Pages

Saturday, 31 August 2013

వేడిని తగ్గించే, రక్తాన్ని శుద్ధి చేసే "బత్తాయి"


* వేసవికాలం అంటే సాధారణంగా ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది పుచ్చకాయ, ఆ తరువాత బత్తాయిపండ్లే. వేసవితాపాన్ని తగ్గించి, శరీరానికి చల్లదనాన్ని ఇవ్వటమేగాకుండా, రక్తాన్ని శుద్ధిచేసే గుణాలు బత్తాయిలో మెండుగా ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ (రక్తపోటు)తో బాధపడేవారికి, గుండెజబ్బుతో ఇబ్బందిపడేవారికి బత్తాయి చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

* మలబద్ధకంతో బాధపడేవారికి బత్తా
యి ఔషధంగా పనిచేస్తుంది. బత్తాయి రసాన్ని ప్రతిరోజూ రాత్రివేళల్లో తీసుకున్నట్లయితే ఉదయాన్నే సులభంగా మలవిసర్జన జరుగుతుంది. బత్తాయి గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచి చేస్తుంది. పిండం ఎదిగేందుకు, సుఖ ప్రసవానికి బత్తాయి రసం ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు ఆ సమయంలో ఉండే అలసటన, అనారోగ్యాలను దూరం చేస్తుంది.

* వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించటమే గాకుండా.. ఒంట్లోని వేడిని బత్తాయి రసం తగ్గిస్తుంది. మూత్రనాళంలో మంటతో బాధపడేవారు బత్తాయి రసంలో గ్లూకోజ్ లేదా పంచదార కలుపుకుని తీసుకున్నట్లయితే మంట తగ్గటమేగాకుండా, మూత్రం సాఫీగా వస్తుంది.

* ఒక గ్లాసెడు బత్తాయి రసంలో కాస్తంత ఉప్ప, మిరియాలపొడి కలిపి తీసుకుంటే వేసవిలో అతి దప్పికను నివారిస్తుంది. కాగా.. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు, క్యాల్షియమ్, పొటాషియం, బియాటిన్, ఫోలిక్ యాసిడ్.. తదితర పోషక పదార్థాలు మెండుగా లభ్యమయ్యే బత్తాయిని ఏ వయసువారైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు.

దృష్టిమాంద్యాన్ని నివారించే "క్యారెట్లు"


* కంటి జబ్బులు, ముఖ్యంగా దృష్టి మాంద్యంతో బాధపడేవారికి "క్యారెట్లు" దివ్యౌషధంగా పనిచేస్తాయి. వయసు పెరిగేకొద్దీ చూపు మందగించటం సాధారణం. అయితే బీటా కెరోటిన్, జింక్, విటమిన్ ఏ, సీలు శరీరానికి అందినట్లయితే 60 సంవత్సరాలు దాటినా 35 శాతం మేరకు దృష్టిమాంద్యాన్ని నివారించవచ్చు. ఇందుకు క్యారెట్లు చక్కగా తోడ్పడతాయి.

* విటమిన్ ఏ పుష్కళంగా లభించే క్యారెట్లను ఆహారంగా 
తీసుకోవటంవల్ల థయామిన్, రిబోప్లేవిన్, నియాసిన్, విటమిన్ సి, జీలు కూడా శరీరానికి అందుతాయి. అంతేగాకుండా శరీరానికి ఉపయోగపడే పన్నెండు రకాల ఖనిజ లవణాలను క్యారెట్లు అందిస్తాయి. పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్‌లతోపాటు సల్ఫర్, భాస్వరం, క్లోరిన్ లాంటి ఖనిజాలు కూడా క్యారెట్లలో మెండుగా లభిస్తాయి.

* క్యారెట్లలో లభించే క్యాల్షియం చక్కటి సమతౌల్యాన్ని అందిస్తుంది. దీనివల్ల పళ్లకు, ఎముకలకు మంచి బలం కలగటమేగాకుండా, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కళ్లు, చర్మం, వెంట్రుకలు, పళ్లు.. ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే ప్రతిరోజూ ఆహారంలో క్యారెట్లు ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. క్యారెట్లలో ఉండే ఫైటో కెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యారెట్లలో ఉండే పీచు పదార్థం జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.

* క్యారెట్లలోని బీటా కెరోటిన్ విటమిన్ ఏ తయారీకి దోహదపడుతుంది. కంటిలోని రెటీనా పొరలో ఉండే "ఫొటోరెపెస్టార్స్" కాంతిని గ్రహించిన తరువాత అది తిరిగి పునరుత్తేజం పొందేందుకు విటమిన్ ఏ చాలా సహాయపడుతుంది. విటమిన్ ఏ లోపిస్తే రేచీకటి వస్తుంది. కళ్లు తరచుగా పొడిబారి దురదగా ఉంటాయి. కాబట్టి విటమిన్ ఏ లోపం రాకుండా ఉండేందుకు ఆహారంలో క్యారెట్లు తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తపడాలి.

