Pages

Tuesday, 17 September 2013

సౌందర్యలహరి ప్రథమ భాగము - ఆనంద లహరి


 కైలాసము నుండి తేచ్చినవి
ఆనందలహరి అనబడు మొదటి భాగములో 41 స్లొకములు ఉన్నవి. వీనిని ఆచార్యులవారు కైలాసము నుండి తేచ్చినారని నమ్మకము.


1 శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం 
న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మాపి | 
అతస్త్వా మారాధ్యం హరిహర విరించా దిభి రపి 
ప్రణంతు స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభావతి || 
భగవతీ! ఈశ్వరుడు కూడా శక్తితో కూడినప్పుడే జగములను సృష్టించగలడు. శివ కేశవ చతుర్ముఖాదులచేత కూడా పరిచర్యలు పొదే నిన్ను నావంటి పుణ్యహీనుడు స్తుతించడం ఎలా సాధ్యమౌతుంది?

2 తనీయాం సం పం సుంతవ చరణ పంకేరు హ భవం 
విరించిః సంచిన్వన్ విరచయతి లోకా న వికలమ్ |
వాహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం 
హరః సక్షుద్వైనం భజతి భాసితో ద్దూళన విధిమ్ ||
దేవి పాదరేణువు మహిమ గురించి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవి పాదపరాగాన్ని గ్రహించి శక్తిమంతులౌతున్నారు

3 అవిద్యానా మంత స్తిమిర మిహిర ద్వీపనగరీ
జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ |
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ||
దేవి అజ్ఞానులకు జ్ఞానాన్ని, చైతన్య రహితులకు చైతన్యాన్ని, దరిద్రులకు సకలైశ్వర్యాలను, సంసారమగ్నులకు ఉద్ధరణను ప్రసాదించునది.

4 త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణ 
స్త్వమేక నైవాసి ప్రకటతి వరాభీత్యభినయా |
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వంఛా సమాధికమ్
శరణ్యే లో కానాం తవ హి చరణా వేవ నిపుణౌ ||
తక్కిన దేవతలు వరదాభయముద్రలతో దర్శనమిస్తున్నారు. లోకరక్షకురాలైన శ్రీమాత పాదములే సకలాభీష్ట ప్రదాయములు, భయాపహములు, లోకరక్షకములు.

5 హరిస్త్వా మారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం 
పురానారీభూత్వా పురరిపు మపి క్షోభమనయత్ | 
స్మరో పిత్వాం నత్వా రాతినయన లేహ్యేన వపుషా 
మునీనా మత్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ 
త్రైలోక్యమోహినియు, శ్రీచక్ర రూపిణియు అయిన శ్రీ త్రిపురసుందరీదేవిని పూజించి విష్ణువు మోహినీ రూపమును ధరించగలిగెను. మన్మధుడు లోకములను మోహింపజేయగలుగుచున్నాడు.

6 ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖా 
వసంత స్సామంతో మలయ మరుదాయోధనరథః | 
తథాప్యేక స్సర్వం హిమగిరిసుతే కామపి కృపా 
మాపాంగా త్తే లభ్ద్వా జగదిద మనంగో విజయతే || 
పార్వతి కటాక్షవీక్షణం వలన మన్మధుడు ఒంటరివాడైనను, శరీరహీనుడైనను, అల్పాయుధధారియైనను లోకములను వశీకరించుకొంటున్నాడు.

7 క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తన నతా 
పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్ర వదనా | 
ధను ర్భాణా న్పాశం సృణిమపి దధానా కరతలైః 
పురస్తా దాస్తాం నః పురమధితు రాహోపురుషికా 
శ్రీదేవీ స్వరూప ధ్యానం: క్వణత్కాంచీధామా - మ్రోయుచున్న చిరుగంటల మొలనూలు కలది; కుంభస్తననతా - స్తన భారముచే కొంచెము వంగినది; పరిక్షీణామధ్య - కృశించిన నడుము కలది; పరిణత శరచ్చంద్రవదన - నిండు చందమామ వంటి మోము; ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః - ధనుస్సును, పుష్పబాణములను, పాశమును, అంకుశమును చేతులలో ధరించినది; త్రిపురాంతకుని అహంకారరూపియైన దేవి.

8 సుధాసింధో ర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే 
మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే | 
శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయామ్ 
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 
"సుధా సింధోర్మధ్యే" - దేవియొక్క ఆవాసం వర్ణన - అమృత సముద్రమున, 
కల్పవృక్షముల తోటలలో మణిద్వీపం గురించి.

