ఆహారం లేకపోయినా మానవుడు మనుగడ సాధించగలడు. కానీ కనీస నిద్ర లేకపోతే జీవించలేడు. అంతేకాదు మేధస్సు మందగిస్తుంది. అందానికి ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. కనుక నిద్ర అనేది తప్పని సరిగ్గా ఉండాలి.
* ముఖ్యంగా రోజుకు కనీసం ఆరు గంటల సమయం నిద్ర తప్పని సరిగ్గా ఉండాలి.
* మారేడు కషాయం రెండు - మూడు స్పూన్ల చొప్పున రోజుకు నాలుగు సార్లు తీసుకుంటే మంచినిద్ర వస్తుంది.
*
ఆపిల్, జామ, బంగాళదుంప, తోటకూర, క్యారెట్ రసాలను ప్రతిరోజు సాయంత్రం తీసుకుంటే నిద్ర పట్టని వారికి కూడా నిద్ర పడుతుంది.
* నిద్రలేమితో బాధపడేవారు బెడ్ మీద పడుకునే ముందు కొన్ని నిముషాల వరకూ మౌనంగా వుండి, గాఢమైన ఒక శ్వాసను పీల్చి, ఒకటి రెండు సెకండ్ల పాటు బిగపట్టి వదిలేయండి. నెమ్మదిగా ఈ పద్దతిని కొన్నిసార్లు రిపీట్ చేస్తే మనసులో ఒక విధమైన ప్రశాంతత కలిగి క్రమంగా నిద్ర వస్తుంది.
* రాత్రిపూట కడుపు నిండుగా ఆహారం తీసుకున్నట్లైతే నిద్ర బాగా పడుతుంది.