నిమ్మరసాన్ని పెరుగులో కలిపి స్నానం చేయండి... మెరిసిపోతారు!!



నిమ్మకాయ పేరు చెప్పగానే నోట్లో నీళ్లు ఊరుతాయి కదూ! రుచికి పుల్లగా ఉన్నా ఇది మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదండోయ్. మన శరీరానికి ఒక రోజు మొత్తానికి కావాల్సిన సి-విటమిన్‌ను నిమ్మ అందిస్తుంది. నిమ్మ చేసే మేలు ఏమిటో కాస్త తెలుసుకుందామా...!!

నిమ్మరసాన్ని చెంచాలో తీసుకొని దానిలో కాసింత ఉప్పుని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.

అధిక బరువ
ుతో బాదపడేవాళ్లు పరగడుపున నిమ్మరసం, తేనె కలిపి అందులో కొద్దిగా నీళ్లు కలుపుకుని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తాగుతుంటే శరీరం బరువు తగ్గుముఖం పడుతుంది.

నిమ్మరసం తాగినా...నిమ్మతో చేసిన ఆహారపదార్థాలు తిన్నా...చాలాసేపటి వరకు ఆకలిగా అనిపించదు.

మీకీ విషయం తెలుసా.. నిరాహారదీక్ష విరమించేటప్పుడు కూడా నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తారు. ఎందుకంటే ఖాళీకడుపులో గ్యాస్‌ చేరుకుని ఒక్కసారిగా ఏదైనా ఆహారపదార్థం తిన్నా...వెంటనే వాంతి అయిపోతుంది. ఒక్క నిమ్మరసం మాత్రమే శరీరం హరాయించుకుంటుంది.

తల స్నానం చేసే ముందు నిమ్మరసం కలిపిన నీటితో స్నానంచేస్తే కురులు నల్లగా మెరుస్తాయి.

ముల్తానామట్టిలో నిమ్మరసాన్ని కలిపి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక కడిగిస్తే ముఖం నిగనిగలాడుతుంది.

నిమ్మరసానికి జిడ్డు తొలగించే స్వభావం ఎక్కువ కాబట్టి నిమ్మరసాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగితే ముఖంమీద జిడ్డు తొలగి ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది.

నిమ్మరసాన్ని పెరుగులో కలిపిన మిశ్రమాన్ని చర్మానికి పట్టించి స్నానం చేస్తే మేనిఛాయ పెరుగుతుంది.

కంటికింద ఉన్న నల్లటి వలయాలు తగ్గాలంటే దూదితో నిమ్మరసాన్ని అద్ది మునివేళ్లతో సున్నితంగా మర్ధనచేయాలి. వారం పాటు ఇలాచేస్తే కళ్లచుట్టూ కనిపించే నల్లని వలయాలు నెమ్మదిగా కనుమరుగవుతాయి.

ఎండబెట్టిన నిమ్మను మెత్తని పొడిగా చేసుకొని సున్నిపిండితో కలిపి స్నానం చేస్తే చర్మంమీది మృతకణాలన్నీ తొలగిపోతాయి.

"రోజుకో ఆపిల్ తింటే డాక్టరుకు దూరంగా ఉన్నట్టే"


ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్‌ (వ్యాధినిరోధక కారకం)గా పని చేస్తుంది. 100 గ్రాముల ఆపిల్ తింటే దాదాపు 1,500 మిల్లీగ్రాముల "విటమిన్ సి" ద్వారా పొందే యాంటీఆక్సిడెంట్‌ ప్రభావంతో సమానం.

ఆపిల్‌లో అధిక మొత్తంలో వ
ిటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో రక్తాన్ని మరింత పటిష్టం చేస్తాయి.

ఆపిల్‌లో మాలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి లివర్ (కాలేయం), జీర్ణక్రియలలో తలెత్తే సమస్యలను నివారిస్తాయి.

పానీయాలలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కిడ్నీ (మూత్ర పిండాలు)లలో రాళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది.
File
FILE

ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది.

ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

100 గ్రాముల ఆపిల్‌లో ఉండే పోషక విలువలు:
విటమిన్ ఏ : 900 I.U.
విటమిన్ బి : 0.07 mg.
విటమిన్ సి : 5 mg.
కాల్షియం : 6 mg.
ఐరమ్ : 3 mg.
ఫాస్పరస్ : 10 mg.
పొటాషియం : 130 mg.
కార్బోహైడ్రేట్స్ : 14.9 gm.
క్యాలరీలు : 58 Cal.

కర్పూరం... కొన్ని లాభాలు!!!



హోమియోపతి వైద్యవిధానం ప్రకారం కర్పూరం, ఇతర పరిమళ ద్రవ్యాలు పరిసర వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. హారతిని భక్తులు కళ్లకు అద్దుకున్నప్పుడు కర్పూరం సువాసనలు పీల్చడం వల్ల అది ఔషధంగా పనిచేస్తుంది. అవేంటో ఒకసారి చూద్దాం....

