Pages

Tuesday, 20 August 2013

విరేచనాలు అవుతూ ఉంటే...........









సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసిన పదార్థాలే తీసుకోవాలి. 


పయాణాల్లో సురక్షితమైన, నమ్మకమైన చోట మాత్రమే ఆహారం తీసుకోవాలి. 

ఆహారం తినడానికి ముందుగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. 
విరేచనాలు అవుతున్నవారు ద్రవాలు కోల్పోకుండా ఓరల్ రీ-హైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్‌ఎస్) తీసుకోవాలి. వేడి చేసి చల్లార్చిన లీటరు నీళ్లలో రెండు చెంచాల చక్కెర, చెంచా ఉప్పుతో ఓఆర్‌ఎస్ ద్రవాన్ని తయారు చేసుకుని గంట గంటకూ తీసుకోవాలి లేదా ఒక ఎలక్ట్రాల్ పౌడరు ప్యాకెట్టును ఒక లీటరు నీటిలో కలపడం ద్వారా కూడా ఈ ఓఆర్‌ఎస్ ద్రవాన్ని తయారు చేసుకోవచ్చు. 

ఆగకుండా విరేచనాలు అవుతూ ఉంటే తక్షణం సెలైన్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.