Pages

Tuesday, 9 July 2013

కోర్కెలు లేని జీవితం సాధ్యమా!

ఏ కోరికలూ లేకుండా భగవంతుని ధ్యానిస్తూ ముక్తిని పొందాలన్నది శాస్తవ్రచనం. కానీ, ముక్తిని కోరడం కూడా ఒక కోరికే. మరి కోరిక అనే దానికి పర‘మార్ధం’ ఏమిటీ? అంటే, లౌకిక వాంఛలు తీర్చుకోవడం కోసం పుట్టుకొచ్చేకోరికలు అధమమైనవి. అలౌకిక పరమపథాన్ని చేరాలన్న వాంఛతో ఆచరించే ఏ కార్యమైనా నిష్కామమైనదిగానే పరిగణించ బడుతుంది. మానవ శ్రేయస్సుని, సమాజ అభివృద్దినీ కోరే కోరిక వల్ల మనిషికి దోషం అంటదు.

korik6అసలు లౌకిక వ్యవస్థలో కోర్కెలే మనిషిని జీవింపజేస్తాయి. కుండలు చేసే కుమ్మరి మొదలు ప్రాణం పోసే బ్రహ్మ వరకూ అందరూ మానవజాతికి మహోపకారం చేసే వారే. కోర్కెలు లేకుండా మానవుడు ఉండడు. ఉండకూడదు కూడా. కోర్కెలు మనిషి పురోగతికి బాటలు వేస్తాయి. కోర్కెలు అనంతం, మనిషి జీవితం పరిమితం. అనంతమైన కోర్కెలపైనే నిరంతరం దృష్టి సారించి, దైవాన్ని విస్మరించడం వల్లనే ఆధునిక మాన వుడు సుఖశాంతులకు నోచుకోలేకపోతున్నాడు. మనిషికి మానసిక శాంతిని ఇచ్చేది భగవత్‌ ధ్యానం ఒక్కటే . ఇది కొత్త విషయం కాకపోయినా, మంచి విషయా లను ఎన్నిసార్లు మననం చేసుకున్నా తప్పు లేదు. సాధు సంత్‌లు, పౌరాణికుల ప్రబోధాలను ఎన్ని విన్నా, ఎన్నిసార్లు విన్నా కోర్కెలను సాధించు కోవడం కోసమే దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటాం. ఐహికమైన కోర్కెలు అనంతం. 

ఒకటి తీరగానే, మరో కోర్కె పుట్టుకు వస్తుంది.అసలు కోర్కె అంటే అనంతమని నిర్వచించుకోవచ్చు. అయితే, కోర్కెలు లేని వారు మునులు, తపోధనులు మాత్రమే. సామాన్య ప్రజలకు కోర్కెలు అత్యంత సహజం. ఆహారం కోసం ఆదిమానవుడు నిప్పు పుట్టించిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. రెండు కర్రలను రాపిడి చేయడం ద్వారా నిప్పు పుట్టించి ఆ నిప్పు ద్వారా ఆహారాన్ని పక్వం చేసుకున్న ఆదిమానవునికి ఆరోజున కోర్కె లేకపోయి ఉంటేనిప్పు పుట్టి ఉండేది కాదు. ఇది ఒక చిన్న దృష్టాంతం మాత్రమే. రైళ్ళనూ, విమానాన్ని కనుగొన్న పరిశోధకులను ముందుకు నడిపించింది కోరేె్కనన్న విషయం మరిచిపోరాదు. అయితే, కోర్కెలు మితంగా ఉండాలనీ, అవి ధర్మబద్ధంగా ఉండాలని భారతీయ ధర్మశాస్త్రాలు ఘోషిస్తు న్నాయి. సమస్యలు సృష్టించకుండా ఉండటమే ధర్మబద్ధమైన జీవనం అని నిర్వచించుకోవచ్చు.

అయితే, దేశ, కాల, పరిస్థితులను బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయని వాదించేవారు ఉన్నారు. ఎన్ని మార్పులు వచ్చినా మనిషి మౌలిక జీవన విధానంలో మార్పు రాదు, రాబోదు కూడా. దీనిని ఆధారం చేసుకునే భారతీయ సంస్కృతి ప్రాచుర్యంలోకి వచ్చింది. భారత దేశంలో ఉన్నంత ధార్మిక చింతన, ధర్మ పాలన మరి ఎక్కడా ఉండదు. పరిమితమైన కోర్కెలతో, పరిమితమైన కుటుంబంతో న్యాయబద్దమైన, ఆధ్యాత్మికతను జోడించిన జీవితాన్ని గడపాలన్నదే మన పెద్దల ప్రబోధాల సారాంశం. వారు ఆచరించి చూపిన ఈ మార్గాన్ని మనం కూడా పయనించి ఐహికఆముష్మికమైన ఫలాలను పొందుదాం.