Pages

Friday, 2 August 2013

నిద్రలేమి సమస్యకు అశ్రద్ధ తగదు(Poor sleep)


ఆదునిక యుగంలో చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య నిద్రలేమి. దీనినే వైద్య పరిభాషలో ‘ఇన్‌సోమ్నియా’ అంటారు. ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది గాని ఈ సమస్యను అనుభవించేవారి బాధ ఇంతా అంతా కాదు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా, లోలోన మదనపడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుకుంటే ఈ సమస్యనుండి విముక్తి పొందవచ్చు.

కారణాలు
  • మానసిక ఆందోళన ఎక్కువగా ఉండటం, సరైన ఆహారం తీసుకోకపోవటం.
  • దాంపత్య జీవితం సరిగా లేకపోవడం, నెగెటివ్ ఆలోచనలు పెరిగిపోవటం.
  • అసహజ వాంఛలు, దీర్ఘకాలిక వ్యాధులు. ఆత్మన్యూనత భావన, పర్సనాలిటీ వ్యాధులు.
  • అనుమానాలు, జన్యుపరమైన కారణాలు, శారీరక సమస్యలు మొదలైన అనేక అంశాలు నిద్రలేమి సమస్యకు కారణమవుతున్నాయి

లక్షణాలు
  • వీరు నిద్రకు ఉపక్రమించిన తరువాత కొంతసేపటికే నిద్ర నుండి మేల్కొని మరలా ఎంత ప్రయత్నంచేసినా నిద్ర
    పట్టకపోవడం.
  • తలనొప్పి, చిరాకు, ద్వేషం, కోపం ఎక్కువగా ఉంటాయి.
  • ఏ పనిపై శ్రద్ధ పెట్టకపోవడం, పనులను వాయిదా వేయటం.
  • ఏకాగ్రత లోపించటం, ఆకలి తగ్గిపోవటం, చదువుపై శ్రద్ధ తగ్గడం.
  • నీరసంగా ఉండటం, తమలో తామే బాధ పడటం వంటి లక్షణాలతో ఉంటారు.

జాగ్రత్తలు
  • మొదటగా మానసిక ఒత్తిడి నివారణకు యోగా, మెడిటేషన్, ప్రాణాయామము నిత్యం చేయాలి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత కలిగి నిద్రలేమి తీవ్రత తగ్గుతుంది.
  • పడుకోవడానికి 2 గంటల ముందుగానే మంచి ఆహారం తీసుకోవాలి.
  • ఫాస్ట్ ఫుడ్స్, మసాలా పదార్థాలు, వేపుళ్లకు స్వస్తిపలికి పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి.
  • ఆకుకూరలకు, వెజిటబుల్స్, తాజా పండ్లు తీసుకోవటానికి ఎక్కువ ప్రధాన్యత ఇవ్వాలి.
  • వేళకు ఆహారం తీసుకుంటూ, సమయానికి నిద్రపోతూ ఉండాలి.
  • ప్రతిరోజూ వేకువ జామున లేచి 45 నిముషాలు నడవటం అలవాటు చేసుకోవాలి. తద్వారా రక్తప్రసరణ సక్రమంగా జరిగి మనసు ఉత్తేజపూరితంగా ఉంటుంది.
  • నిద్రలేమితో బాధపడేవారు తమ చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
  • అంతర్మథనాలకు దూరంగా ఉండడం, భావోద్వేగాలను, ఆలోచనలను, అభిప్రాయాలను అణిచిపెట్టకుండా ఎప్పటికప్పుడు ఆత్మీయులతో పంచుకోవడం వంటివి చేస్తే నిద్రలేమి నుండి తొందరగా బయటపడవచ్చు.

చికిత్స
నిద్రలేమే కదా అని వైద్యం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తాయ. హోమియో వైద్యంలో నిద్రలేమికి మంచి చికిత్స కలదు. ఈ వైద్య విధానంలో మందును ఎన్నుకునే ముందు వ్యక్తి యొక్క మానసిక లక్షణాలను, శారీరక లక్షణాలను, అలవాట్లను పరిగణనలోకి తీసుకొని మందును ఎన్నుకోవడం జరుగుతుంది. కావున నిద్రలేమి సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

మందులు:
నక్స్‌వామికా: వీరికి ఉదయం సాయంత్రం నిద్ర ఎక్కువగా వస్తుంది. వీరు నిద్రకు ఉపక్రమించిన తరువాత కొంతసేపటికే నిద్ర నుండి మేల్కొంటారు. భయంకరమైన కలలతో నిద్రనుండి మేల్కొని మరలా ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టదు. మసాలాలు, ఫాస్ట్ఫుడ్స్, కాఫీలు ఎక్కువగా సేవించడం, శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక శ్రమ ఎక్కువగా ఉన్నవారికి ఈ మందు ఆలోచించదగినది. మానసిక స్థాయిలో వీరికి కోపం ఎక్కువ. శబ్దాలు, వెలుతురు భరించలేరు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.

బెల్లడోనా: వీరికి సుఖ నిద్ర ఉండదు. నిద్రలో భయంకరమైన ఆకారాలు అగుపడును నిద్రలోమాట్లాడటం చేస్తుంటారు. చిన్న పిల్లల్లో నిద్రాభంగముచే లేచి ఏడుస్తుంటారు. కీళ్లనొప్పులచే నిద్రపట్టక బాపడేవారికి ఈమందు బాగా పనిచేస్తుంది.

కాఫియా క్రూడా:శరీరము మెదడు ఎక్కువగా ఉద్రేకం చెందడం మూలాన నిద్ర రాకుండుట. ఇటువంటి లక్షణం ఉన్నప్పుడు ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
ఇగ్నీషియా: దుఃఖభారంతో కుంగిపోయినపుడు నిద్ర పట్టక, వేదనపడుతున్న సందర్భాల్లో ఈ మందు బాగా పనిచేస్తుంది.

జెల్సిమియం: మానసిక శ్రమ ఎక్కువగా ఉండటం వలన నిద్రపట్టనివారికి ఈ మందు ముఖ్యమైనది. అలాగే ఏ పనిపై శ్రద్ధ పెట్టకపోవడం, పనులను వాయిదా వేయటం, ఏకాగ్రత లోపించటం, ఆకలి తగ్గిపోవటం, చదువుపై శ్రద్ధ తగ్గడం, నీరసంగా ఉండటం, తమలో తామే బాధపడటంవంటి లక్షణాలతో ఉన్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఈ మందులే కాకుండా పాసిఫ్లోరా, హయోసయామస్, కాలీబ్రోమ్, కాలీఫాస్ వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడుకొని నిద్రలేమి నుండి బయటపడవచ్చు.

సేకరణ: ఆంధ్రభూమి, సంజీవిని