స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు
, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.

పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, గుండెకు సంబంధించిన పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు.

కర్పూరం సహజసిద్ధమైన ఉత్పత్తి అయినప్పటికీ అది విడుదల చేసే ఆవిర్లు విషపూరితమైనవి. మితిమీరి కర్పూరం వినియోగాన్ని అమెరికాలో నిషేధించారు. ఐతే కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో సువాసనకోసం కర్పూరాన్ని ఉపయోగిస్తున్నారు.

ఆస్త్మా, అలెర్జీలున్నవారు కర్పూరాన్ని వాడకూడదు. చిన్ని పిల్లల ముఖాలపై పొరపాటున కూడా ఉపయోగించరాదు.

మీరు పోషకాహారం తీసుకుంటున్నారా?


ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం, ఆహార పద్దతులు కూడా ఆరోగ్యకరంగానే ఉండాలి. బిజీ లైఫ్‌స్టైల్‌లో మనం ఏం తింటున్నామో.. ఎపుడు తింటున్నామో కూడా పట్టించుకోం. తినే ఆహారం పట్ల అశ్రద్ధగా ఉంటాం. ఏది పడితే అది తినడం మంచిది కాదు. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయి. న్యూట్రీషియస్ డైట్ ఫాలో అవుతూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మన బాధ్యత. అయితే, మీరు తీసుకునేది పోషకాహార
మేనా అనేది ముందుగా మీకు మీరు తెలుసుకోవాలి.

ఇందుకోసం కొన్ని సూచనలు పాటిస్తే చాలు. మీరు ప్రతి రోజూ ఏదో ఒక పండును తింటున్నారా. అల్పాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే, పని ఒత్తిడిని తట్టుకునేందుకు కాస్త రిలీఫ్ అయ్యేందుకు ఇష్టానుసారంగా కాఫీ టీలను తీసుకోరాదు. వేళాపాలా లేకుండా చిరుతిండ్లు తినకూడదు. వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి. మీరు ప్రతి రోజూ తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఉప్పు, కారం, నూనె వంటివి మీకు సరిపడా అంటే తక్కువ మోతాదులోనే తీసుకుంటున్నారా లేదా అన్నది తెలుసుకోవాలి. నీరసం, అజీర్తి, రక్తహీనత వంటి సమస్యలను ఎపుడూ ఎదుర్కొంటున్నట్టు గ్రహించారా.

ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తక్షణం వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలి. వీటిని క్రమం తప్పకుండా పాటించినట్టయితే మీరు పోషకాహారాన్ని తీసుకుంటున్నట్టు నిర్ధారించుకోవచ్చు.

రక్తపోటును నియంత్రించే పాలు, సోయా ప్రోటీన్లు..!


మీకు లో-బీపీ ఉందా? అయితే తప్పకుండా పాలు, సోయాను సమతుల్యంగా తీసుకోవడం మంచిదని ఓ అధ్యయనంలో తేలింది. కొవ్వు పదార్థాలు తక్కువగా గల పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా లో-బీపీకి చెక్ పెట్టవచ్చునని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రచురించిన కథనంలో రీసెర్చర్ జియాంగ్ తెలిపారు.

అలాగే హై-బీపీని కూడా పాల ఉత్పత్తులు నియంత్రిస్తాయని జియాంగ్ అన్నారు. పాల
ు, సోయాను తీసుకోవడం ద్వారా శరీరంలో కార్పొహైడ్రేడ్ల శాతాన్ని తగ్గించేందుకు వీలవుతుందని జియాంగ్ వెల్లడించారు.

పాలను తీసుకోవడం ద్వారా 2.3 మిల్లీమీటర్స్‌తో రక్తపోటును నియంత్రించే శక్తి లభిస్తుంది. కాగా, ఈ అధ్యయనంలో 352 మంది పెద్దలు పాల్గొన్నారు. ఇంకా ఈ సర్వేలో హై-బీపీని పాలు, సోయా తీసుకోవడం ద్వారా నియంత్రించవచ్చునని కనుగొన్నట్లు జియాంగ్ చెప్పారు. పాలు, సోయా తీసుకున్న వారిపై జరిపిన సర్వేల్లో హైబీపీ- మైల్డ్ బీపీ కేసులు తగ్గాయని తేలినట్లు ఆయన తెలిపారు.

రోజూ మూడు అరటి పండ్లు తీసుకుంటే గుండెపోటుకు చెక్!


రోజూ మూడు అరటి పండ్లను తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్ పెట్టవచ్చనని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటీష్-ఇటాలియన్ పరిశోధనకు నిర్వహించిన అధ్యయనంలో రోజూ వారీగా మూడు అరటిపండ్లు తీసుకునే వారిలో హృద్రోగ సమస్యలు చెక్ పెట్టవచ్చునని తేలింది.

