Pages

Wednesday, 4 September 2013

బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోతే "ఆ" అనుభవాలు ఎక్కువ..!


పద్ధతి ప్రకారం బ్రేక్‌ఫాస్ట్ (ఉదయంపూట అల్పాహారం) తీసుకోని వారు చిన్న వయస్సులోనే శృంగార అనుభవాలను చవిచూస్తారని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆహారానికీ, శృంగారానికీ గల సంబంధ బాంధవ్యాల గురించి ఇప్పటిదాకా అనేక రకాల సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చినప్పటికీ, తాజా అధ్యయన సంగతులు మాత్రం కాస్తంత ఆలోచింపజేస్తున్నాయి.

ఇక వివరాల్లోకి వస్తే... జపాన్‌కు చెంది
న ఓ శాస్త్రవేత్తల బృందం బ్రేక్‌ఫాస్ట్ అంశానికి సంబంధించి దాదాపు మూడువేలమందిపై అధ్యయనం జరిపారు. క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేవారు 19 ఏళ్ల సగటు వయసులో తొలి శృంగార అనుభవాన్ని చవిచూస్తున్నారని, ఎక్కువగా బ్రేక్‌ఫాస్ట్ జోలికి పోనివారు మాత్రం 17.5 ఏళ్ల వయస్సులోనే శృంగారానుభవం పొందారని ఈ అధ్యయనం ద్వారా తేలిందని వారు చెబుతున్నారు.

క్రమశిక్షణ కలిగిన కుటుంబం లేనివారు, తగవులు పడే తల్లిదండ్రులు ఉన్నవారు తీవ్రమైన నిరాశా నిస్పృహలకు గురై... వాటినుండి బయటపడేందుకు అతి తక్కువ వయస్సులోనే శృంగారానుభవం కోసం పాకులాడుతుంటారని జపాన్ పరిశోధకులు వివరిస్తున్నారు. ఇలాంటివారే ఉదయంపూట ఆహారం తీసుకునేందుకు ