Pages

Friday, 2 August 2013

కీళ్లనొప్పులు తగ్గే మార్గం లేదా? నొప్పి నివారణ మాత్రలు రోజూ మింగాల్సిందేనా? కీళ్లనొప్పులు తగ్గే మార్గం లేదా?



















 ఈ ప్రశ్నలు చాలా మందిలో ఉదయిస్తుంటాయి. నిజమే 
ఇతర వైద్య విధానాల్లో ఈ సమస్యకు తాత్కాలిక 
ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపించే 
వైద్యం లేదు. కానీ హోమియో చికిత్సతో కీళ్లనొప్పులకు 
శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు హోమియో వైద్యనిపుణులు


మారిన జీవనవిధానం, వ్యాయామం కొరవడటం, గంటల కొద్దీ కూర్చుని చేసే ఉద్యోగాల మూలంగా స్థూలకాయం పెరిగిపోతుంది. ఫలితంగా కీళ్లపై భారం పడి కీళ్లనొప్పులు వచ్చిపడుతున్నాయి. కీళ్లనొప్పులను ఆర్థరైటిస్ అని అంటారు. కీళ్లు గట్టిపడటం, కీళ్ల వాపుతోపాటు నొప్పి ఏర్పడటాన్ని ఆర్థరైటిస్‌గా పేర్కొంటాం. ఆర్థరైటిస్‌లో వంద రకాల సమస్యలున్నాయి. రెండు ఎముకలు కలిపే భాగాన్ని కీలు లేదా జాయింట్ అంటారు. మన శరీరంలో 200 దాకా కీళ్లు ఉంటాయి. మోకాలు, తుంటి, చీలమండ, చేతివేళ్లు, కాలివేళ్ల వద్ద జాయింట్లు ఉంటాయి. కీళ్లనొప్పి సమస్య చాలా మందిని దీర్ఘకాలం పాటు వేధిస్తుంది. వయసును బట్టి, కారణాలను బట్టి శరీరంలోని వివిధ ప్రాంతాలు ఆర్థరైటిస్‌కు గురవుతుంటాయి.

అస్టియో ఆర్థరైటిస్
ఎక్కువ మందిని బాధ పెట్టే సమస్య ఇది. వయసు పెరుగుతున్న కొద్దీ జాయింట్లలో ఉన్న కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కీళ్లు అరిగిపోవడం వల్ల వచ్చే వ్యాధిని డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటారు. ఎముకల చివరన ఉన్న కార్టిలేజ్ బాగా అరిగిపోయి, ఎముకలు రెండూ ఒకదానికి ఒకటి రాసుకుపోయి ఆ భాగాన నొప్పి, వాపు వంటివి కనిపిస్తాయి. ఈ వ్యాధి మోకాళ్లలో కనిపిస్తుంది. ఈ సమస్య 40 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఎక్కువ శాతం
కనిపిస్తుంది. ఈ వ్యాధి వంశపారంపర్యంగా కూడా వస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి ఉంటే వారి పిల్లలకు వచ్చే అవకాశం 50 శాతం ఉంటుంది. అదే తల్లిదండ్రులిద్దరికీ ఉన్నట్లయితే 100 శాతం ఈ వ్యాధి వస్తుంది. తల్లిదండ్రులకు 50 ఏళ్లకు ఈ వ్యాధి వస్తే వారి పిల్లలకు ఇంకా తక్కువ వయసులో వ్యాధి వచ్చే అవకాశముంది. వృత్తిరీత్యా ఎక్కువ సేపు నిలబడటం, ఎక్కువగా కూర్చొవడం, క్రీడల్లో పాల్గొనే వారిలో ఇలాంటి సమస్య త్వరగా వచ్చే అవకాశముంది.