రోజూ ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌కు మూడో అరటిపండును తీసుకునే వారిలో శ
రీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు.

కాగా, స్పానిష్, నట్స్, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే, మూడు అరటిపండ్లు రోజూవారీగా తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటు వంటి వాటిని చాలామటుకు తగ్గిపోతుందని వారు చెబుతున్నారు.

పొటాషియం అధికంగా గల ఆహారం తీసుకోవడం ద్వారా సంవత్సరానికి గుండెపోటుతో మరణించేవారి సంఖ్య అధికమవుతుందని వార్వింక్ యూనివర్శిటీ నిర్వహించిన స్టడీలో తేలింది. అయితే రోజూ మూడు అరటి పండ్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించి, గుండెపోటును నియంత్రించవచ్చునని ఆ పరిశోధనలో తేలింది.

పుచ్చకాయతో రక్తపోటుకు చెక్ పెట్టండి..!!



రక్తపోటు (హైబీపీ)ని తగ్గించడానికి, నివారించడానికి సాధారణ జాగ్రత్తలతో పాటు మరో రుచికరమైన మార్గం కూడా ఉంది. వేసవికాలంలో ఎక్కువగా దొరికే పుచ్చకాయను సాధారణ స్థాయికి మించి హైపర్‌టెన్షన్ కనిపిస్తున్న వారు ప్రతిరోజూ తింటే చాలా మంచిది.

దీనిలోని సిట్రులిన్ అనే పదార్థం మూసుకుపోతున్న రక్తనాళాలను తెరచి ఉంచేలా చేయగలదని అమెరికన్ సైంటిస్టుల పరిశోధనల్లో తేలిసింది. ఈ అధ్యయ
నంలో కొందరు రోగులకు ఆరు వారాలపాటు పుచ్చకాయ ఇచ్చారు. అదే సమయంలో కొందరికి దీన్ని ఇవ్వలేదు. అయితే పుచ్చకాయ తిననివారితో పోల్చితే దాన్ని తీసుకున్నవారి రక్తపోటు సాధారణంగా ఉన్నదని పరిశోధకులు వెల్లడించారు.

పుచ్చకాయలో బీటా కెరోటిన్ (శరీరంలోని ప్రవేశించాక ఇదే విటమిన్ ఏగా మారుతుంది), విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియంతో పాటు పీచు పదార్థాలు ఉంటాయి. ఈ పొటాషియం కూడా రక్తపోటును నియంత్రించే అంశాల్లో ఒకటి కాబట్టి పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

ఒత్తిడిని పెంచే సెల్‌ఫోన్..!!



మీ చేతిలో సెల్ ఉందా! అయితే మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లే! సెల్ ఉంటే ఎంజాయ్ చేస్తారు కానీ, ఒత్తిడేమిటా అనుకుంటున్నారా! ఇది నూటికి నూరుపాళ్లు ఒత్తిడే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఈ ఒత్తిడికి అనేక కారణాలు ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

* సెల్‌ఫోన్ వల్ల కాన్సన్‌ట్రేషన్ దెబ్బ తింటుంది. పని చేస్తున్నప్పుడు ఫోన్ రావడం వల్ల ఏకాగ్రత పోయి, ప్రొడక్టివిటీ రాదు. చ
ేసేపని సకాలంలో పూర్తిచేయలేకపోయామన్న బాధతో ఒత్తిడికి లోనవుతారు.

* ఏ పని చేస్తున్నా ఫోన్ మోగినట్లే ఫీలవుతుంటారు. బస్సులోగాని వేరే ఇతర వాహనాల్లో వెల్తున్నప్పుడు ఫోన్ మోగగానే వచ్చే రింగ్‌టోన్ విని ఎవరైనా టీజ్ చేస్తున్నారేమోనని భయానికి లోనవుతారు.

* ఎవరైనా తెలియని వ్యక్తులు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తూ వుంటే, ఫోన్‌ను స్విచాఫ్ చేయలేక, ఆన్‌లో ఉంచలేక ఒత్తిడి ఫీల్ అవుతారు.

* ఫోన్‌లోనే ఇంటర్నెట్ రావడం వల్ల చిన్న స్క్రీన్ మీదే ఫేస్ బుక్, చాటింగ్ చేస్తూ 24 గంటలూ అందరితో కనెక్టెడ్‌గా ఉండటానికి ప్రయత్నం చేయడం వల్ల ఒత్తిడి కలుగుతుంది.

* అదేపనిగా మోనిటర్ చూస్తుండటం వల్ల కంటి మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది.

* సెల్‌ఫోన్ వల్ల రహస్య సంభాషణలు జరుగుతున్నందున ఎవరైనా వింటారేమోననే ఒత్తిడికి లోనవుతారు.

* అదేపనిగా ఫోన్ మాట్లాడటం వల్ల రేడియేషన్ ప్రభావం శరీరం మీదే కాక మనసు మీద కూడా పడి ఒత్తిడికి దారితీస్తుంది.