9 మహీం మూలాధారే కమపి మణిపురే హుతవహం 
స్థితం స్వాధిష్టానే హృది మరుత మాకాశ ముపరి | 
మనో పి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం 
సహస్రారే పద్మే సహా రహసి పత్యా విహరసే || 
వేదాంతయోగసారము - శరీరంలోని షట్చక్రాల గురించి వర్ణన - కుండలినీ యోగ విధానము (ఆరోహణ)- సహస్రార చక్రంలో సదాశివునితో కలిసి దేవి విహరించుచున్నది.

10 సుధా ధారా సారై శ్చరణ యుగళాంత ర్విగళితై: 
ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయ మహసాః | 
అవాప్య స్వాం భూమిం భుజగ నిభ మధుష్యవలయం 
స్వమాత్మానాం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి ||
కుండలినీ యోగం (అవరోహణ) గురించి తెలిపే రెండ శ్లోకం - శరీరంలో నాడీ ప్రపంచం గురించి, అమృత ధారా స్రావ మార్గం గురించి.

11 చాతుర్భిః శ్రీ కంఠైః శివయువతిభిః పంచభిరపి 
ప్రభిన్నాభి శ్శంభో ర్నవభిరపి మూల ప్రకృతిభిః | 
చతుశ్చత్వారింశ ద్వసుదళ కలాశ్ర త్రివలయ 
త్రిరేఖాభి స్సార్థం తవశరణ కోణాః పరిణితాః || 
శ్రీచక్రం వర్ణన - నవ చక్రాకృతమై, 44 అంచులు కలిగి శివశక్త్యుభయరూపముగా వెలయుచున్నది.

12 త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం 
కవీంద్రా: కల్పంతే కథమపి విరించి ప్రభృతయః | 
యదా లోకౌత్సుక్యా ధమరలలనాయాంతి మనసా 
తపోభిః దుష్ప్రాపామపి గిరీశ సాయుజ్య పదవీమ్ || 
శ్రీలలితామహాభట్టారికామాత అనంత సౌందర్య స్తుతి, శివ సాయుజ్య ప్రసక్తి

13 నరం వర్షీ యంసం నయనవిరసం నర్మసు జడం 
త వాపాంగాలోకే పతిత మనుధావంతి శతశః | 
గళ ద్వేణీబంధాః కుచకలశ విస్త్రస్త సిచయాః 
హఠాత్త్రు ట్యత్కాంచ్యో విగళిత దుకూలా యువతయః || 
దేవి కటాక్షమహిమా వైభవం వలన ఎంతటి వికారరూపుడైన ముదుసలి కూడా సుందరాంగులను మోహింపజేయగలడు.

14 క్షితౌ షట్పంచాశత్ ద్విసమధిక పంచాశ దుధకే 
హుతాశే ధ్వాషష్టి శ్చతురిధిక పంచాశదనిలేః | 
దివి ద్విషట్త్రింశ న్మనసి చ దుతుష్షష్ఠి రితి యే 
మయూఖా స్తేషా మప్వుపరి తవ పాదాంబుజయుగం || 
షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం.

15 శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటమ్ 
వరత్రాసత్రాణస్ఫటిక ఘుటికా పుస్తక కరామ్ 
సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే 
మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః ఫణితయః 
సాత్విక ధ్యాన విధానం - శరత్కాలపు వెన్నెలను బోలు దేవికి నమస్కరించిన సజ్జనులకు అమృత రస తరంగిణులైన వాక్ప్రభావము లభించును.

16 కవీంద్రాణాం చేతః కమకవన బాలాతపరుచిం 
భజన్తే యే సన్తః కతిచిదరుణా మేవ భవతీమ్ 
విరించి ప్రేయస్యాస్తరళతర శృంగారలహరీ 
గభీరాభి ర్వాగ్భి ర్విదధతి సభారంజనమమీ 
రాజస ధ్యాన విధానం - అరుణాదేవిని ధ్యానించువారు సరస్వతీ సమానులగుదురు.

17 సవిత్రీ భిర్వాచాం శశి మణి శిలా భంగరుచిభి 
ర్వశిన్యా ద్యా భిస్త్వాం సహ జనని సంచింతయతి యః |
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరిచిభిః 
వచో భి ర్వాగ్ధేవీ వధన కమలా మోద మధురైః || 
జ్ఞాన శక్తి రూపముననున్న, వశిన్యాది శక్తులతో కూడ దేవిని ధ్యానించువాడు మహాకావ్యములను వ్రాయగలడు.

