు. అందుకే మీకున్నది సొరియాసిసేనని బాహాటంగా ఒప్పుకోండి. ఆయుర్వేదం మానవాళికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. ఒక్కసొరియాసిస్ ఏమిటి? మీకున్న సమస్త వ్యాధులనుంచి ఏకకాలంలో విముక్తం కండి.

డాక్టర్ పూజారి రవికుమార్
ఆర్ కె ఆయురే వదిక్ అండ్ సొరియాసిస్ సెంటర్
క్లినిక్స్: హైదరాబాద్,విజయవాడ, వైజాగ్, హన్మకొండ,కర్నూలు, తిరుపతి
ఫోన్స్:98492 54587, 040-23057483