ఆధునిక టెక్నాలజీని సాదరంగా ఆహ్వానించాలి. సెల్‌ఫోన్ అనేది జీవితంలో భాగంగా మారిపోయింది. అందుకే దానిని అవసరానికి మాత్రమే వినియోగించుకుంటూ, ఒత్తిడిలేని, ఆనందమయమైన జీవితాన్ని గడపటం మంచిది.

Thursday, 29 August 2013

పంచముఖాంజనేయస్వామి మహిమాన్విత గాథ

ఈస్వామి ఐదుముఖాలతో, పది భుజాలతో, పది ఆయుధాలను ధరించి దర్సనమిస్తుంటాడు. తూర్పున వానరముఖం, దక్షిణాన నారసింహ ముఖం, పశ్చిమాన గరుడముఖం, ఉత్తరాన వరాహముఖం, పైభాగంలో హయగ్రీవ వదనంతో ఈ స్వామి విలసిల్లుతుంటాడు. ప్రతి ముఖంలో త్రినేత్రుడై ప్రకాశిస్తుంటాడు. స్వామి పది చేతులలో 1.కత్తి, 2.ఢాలు, 3.పుస్తకం, 4.అమృత కలశం,5.అంకుశం 6.గిరి, 7.హలము, 8.కోడు, 9.సర్పము, 10.వృక్షము కనిపిస్తుంటాయి. ఈ ఆయుధాలన్నీ శత్రువుల గర్వాన్ని అణచి, జ్ఞానదీపాన్ని వెలిగించి, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసేవే. ఇది ఆంజనేయుని పరిపూర్ణరుద్రావతారం. ఈ అవతార మూర్తిని విభీషణుని కుమారుడైన నీలుడు లంకారాజ్యానికి యువరాజుగా పరిపాలన చేస్తున్న సమయం. అత్యంతబల సంపన్నుడైన నీలుడు సమస్త విద్యలలో పండితుడు. ధర్మాచరణంపట్ల అనురాక్తిగాలవాడు. సంపదలలో కుబేరునికి దీటైనవాడు. అయినప్పటికీ నీలునికి తృప్తి కలుగలేదు. అతని మనసులో ఇంకా ఐశ్వర్యాన్ని సేకరించాలన్న తపన, ఒకరోజు నీలుడు తండ్రి విభీషణునితో, “తండ్రీ! మనకు సంపదలకు, వైభావాలకు లోటు లేదు. కానీ, ఎంత ఉన్నప్పటికీ, మన దగ్గర చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు లేవు. అవి లేకపోవడం నా మనసెంతో వేదనకు గురవుతోంది. విష్ణుస్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తికి నువ్వు భక్తుడవు. నీకు ఆ మహనీయుడు ఆరాధ్యదైవం. అయినప్పటికీ, నువ్వు వాటిని సాధించాలేకపోయావు. వాటిని నువ్వెందుకు పొందలేకపోయావు? అయితే, నువ్వు నాకిప్పుడు అనుమతినిస్తే క్షణకాలంలో వాటిని సాధించి తీరుతాను. నన్ను ఆశీర్వదించు తండ్రీ!” అని పలికాడు.


కొడుకు మాటలు విన్న విభీషణుడు, “పుత్రా! రామభక్తిని మించిన సంపదలు మనకెందుకు? ఆ మహనీయుని అనుగ్రహం ఉంటే చాలు, అదే మనకు సర్వానందదాయకమైంది. దానిని మించిన సిరిసంపదలతో మనకేమి పని? అంతకు మించి పేరు పెన్నిధులు మనకెందుకు? చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు రామభక్తికి సరితూగేవి కావు. అందువల్లనే వాటి పట్ల నాకు అనురక్తి లేదు. వాటిపై నీకు అమిత ఇష్టం అయినట్లయితే, వాటిని నువ్వు సాధించుకో. అయితే ఒక విషయం, మన భూలోకవాసులం కనుక అవి మనకు సులువుగా లభించవు. వాటిని పొందాలంటే దైవశక్తిని సంపాదించాలి. దైవశక్తి కావాలంటే దేవతలను ఆరాధించాలి. అందుకై ముందుగా గురువులను ఆరాధించి, వారి ఆశీస్సులను పొందాల్సి ఉంటుంది. తద్వారా లోకోత్తరశక్తులను పొందగలిగితే, అటుపై నీ కోరిక నెరవేరుతుంది” అని హితవచనాలను పలికాడు.