18 తనుచ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః 
దివం సర్వాముర్వీ మరుణిమ నిమగ్నాం స్మరతి యః | 
భవంత్యస్య త్రస్వద్వన హరిణ శాలీన నయనాః 
సహోర్వశ్యా వశ్యాః కతికతి న గీర్వాణ గణికాః || 
ఇచ్ఛాశక్తి రూపమున కామరాజకూటమును అధిష్టించిన దేవిని ధ్యానించినయెడల వానికి అప్సరసలు కూడ వశులగుదురు.

19 ముఖం బిందుంకృత్వా కుచయుగ మధస్తస్య తదధో 
హకారార్ధం ధ్యాయే ద్దరమహిషి లే మన్మథకలామ్ | 
స సద్య స్సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు 
త్రిలోకీ మప్యాసు భ్రమయతి రవీందు స్తన యుగాం || 
అతి గోప్యము, గురువు ద్వారా గ్రహింపనగునది అయిన కామకలారూపము. ఇచ్ఛాజ్ఞానక్రియా శక్తి ధ్యానము.

20 కిరంతీ మంగేభ్యః కిరణనికురుంబామృతరసమ్ 
హృది త్వామాధత్తే హిమకర శిలామూర్తి మివ యః | 
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ 
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయాః || 
విష హరము, జ్వర హరము అగు ధ్యానము - దేవిని హృదయమున నిలుపుకొనువాడు అమృతతుల్యమగు తన చూపుచే, సర్పములను గరుత్మంతుడు శమింపజేసినట్లుగా, ఎట్టి జ్వరపీడితుల సంతాపమునైన పోగొట్టగలడు.

21 తటిల్లే ఖాతన్వీ తపనశశి వైశ్వానరమయీమ్ 
నిషణ్ణం షణ్ణామ ప్యుపరి కమలానాం తవ కలామ్ | 
మహాపద్మాతన్యాం మృదితమలమాయేన మనసా 
మహానద్తఃపశ్యన్తో దధతి పరమాహ్లాద లహరీమ్ || 
యోగ ధ్యాన విశేషము - సహస్రారంలోని చంద్రకళను ధ్యానించిన వారికి పరమానందము లభించును.

22 భవానిత్వం దాసేమయి వితర దృష్టిం సకరుణా 
మితిస్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వంమితియః |
తదైవ త్వం తస్మైదిశసి నిజసాయిజ్య పదవీం 
ముకుంద బ్రహ్మేంద్రస్ఫుతమకిత నీరాజతపదామ్ || 
భక్తి మహిమ - తనను భక్తితో కోర్కెలు కోరెడి దాసుల వాక్యము పూర్తి కాకుండానే దేవి వారికి దుర్లభ సాయుజ్యమును ప్రసాదించును.

23 త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా 
శరీరార్థం శంభో రపర మపి శంకే హృత మభూత్ | 
యద్తత్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనమ్ 
కుచాభ్యా మానమ్రం కుతిలశశిచూడాలమకుతమ్ || 
శివశక్తుల సంపూర్ణైక్యత

24 జగత్సూతే ధాతా హరి రవతి రుద్రః క్షపయతే 
తిరస్కుర్వన్నేత త్స్వమపి వపు రీశ స్థిరయతి | 
సదా పూర్వస్సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివః 
తవాజ్ఞా మాలంబ్య క్షణచలితయో ర్ర్భూలతిక యోః || 
బ్రహ్మాండము యొక్క సృష్టిలయములు దేవి కనుసన్నల ఆజ్ఞల ప్రకారమే జరుగుచున్నవి.

25 త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే 
భవే త్పూజా తవ చరణయోర్యా విరచితా | 
తథాహి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే 
స్థితా హ్యేతే శశ్య న్ముకుళితకరో త్తంస మకుటాః || 
సత్వరజస్తమోగుణముల వలన ఉద్భవించిన త్రిమూర్తులకు శివాణి పాదపూజయే నిజమైన పూజ.

