Pages

Friday, 9 August 2013

నల్లటి మచ్చలు నివారణకు చిట్కాలు

వయసు రిత్యా వచ్చే మచ్చలు శరీర సౌందర్యాన్ని అందవిహీనంగా మార్చేస్తాయి . మచ్చలు అనేవి వయసు రిత్య వచ్చేవే కాకపోవచ్చు . కొన్ని సందర్భాలలో సూర్య రశ్మి కారణంగా కూడా మచ్చలు రావచ్చు .వీటిని పోగొట్టుకోవడానికి సౌందర్య సాధనాలు ఉపయోగించడం కన్నా , కొబ్బరి నూనె ఉపయోగించడం ద్వారా వీటిని పూర్తిగా పోగొట్టుకోవచ్చు .
టీనేజీ వయస్సులో ఉన్న వారికి ఇవి వచ్చిన చాలా సార్లు వెంటనే పోతాయి .కనీ వయస్సు మళ్ళినవారిలో మాత్రమే ఈ మచ్చలు శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం ఉంది అని నిపుణులు అంటున్నారు . వీటిని పోగొట్టుకోవడానికి కొబ్బరి నూనె మందుగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు . కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలి ? అన్న వివరాలు …..


ముందు మచ్చలు ఉన్న భాగాన్ని శుభ్రంగా సబ్బు లేదా ఏదైనా బాడీలోషన్ పెట్టి శుభ్రపరుచుకోవాలి .అనంతరం తడి లేకుండా తుడుచుకోవాలి .
అరచేతిలో టేబుల్ స్పూను కొబ్బరి నూనె తీసుకొని మచ్చలు ఉన్న ప్రాంతంలో తేలికగా మసాజ్ చేయాలి . గట్టిగా రుద్దడం చేయకూడదు . నూనె వలన చర్మం ఎర్రగా మారే అవకాశం ఉంది .
సూర్యరశ్మి కారణంగా మచ్చలు ఏర్పడినా వెంటనే ఈ విధంగా చేయడం మంచిది , మచ్చలు కనిపించిన వెంటనే చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు .
స్నానానికి ముందు కొబ్బరి నూనెను శరీరమంతా అప్లయ్ చేసి సున్నితంగా మర్దనా చేసుకొని అనంతరం అనంతరం గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి . ఈ విధంగా కొన్ని నెలల పాటు చేసినట్టయితే  మచ్చలు పోయి చర్మం మరింత మెరుస్తూ ఉంటుంది .