తండ్రి ఆజ్ఞను శిరసావహించిన నీలుడు, తండ్రికి ప్రదక్షిణ నమస్కారాలను చేసి, కులదైవమైన శుక్రాచార్యుని ఆశ్రయించి పన్నెండు సంవత్సరాలు భక్తిప్రపత్తులతో సేవించి, గురువును ఆనందపరిచాడు. నీలుని మనసులోని కోరికను మన్నించిన శుక్రుడు, “నాయనా, నీలా! నీ కోరిక నెరవేరాలంటే, అందుకు తగిన పరమాద్భుతమైన మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రం శ్రీరామచంద్రుని పరమభక్తాగ్రేసరుడైన ఆంజనేయుని పరమ పవిత్ర మంత్రరాజము. దానికితోడు ఒక వ్రతం గురించి కూడ చెబుతానూ. ఆంజనేయుని అవతారాలలో పంచముఖ ఆనంజనేయుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, ఎంతటి అసాధ్యమైన పని అయినప్పటికీ సుసాధ్యమవుతుంది. అంటే, సాధించలేనిదంటూ ఏమీ ఉండదు" అని తెలిపి, దివ్యమైన హనుమ మంత్రాన్ని నీలునికి బోధించి, వ్రతం కూడ చేయించాడు. నీలుడు శుక్రుని ఘనంగా సత్కరించి, ధ్యాన నిమగ్నుడయ్యాడు.

కొంతకాలం తరువాత నీలుని ప్రార్థనకు సంతుష్టుడైన హనుమంతుడు, పంచాముఖాంజనేయ రూపంలో నీలునికి దర్శనమిచ్చాడు. నీలుని బహువిధాలుగా స్వామిని స్తుతించగా, నీలుని మనసెరిగిన ఆంజనేయుడు, “భక్తా, నీలా! నీ కోరిక త్వరలో నేరావేరుతుంది. నువ్వు నా పరమభక్తుడవు. నీ తండ్రి అత్యంత మిత్రుడు. ఆత్మబంధువుకంటే ఎక్కువ. ఆందుకే నువ్వు నాకు అత్యంతప్రీతి పాత్రుడవు. నువ్వుకోరుకున్న విధంగానే చింతామణి మొదలైన దివ్యసంపదలు నీకు సొంతమవుతాయి. వాతితొపాటు శీలసౌందర్యాది విశేషగుణ  నిధియైన వసుందరిని కూడ పొందగలవు. అందుకే ఈ పవిత్రక్షేత్రం నీ పేరుతో నీలాద్రిగా వ్యవహరింపబడుతుంది” అని నీలుని అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. తన కోరికలను సిద్ధింపజేసుకున్న నీలుడు గురువు శుక్రుడు, తల్లిదండ్రులకు మొక్కి, వారి ఆశీర్వాదాలను అందుకున్నాడు. అనంతరం దేవలోకంపై దండయాత్ర చేయ సంకల్పించిన నీలుడు, ఇంద్రుని వద్దకు దూతను పంపి తన ఉద్దేశ్యాన్ని వినిపింపజేసాడు. “ఓయీ ఇంద్రా! గతంలో మా పెద్దనాన్న కొడుకు చేతిలో పరాజితుడవై బందిపబడ్డావు. ఇప్పుడు విభీషణుని కుమారుడనైన నేను, నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను.  నాతో యుద్ధం చేసి పరాభింపబడతావా? లేక చింతామణి, కామధేనువు, కల్పతరువు మున్నగు సంపదలను ఇస్తావా? ఏది ఏమైనా, నువ్వు నాతో యుద్ధం చేయలేవు కనుక, ఆ దివ్యరత్నాలను నాకివ్వు, బ్రతికిపో. నీలుని సందేశాన్ని విన్న ఇంద్రుడు మండిపడ్డాడు. “ఎంతోమంది రాక్షసులను తుదముట్టించాను. ఈ నీలుడు నాతో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. నీలునికి నా వజ్రాయుధసామర్థ్యం తెలిసినట్లు లేదు. వందల, వేల కోట్లకొలది రాక్షసులను నా వజ్రాయుధం సంహరించింది. అదలావుంటే, నీలుడొకలెక్క?! అందుకే ఈ దూతను శిక్షించి, పరాభావించి పంపించండి" అని ఇంద్రుడు ఆజ్ఞాపించడంతో దేవతలు రాయబారిని పంపారు. రాయబారి నీలునికి ఈ ఉందంతాన్ని చెప్పగా, ఆగ్రహించిన నీలుడు దేవలోకంపై యుద్ధభేరిని మోగించాడు.