26 విరించిః పంచత్వం ప్రజతి హరి రాప్నోతి విరతిం 
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ | 
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశాం 
మహాసంసారేంస్మిన్విహరతి సతి త్వత్పతిరసౌ || 
మహాప్రళయంలో సర్వమూ లయమైనాగాని సతీదేవి మాంగల్య మహిమవలన శివుడు మాత్రము విహరించుచున్నాడు.

27 హపో జల్ప శ్శిల్పం సకలమపి ముద్రావిరచనా 
గతిఃప్రాదక్షిణ్య హ్రమణ మశనాద్యాణ్యహుతివిధిః | 
ప్రణామ స్సంవేశః సుఖ మభిలామాత్మార్పంఅదృశా 
సపర్యా ప్ర్యాయ స్తవ భవతు యన్మే విలసితమ్ || 
జ్ఞానయోగాభ్యాసనా సారము - ఆత్మార్పణమే దేవికి సముచితమైన అర్చన- ఏది చేసినా అంతా భగవతి పూజయే అని కవి విన్నవించుకొంటున్నాడు - "నా మాటలే మంత్రాలు, చేసే పనులన్నీ ఆవాహనాది ఉపచారాలు. నా నడకే ప్రదక్షిణం. నేను తినడమే నైవేద్యము. నిద్రించుటయే ప్రణామము. నా సమస్త కార్యములు నీకు పూజగా అవుగాక."

28 సుధా మప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీమ్ 
విపద్యం తేవిశ్వే విధి శత మఖము ఖాద్యా దివిషదః | 
కరాళం యత్ క్ష్వేళం కబళితవతః కాలకలనా 
న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా || 
దేవియొక్క తాటంకములు (కర్ణ భూషణములు) అత్యంత మహిమాన్వితమైనవి. వాని సన్నిధిలో కాల ప్రభావము కూడ నిరోధింప బడును.

29 కిరీటం వైరించం హరిహర పుర కైటభభిదః 
కఠోరే కోతీరే స్ఖలసి జహిజంభారి మకుటమ్ | 
ప్రణమ్రే ష్వేతేషు ప్రసభముపయాతస్య భవనమ్ 
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తి ర్విజయతే || 
శివుడు ఇంటికి వచ్చు సమయములో ధేవి ఎదురేగబోగా ఆమె కాలికి మ్రొక్కుచున్న బ్రహ్మ, విష్ణు, మహేంద్రాదుల కిరీటములు అడ్డముగానున్నవని చెలులు హెచ్చరించుచున్నారు.

30 స్వదేహోద్భూ తాభిర్ఘృణిభి రణిమాద్వాభి రభితః 
నిషేవ్యే నిత్యేత్వా మహి మితి సదా భావయతి యః | 
కి మాశ్చర్యం తస్య త్రిణయన సమృద్ధిం తృణయతో 
మహా సంవర్తాగ్ని ర్విరచయతి నీరాజన విధిమ్ || 
దేవిని నిరంతరము ధ్యానించు భక్తునకు ఎట్టి సంపదలు అవుసరము లేదు. వానికి ప్రళయాగ్నియే ఆరతివలె అగును.

31 చతుష్షష్ట్యా తం త్రై స్సకలమతి సంధాయ భువనమ్ 
స్థిత స్తత్తత్త్సిద్ధి ప్రసవపరతమ్ త్రైః పసుపతిః | 
పునం స్త్వన్నిర్బంధా దఖిల పురుషార్థై కఘటనా 
స్వతంత్త్రం తే తంత్రం క్షితి తల మవాతీతరదిదమ్ || 
దేవి నిర్బంధము కారణముగా 64 తంత్రములను శివుడు భూతలమునకు తెచ్చెను.

32 శివశ్శక్తిః కామః క్షితి రథః రవి శ్శీతకిరణః 
స్మరో హమ్స శ్శక్ర స్తదనుచ పరామారహరయః | 
అమీ హృల్లేఖాభి స్తిసృభి రవసానేషు ఘటితాః 
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ || 
దేవీ మంత్రరాజము అయిన పంచదశాక్షరి సకలపురషార్ధ సాధకము. ఈ శ్లోకములో పంచదశాక్షరి సంకేతములతో చెప్పబడినది. (షోడశాక్షరి మంత్రము గుహ్యము. గురువు ద్వారా మాత్రమే శిష్యుడు గ్రహించవలెను. కనుక ఈ శ్లోకములో 15 అక్షరములే చెప్పబడినవి.)

