ఆటల్లో అరటిపండు అంటూ దాన్ని తేలిగ్గా తీసుకుంటాం
కానీ , బ్యుటీషియన్లు మాత్రం దాన్ని అంత తేలిగ్గా
తీసిపారేయడం లేదు . ముఖ సౌందర్యాన్ని , చర్మ
ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అరటిపండు ఓ మంచి
సాధనమని నిపుణులు చెబుతున్నారు . అరటిపండుతో
సౌందర్య పరిరక్షణ ఎలాగో చూద్దాం…
బాగా మిగల మగ్గిన అరటిపండును గుజ్జుగా చేసి అందులో రెండు స్పూన్లు గట్టి పెరుగు లేదా ఓట్స్ పొడి
వేసి బాగా కలిపి . ముఖం , మెడకు పట్టించి బాగా ఎండిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి
. ఈ చిట్కా వలన ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది .
bananaఅరటిపండు గుజ్జులో స్పూను తేనె , లేదా స్పూను పచ్చి పాలు వేసి కలిపి ముఖానికి పట్టించి
బాగా ఆరనివ్వాలి . అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి . ఈ విధంగా 20 నుండి
25 రోజుల పాటు చేసినట్టయితే ముఖం మిలమిల మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది .
పొడి చర్మం వారు ఈ విధంగా చేయాలి . అరటిపండు గుజ్జులో గుడ్డు లోని తెల్ల సోన , ఒక టేబుల్ స్పూన్
క్రీమ్ జత చేసి బాగా కలిపి ముఖం , మెడకు పట్టించి ఆరనివ్వాలి . అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం
చేసుకోవాలి . ఈ విధంగా వారంలో కనీసం మూడు సార్లు చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు .
అరటిపండు గుజ్జులో టేబుల్ స్పూను నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరనిచ్చి అనంతరం
గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి .
ముఖం మీద మచ్చలతో భాదపడే వారు ఈ విధంగా చేసి చుడండి . అరటి పండు తొక్కతో మచ్చలున్న
ప్రదేశంలో సున్నితంగా రుద్ది ఓ పావు గంట సేపు ఆరనివ్వాలి . అనంతరం ముఖాని శుభ్రంగా కడుక్కోవాలి
.రోజు మొత్తం మీద వీలయినన్ని సార్లు ఈ విధంగా చేసినట్టయితే మచ్చలు క్రమేపీ మాయం అవుతాయి .
పళ్ళు పసుపు పచ్చగా మారుతుంటే ఈ విధంగా చేసి చూడండి . అరటి తొక్కతో పళ్ళ మీద బాగా రుద్దాలి
.రోజులో కనీసం రెండు సార్లు ఈ విధంగా చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొదవచ్చు.