దేవతలకు, రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. కామరూప విద్య పాండిత్య ప్రవీణులైన దానవుల మాయోపాయాలకు దేవతలు ఎదురొడ్డి నిలువలేకపోయారు. ఇంద్రుడు రెట్టించిన పౌరుషంతో నీలుపైకి ఉరికి, “ఓయీ! నీలా! వాలి నా పుత్రుడు. అతడు నీ పెదనాన్న చంకలో పెట్టుకుని సప్త సాగరాలలో ముంచగా, ఎలాగో ప్రాణాలను దక్కించుకుని బ్రతికిన విషయం నీకు తెలియదా?!” అని ఇంద్రుడు చెబుతుండగా, నీలుడు మరింతగా రెచ్చిపోయి యుద్ధాన్ని చేయసాగాడు. నీలుడు ప్రయోగించిన అస్త్రాలను ఇంద్రుడు భగ్నం చేయగా, ఇంద్రుని వజ్రాయుధాన్ని నీలుడు ఒక్క బాణంతో అణిచి వేశాడు. ఇంద్రుడు అంకుశంతో విజృభించగా, నీలుడు దానిని గదాఘాతంతో ఖండించాడు. అనంతరం నీలుడు పదునైన కత్తిని చేతబూని ఇంద్రుని శిరస్సును ఖండించేందుకు ముందుకు ఉరకగా, అక్కడ ప్రత్యక్షమైన బ్రహ్మ నీలునితో, "ఓయీ నీలా! నీ తండ్రి రామభక్తుడు, రాముడంటే శ్రీమహావిష్ణువే. ఆ మహావిష్ణువుకు సోదరుడు. ఈ ఇంద్రుడు. అందువల్ల ఇతడు నీకు మిత్రుడేగానీ, శత్రువుకాదు. ఇతనితో తగవులాట వద్దు. ఇద్దరూ స్నేహితులుగా మసలండి. నీ కోరికను నేను నెరవేరుస్తాను. చింతామణి వంటి దివ్య వస్తువులన్నింటిని నేను అనుగ్రహిస్తాను. నీకు మరో విషయాన్ని చెబుతాను. శ్రద్ధగా విను.

పూర్వం అత్రిమహాముని హిమాలయ పర్వత సానువుల్లో సంచరిస్తుండగా, ఆ మహనీయుని నేత్రాల నుండి దివ్యతేజస్సు వెలువడింది. ఆ తేజస్సు, అందులోని వృక్షాలతో కూడి పలురీతులుగా వ్యాపించింది. వాయుదేవుడు ఆ దివ్యతేజాన్ని రెండు రాశువులుగా విభజించగా, అందులో నుంచి సౌందర్యనిధియగు చంద్రుడు ఉద్భవించాడు. రెండవ రాశి నుంచి త్రిభువన సుందరియైన వనసుందరి జనించింది. ఆ సౌందర్యవతి మధువుతో పెంచబడింది. అమృతస్వరూపిణి కాబట్టి దివ్యమణులతో పాటుగా కన్యామణి కూడ గ్రహించి సుఖించు. నువ్వు పంచముఖ ఆంజనేయుని ఆరాధించనందువల్ల మాకు కూడ గౌరవ పాత్రుడవయ్యావు అని చెప్పాడు.  బ్రహ్మ ఇలా చెప్పడమే కాక, మహత్తర శక్తి సంయుతమైన హనుమద్ర్వతాన్ని ఉపదేశించాడు. ఇంద్రునిచే చింతామణి మొదలైన దివ్యమైన వస్తుసంపదల తోడుగా సౌందర్యరాశియైన వనసుందరిని కూడ అర్పింపజేసాడు. ఆవిధంగా హనుమదనుగ్రహం వలన ప్రాప్తించిన సంపదలతో నీలుడు హనుమద్భక్తులలో అగ్రగణ్యునిగా వెలుగొందాడు. నీలునికి హనుమంతుడు మాఘమాసం ఆర్ధ్ర నక్షత్రంతో కూడిన దినంలో ప్రత్యక్షమయ్యాడు. అలాగే లంకలో సీతాదేవికి పంచాముఖాంజనేయ రూపాన్ని స్వామి ప్రదర్శించినట్లు మనకు తెలుస్తోంది. రావణవధ జరిగిన అనంతరం, లోకాలకు దుష్టరాక్షసపీడ విరగడైందని శ్రీరామచంద్రుడు తృప్తిపడుతున్న సమయంలో ఆకాశవాణి ఈ తీరుగా పలికింది. “శ్రీరామచంద్రా! రావణసంహారం జరిగిందని నువ్వు తృప్తి పడుతున్నావు. అంతటితో నీ కర్తవ్యం ముగియలేదు. గగనతలాన వేలవేల యోజనాల దూరంలో శతకంఠుడనే రాక్షసుడు తిరుగూన్నాడు. కడు దుష్టుడైన ఆ రాక్షసుడు, మహాబలశాలి. ఎవరినైనా ఎదిరించి నిలువగల అసాధ్యుడు. నువ్వు వాడిని కూడ సంహరించితేనే నీ అవతారానికి పూర్ణత్వము సిద్ధించినట్లవుతుంది”. ఆకాశవాణి పలుకులను విన్న రాముడు దీర్ఘాలోచనలో పడి, చివరకు ఆ రాక్షస సంహారానికి అంజనేయుడే తగినవాడని నిర్ణయించి, హనుమను పిలిచి, “హనుమా! ఆకాశవాణి పలుకులను విన్నావు కదా! రావణ సంహార విషయంలో నీవెంతో సాయపడ్డావు. శతకంఠుని సంహార విషయం గురించి కాస్త ఆలోచించు, ఇందుకు నువ్వు సమర్థుడవు" అని ప్రేరేపించాడు.

