Pages

Saturday, 6 July 2013

చదువుల అంకపీఠిక కొల్లూరు మూకాంబికా దేవాలయం



mooka
కర్నాటక రాష్ట్రంలోని మంగుళూరుకు 130 కి.మీ దూరంలో కొల్లూరులో నెలవైన విద్యనిచ్చే చదువులతల్లి మూకాంబిక దేవాలయం పశ్చిమ కనుమల సానువుల్లో దట్టంగా చిక్కటి అడవులు, గలగలా పారే సౌపర్ణికా నదీ పరవళ్ళు, లేలేత సూర్యకిరణాలు ప్రసరించే ఉషోదయాన మెరిసిపోతున్న వేళ ప్రకృతి అందాలు మరింత ఇనుమడించిన ఆ పవ్త్రి జలాల్లో స్నానమాచ రించి మూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకోవడం పరమ పవ్త్రిం. విద్యార్థి లోకానికి సర్వ వర ప్రదాయిని ఈ మూకాంబికా అమ్మవారు. ఆలయం దట్టమైన అడవుల మధ్య వెలసిన అతి ప్రాచీనమైన దేవాలయం. దేశంలోని నలుమూలలనుండి మూకాంబికా దర్శనం కోసం వేంచేస్తుంటారు. కర్ణాటక రాష్ట్రంలోని ఏడు మోక్ష పురాల్లో సుబ్రహ్మణ్య, కుంభాసి, కోడేశ్వర, ఉడిపి, శంకర నారాయణ, గోకర్ణం, కొల్లూరు మూకాంబికా గుడి ఒకటి. పూర్వాశ్రమంలో కొల్లూరును మహారణ్యపురమని పిలిచేవారు.

ఆలయ వైశిష్ట్యం: 

మూకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదువుతారని, తెలివిగల వారై జ్ఞాన సంపన్నులౌతారని ప్రతీతి. అమ్మవారి సన్నిధిలో కాలభైరవుడి విగ్రహం ఉంది. సింహ ద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే, గుడివైపున కాలభైరవుడు దర్శమిస్తాడు. 1200 సంవత్సరాల క్రితం నిర్మించిన మూకాంబిక ఆలయాన్ని ప్రతిరోజూ కొన్నివేలమంది భక్తులు దర్శించుకుంటారు. వీరిలో ఎక్కువశాతం కేరళవాసులే కావడం విశేషం. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. మూకాంబిక ఆలయంలో తేనె, మొదలైన పదార్థాలతో తయారు చేసిన ‘పంచకడ్జాయం’ అనే ప్రసాదం పెడతారు. పూర్వం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించిన తరువాత, ఆలయంలో ఉన్న ఒక బావిలో వేసేవారట.

ఇదంతా చూసిన చదువురాని ఒక కేరళ నివాసి, ప్రసాదం బావిలో వేసే సమయంలో నీటి అడుగున దాక్కొని ఆ ప్రసాదాన్ని తిన్నాడట. అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదం తిన్నందువల్ల, అతడు మహా పండితుడయ్యాడని అంటారు. అందుచేత కేరళ ప్రజల్లో అమ్మవారిపై అపార విశ్వాసం. ప్రతిరోజు ఈ ఆలయంలో జరిగే అక్షరాభ్యాస కార్యక్రమాలు భక్తుల విశ్వాసానికి నిదర్శనం.

కొల్లూరు క్షేత్ర మహిమ


ఈ కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడం, దేవి ప్రత్యక్షమవ్వడం తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడగడం, దేవి కోరిక మన్నించి ఆదిశంకరాచార్యుల వెంట నడవడం కాని వెనక్కి తిరిగి చూడ వద్దని, అలా వెనక్కి తిరిగి చూస్తే చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు చెప్పడం...ఆ షరతుకు అంగీకరిం చిన శంకరాచార్య ముందుకు నడుస్తూ.. . వెనుక అమ్మవారు వెళ్తూ వెళ్తూ కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో వెనుకకు తిరిగి చూడడం ఇచ్చిన మాట తప్పడంతో అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆదిశంకరుల వారు శ్రీ చక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారని ప్రతీతి.