Pages

Tuesday, 20 August 2013

విష కీటకాలు కుడితే...



1.తేలు లాంటి విష కీటకాలు కుట్టినప్పుడు ఆందోళనకు గురికాకూడదు. మనం ఆందోళనకు గురైన కొద్దీ విషం రక్తప్రవాహంలోకి మరింత పాకే అవకాశాలు ఎక్కువ. 

2.విష కీటకం కుట్టిన చోట సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి. 

3.ఐస్ గడ్డలను ఒక గుడ్డలో చుట్టి కాపడం పెట్టినట్లు ప్రతి పది నిమిషాలకు ఒకసారి కుట్టిన చోట అద్దాలి. కీటకం కుట్టిన మొదటి రెండు గంటల్లో ఇలా చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల కుట్టిన చోట ఉపశమనం కలగడంతో పాటు, విషం పైకి వేగంగా పాకకుండా ఉంటుంది. 

4.కుట్టిన ప్రదేశాన్ని కదలకుండా చూడాలి. ఆ అవయవాన్ని గుండె కంటే తక్కువ ఎత్తులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఉదాహరణకు కాలిపై తేలు కుడితే, కాలిని తలగడపై ఉంచకూడదన్నమాట. 

5.ఏదైనా కీటకం కుట్టినప్పుడు... కుట్టిన ప్రదేశానికి పైన ఒక కట్టు కట్టాలి. విషం పైకి పాకడం అనే ప్రక్రియ నెమ్మదిగా జరగడం కోసమే ఈ కట్టు అని గుర్తుంచుకోవాలి. అయితే ఆ కట్టు రక్తప్రవాహాన్ని, లింఫ్ ప్రవాహాన్ని అడ్డుకునేంత గట్టిగా ఉండకూడదని గుర్తుంచుకోవాలి.