శ్రీరామ ఆజ్ఞను తలదాల్చిన ఆంజనేయుడు శతకంఠుని సంహరించే కార్యక్రమానికి ఉపక్రమించాడు. వెంటనే తన తోకను వేయి యోజనాల దూరానికి పెంచాడు. తన రూపాన్ని విపరీతంగా పెంచడంతో, సముద్రాలన్నీ కప్పి వేయబడి, భువి నుంచి దివికి దారి ఏర్పడటమేకాక, ఆకాశంలో నక్షత్రాలన్నీ హనుమంతుని శరీరంపై, దర్భలపై నీటిబిందువుల్లా గోచరించాయి. అప్పుడు ఆంజనేయునికి అంతరీక్షంలోగల శతకంఠుని నగరం కనబడింది. దాని ప్రాకారాలు భగభగమని మండే అగ్నిగోళాలవలె ఉన్నప్పటికీ, వాయునందనుడు దానిని పెకలించి సముద్రంలోకి విసిరేసాడు. శ్రీరామచంద్రుని సైన్యమంతా తన తోకపై నడిచేత్లు చేసి అంతరిక్షపురానికి చేరుకునేట్లు చేసాడు. అలా అందరూ శతకంఠుని నగరానికి చేరుకున్నారు. అప్పుడు శ్రీరామునికి, శతకంఠునికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో ఆ రాక్షసుని తలలను ఖంఢిస్తున్నప్పటికి, ఆ తలలు తిరిగి జనించసాగాయి. అప్పుడు ఆ రాక్షసుని రక్తపుబొట్లు నేలపై పడుతుండగా, వాటి నుంచి లెక్కకు మిక్కిలిగా శతకంఠులు ఉద్భవించసాగారు. వాతితో పోరాడిన శ్రీరాముడు విసికి వేసారిపోయాడు. ఆయన పరివారం నీరసించింది. అనేకులు మూర్చిల్లారు. అప్పుడు శ్రీరాముని చూసిన సీత భయపడింది. మార్గానంతరం తెలియక చింతించసాగింది.

సరిగ్గా అక్కడకు గర్గముని వచ్చాడు. ఆయన సీతను చూసి, హనుమంతుని ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి భయాన్ని పోగొట్టాడు. సీతాదేవి ఆ మంత్రాన్ని నిష్టతో జపించగా, హనుమంతుడు శక్తియుక్తులతో పరిపూర్ణుడై విజృభించాడు. ఆంజనేయస్వామి పంచముఖం మూర్తియై వెలుగొందుతూ రాక్ష్సుని మాయాశక్తులను వీక్షిస్తూ, అతని కదలికలన్నింటిని అరికట్టేడు. ఆయన ప్రతి వదనంలో మూడేసి కళ్ళున్నాయి. దశ భుజాలలో దశ విధ ఆయుధాలను ధరించి ప్రళయకాల రుద్రుడై విహరించాడు. శతకంఠుడు పలువిధాలైన రూపాలను ధరించగా, ఆంజనేయుడు కూడ అన్ని రూపాలను ధరించాడు. సీతామాతను కూడ యుద్ధం చేయాల్సిందిగా ప్రార్థించాడు. ఆంజనేయుని అభ్యర్థనను విన్న సీతాదేవి పతిదేవుని తలచుకుని శక్తి స్వరూపిణియై, శక్తివంతమైన అస్త్రాన్ని సంధించింది. శతకంఠుడు స్త్రీ చేతిలో మరణించాల్సి ఉన్నందున, సీత వదిలిన దివ్యాస్త్ర ప్రభావానికి నేలకొరిగాడు. ఇదే పంచముఖాంజనేయస్వామి మహిమాన్విత గాథ.

అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్ష్యకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం’


తీర్థం

మనం ఆలయానికి స్వామి దర్శనానికై వెళ్లినప్పుడు, పురోహితులు అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్ష్యకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం’  అనే మంత్రాన్ని చదువుతూ తీర్థాన్ని ఇస్తుంటారు. రాకూడని కాలంలో మృత్యువుతో సమానమైన బాధ రాకుండా ఉండేందుకై, సమస్త వ్యాదుల నివారణకు, సమస్త పాపాలనుండి బయట పడటానికి, పరమేశ్వరుని పాదోదకాన్ని స్వీకరిస్తున్నానని అర్థం. స్వామికి పంచామృతాలతో స్నానాన్ని చేయించగా వచ్చిన తీర్థం కాబట్టి, ఓ విధమైన ఔషధ శక్తిని పొందిన దీనిని నీరు అని పిలువకుండా ‘తీర్థం’ అని అన్నారు. ఈ తీర్థంలో పవిత్ర మంత్ర శక్తి ఉంటుంది. అది మనకు శుభం కలిగిస్తుంది.