లక్షణాలు
తీవ్రమైన కీళ్లనొప్పితోపాటు జ్వరం వస్తుంటుంది. మొదట కూర్చొని, లేచేటపుడు జాయింట్లు పట్టినట్లుగా ఉండి తీవ్ర నొప్పిని కలగజేస్తుంది. జాయింట్లలో టకటకమనే శబ్ధం వస్తుంది. కింద కూర్చొవడం చాలా కష్టంగా మారుతుంది. మెట్లు ఎక్కడం ఇబ్బందిగా ఉంటుంది. అధిక బరువు, స్త్రీలలో రుతుస్రావం ఆగిపోయిన తర్వాత, వయసు మళ్లిన వారిలో, చిన్న వయసులో గర్భాశయం తొలగించిన వారిలో హార్మోన్ల అసమతుల్యత, అదే పనిగా జాయింట్లలో ఒత్తిడి కలిగించినపుడు, వంశపారంపర్యంగా, సొరియాసిస్, థైరాయిడ్ లాంటి వ్యాధుల ప్రభావం వల్ల జాయింట్ల పైన ఒత్తిడి పెరిగి నొప్పి, వాపు, జ్వరంతో బాధపడుతారు.

రుమటాయిడ్ ఆర్థరైటిస్
ఈ వ్యాధి శరీరంలోని అన్ని రకాల కీళ్లపై ప్రభావం చూపిస్తుంది. దీన్ని ఆటో ఇమ్యూనో డిజార్డర్‌గా గుర్తిస్తారు. ఈ సమస్య పురుషుల్లో కన్నా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి చలికాలంలో తీవ్రమైన బాధకు గురిచేస్తుంది. ఈ వ్యాధి శరీరంలో చేతివేళ్లకు, మోకాళ్లకు, మణికట్టు కీలుకు, కాలివేళ్లకు ఎక్కువగా వ్యాపిస్తుంది.

లక్షణాలు
ఉదయం పూట నొప్పి ఎక్కువగా ఉండి కదలలేని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. నిరంతరం శరీరం వేడిగా ఉండి జ్వరం వచ్చినట్లుగా ఉంటుంది. ఈ వ్యాధి వచ్చినపుడు జ్వరం రావడం, వ్యక్తి కదలలేక పోవడం సంభవిస్తుంది. ఆకలి తగ్గుతుంది. మూత్రవిసర్జన అధికంగా ఉంటుంది. మానసికంగా రోగి కుంగిపోతాడు. కీళ్ల ప్రాంతంలో 'నొడ్యుల్స్' అనబడే బొడిపెల వంటి ఎముకల ఉబ్బెత్తులు ఏర్పడతాయి. ఈ ముఖ్య లక్షణం ఆధారంగా కూడా రుమటాయిడడ్ ఆర్థరైటిస్‌గా గుర్తించాలి.

జాగ్రత్తలు
కాల్షియం అధికంగా ఉండే పదార్థాలు అనగా పాలు, పెరుగు, కోడిగుడ్లు, కీర, బొప్పాయి, ఆకుకూరలు తీసుకోవాలి. మసాలా వస్తువులు తగ్గించాలి. స్థూలకాయం ఉన్న వారు బరువును తగ్గించుకోవాలి. నిద్రించేటప్పుడు రెండు కాళ్ల కింద మెత్తటి దిండు పెట్టుకోవాలి. ఎక్కువ సేపు కింద కూర్చోవడం చేయకూడదు.

వ్యాధి నిర్ధారణ
ఎక్స్‌రే జాయింట్స్, ఎంఆర్ఐ, సినోరియల్ ఫ్లూయిడ్ ఎగ్జామినేషన్, రుమటాయిడ్ ఫ్యాక్టర్, సీఆర్‌పీ, ఈఎస్ఆర్ లాంటి పరీక్షలతో వ్యాధిని నిర్ధారించవచ్చు. వ్యాధి తీవ్రత కూడా గుర్తించవచ్చు.

హోమియో చికిత్స
ఆస్టియో ఆర్థరైటిస్‌కు బ్రయోనియా, రస్టాక్స్, కాల్కేరియా ఫ్లోర్, కాల్కేరియా ఫాస్, కల్మియా తదితర హోమియో మందులు బాగా పనిచేస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు లీడుంపాస్, రస్టాక్స్, యూపర్‌టోనియం, పర్ఫరేటమ్, బెలీస్‌పర్, బెల్లడోనా మందులను నిపుణులైన హోమియోపతి వైద్యుల పర్యవేక్షణలో వాడితే కీళ్లనొప్పులు తగ్గుతాయి. హోమియో మందులతో ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. వ్యాధి మళ్లీ తిరగబెట్టే అవకాశంకూడా తగ్గిపోతుంది. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే కీళ్లనొప్పుల నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది.