Pages

Wednesday, 4 September 2013

తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది


తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది అన్న సామెత అక్షరాల నిజం. ఇది కేవలం కాయగూర మాత్రమే కాదు ఇది మంచి ఔషధం కూడా. ఉర్లగడ్డ తర్వాత ఉల్లిపాయను ఎక్కువమంది తమ ఆహారంలో ఉపయోగిస్తారు. వీటి పుట్టుక ఇరాన్, పశ్చిమ పాకిస్థాన్, ఉత్తర భారత‌దేశంలోని కొండప్రాంతాలలో జరిగింది.
పిరమిడ్‌లను నిర్మించిన రోజుల్లోనే ఉల్లిపాయ వారికి ఆహారంగా ఉండేదని, బైబిల్, ఖురాన్‌లలో కూడా ఉల్లి ప్రస్థావన వచ్
చిందని చరిత్ర చెబుతున్నట్లు పరిశీలకులు పేర్కొన్నారు.

ఉల్లిపాయలో రిబోఫ్లావిన్ (విటమిన్ బి), కార్బోహైడ్రేట్‌లు 11 శాతం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇందులో ఎన్..ప్రొపైల్ ..డై సల్ఫేట్ ఉండడం వల్ల ఒక రకమైన వాసన వస్తుందని తెలిపారు. అమినో ఆమ్లం వలన దీనిని కోసినప్పుడు కళ్ళల్లో నీరు వస్తుందని చెప్పారు. ఇది జీర్ణక్రియకు, మధుమేహ నివారణకు, ఒంటి నొప్పులకు కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి బాగా తోడ్పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.

ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే వెంట్రుకలు పెరగడానికి కూడా ఇది ఉపకరిస్తుందని తెలిపారు. ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఉల్లిపాయ జేబులో వేసుకు వెళ్ళమని మనపెద్దలు చెబుతూనే ఉంటారు.