Pages

Saturday, 6 July 2013

జ్యోతిష్య శాస్త్రవేత్తలు -పరిశోధనా ఫలితములు


గ్రహములకు వర్ణించిన రంగులన్ని  సూర్య కాంతిలో ఐక్యమై యున్నవి. వీటిని మనము ఆకాశములో అప్పుడప్పుడు కనపడే ఇంద్రధనుస్సులో చూడగలుగు చున్నాము.  సైన్స్ ప్రకారము సూర్యుని చుట్టూ గ్రహములన్నియు తిరుగుచున్నట్లు మన సైంటిస్టులు నిరుపించినారు. ఈ పద్దతి ప్రకారము విశ్వమంతటికీ సూర్యుడే ఆధారము.


భూమి స్తిరంగా ఉన్నదని అనుకొని మిగతా గ్రహములు నక్షత్రములు అన్నియు వాటి వాటి కక్ష్యలలో తిరుగుచున్నాయని అనుకొన్నప్పుడు విశ్వమంతటిని 27 నక్షత్రములు గావిభజించినారు.
కాని ఈ విశ్వములో అనంతమైన గ్రహములు నక్షత్రములను మనము చూడగలుగు చున్నాము. మరియు అనేక రకములుగా ఈ సృష్టిరహస్యం పై పరిశోధనలు జరుపుచునే యున్నాము.
భూమి చుట్టురా  గ్రహములన్నియు తిరుగు చున్నవని జ్యోతిష్యశాస్త్రవేత్తలు తెలిపియున్నారు. భూమి చుట్టూ చంద్రుడు మాత్రమె తిరుగు చున్నాడని భూమితో పాటు మిగతా గ్రహములన్నియు సూర్యునిచుట్టే తిరుగుచున్నవని విజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిపియున్నారు.

*భూమి తన చుట్టూ తాను తిరుగుటవలన పగలు రాత్రి ఏర్పడు చున్నవి.  చంద్రుడు భూమిచుట్టూ తిరుగుట వలన అమావాస్య పౌర్ణమి ఏర్పడుచున్నవి. ఈరెండు విషయములలో విజ్ఞానశాస్త్రవేత్తలకు, జ్యోతిష్యశాస్త్రవేత్తలకు పోలికయున్నది. *

గ్రహములన్నియు తమతమ కక్ష్యలలో సూర్యునిచుట్టూ { రాశి చక్రము చుట్టూ} తిరుగు చున్నవని మనకు తెలియును .కానీ ఆయా గ్రహములయొక్క  వేగము వివిధరకములుగాయున్నది
చంద్రుడు భూమిని చుట్టి వచ్చుటకు సుమారు 28 రోజులు భూమితో పాటు సూర్యుని చుట్టి వచ్చుటకు ఒక సంవత్సరం.
సూర్యుడు ఒక సంవత్సరము  { 1. ఇక్కడ జ్యోతిష్యశాస్త్రజ్ఞులు చెప్పిన విధముగా 2 .  విజ్ఞాన శాస్త్రజ్ఞులు చెప్పిన విధముగా భూమి సూర్యుని చుట్టి వచ్చుటకు )  
కుజుడు ఒక సంవత్సరం ఆరునెలలు
బుధుడు సుమారు ఒక సంవత్సరము
శుక్రుడు సుమారు ఒక సంవత్సరము
గురుడు పన్నెండు సంవత్సరములు
శని ముప్పై సంవత్సరములు.
రాహు , కేతు గ్రహములు పద్దెనిమిది సంవత్సరములు