33 స్మరంయోనిం లక్ష్మిం త్రితయమిద మాదౌతవమనో 
ర్ని ధాయైకే నిత్యేనిరవధి మహాభోగ రసికాః | 
భజన్తి త్వాం చింతామణి గుణ నిబద్దాక్షవలయాః 
శివాగ్నౌ జుహ్వాంతస్సురభిఘృతధారాహుతిశతైః || 
కౌలులు బాహ్య విధానములో చేయు దేవి అర్చన వర్ణన. ఈ శ్లోకము బీజాక్షరములున్నవి. ఇది అధికారము, ఐశ్వర్యము, మోక్షము అవంటి ప్రయోజనములను కలిగించును.

34 శరీరం త్వం శంభో శ్శశిమిహిరవక్షోరుహయుగమ్ 
తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన మనఘమ్ || 
అతశ్శేష శ్శేషీత్వయ ముభయ సాధారణతయా 
స్థిత స్సంబంధో వాం సమరసపరానందపరయోః || 
శివశక్తుల ఐక్యత గురించి. నవ వ్యూహాత్మకమైన భైరవస్వరూపము ఇందు వర్ణితము. శివుడు ఆనంద భైరవుడు. పరాశక్తియే మహాభైరవి. వారు వేరు వేరు కాదు.

35 మనస్త్వం వ్యోమ త్వం మరు దసి మరుత్సారథి రసి 
త్వమాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహిపరం | 
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా 
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే || 
షట్చక్రములందున్న పృధివ్యాధి తత్వములు దేవియే. అన్ని రూపములు ఆమెయే.

36 తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటి ద్యుతిధరమ్ 
పరం శంభుం వందే పరిమిళిత పార్శ్యం పరచితా | 
యమారాధ్య న్భక్త్వా రవిశశి మవిషయే 
నిరాలోకే లోకే నివసతి హి భాలోక భువనే || 
ఆజ్ఞా చక్రమునందున్న పరమ శివునికి నమస్కారము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - పరశంభునాధుడు, పరచిదంబ.

37 విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం 
శివం సేవే దేవీ - మపి శివ సమాన వ్యవసితామ్ || 
యయోః కాంత్యాయాంత్యాః శశికిరణ సారూప్య 
విధూతాం తర్థ్వాం విలసతి చకోరీవ జగతీ || 
విశుద్ధి చక్రము నందలి దేవీ తత్వము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - వ్యోమేశ్వరుడు, వ్యోమేశ్వరి.

38 సమున్మీల త్సంవిత్కమల మకరందైక రసికమ్ 
భజే సంసద్వంద్వం కిమపిమహతాం మానసచరమ్ | 
యదాలాపా దష్టాదశ గుణిత విద్యా పరిణతిః 
యధాద త్తేదోషాద్గుణ మఖిల మద్భ్యః పయ ఇవ || 
అనాహత చక్రము నందలి హంస ద్వంద్వమునకు వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - హంసేశ్వరుడు, హంసేశ్వరి

39 తవ స్వాధిష్టానే హుతశాహ మధిష్టాయ నిరతమ్ 
త మీడే సంవర్తం జనని మహతిం తాంచ సమయామ్ |
యదాలోకే లోకాన్ దహతి మహతిః క్రోధకలితే 
దయార్ద్రా యాదృష్టి శ్శిశిర ముపచారం రచయతి || 
స్వాధిష్ఠాన చక్రము నందలి సంవర్తాగ్నికి (అగ్ని తత్వము గలది) స్తుతి. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - సంవర్తేశ్వరుడు, సమయాంబ

40 తటి త్వంతం శక్త్యా తిమిరపరిపంథి స్ఫురణయా 
స్పుర న్నానార త్నాభరణ పరిణద్థేంద్ర ధనుషమ్ | 
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్ 
నిషేవే వర్షంతం హర మిహిరత ప్తం త్రిభువనమ్ || 
మణిపూరక చక్రము నందుండి ముల్లోకములను తడుపు నీలమేఘమునకు ధ్యానము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - మేఘేశ్వరుడు, సౌదామిని

41 తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా 
నవాత్మానం మన్యే నవరస మహాతాండవనతమ్ | 
ఉభాభ్యా మేతాభ్యా ముదయ విధి ముద్దిశ్య దయయా 
సనాభాధ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగ దిదమ్ || 
మూలాధార చక్రము నందు నటన చేయు ఆనందభైరవునికి వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - ఆదినటుడు, లాస్యేశ్వరి (ఆనంద భైరవుడు, సమయ)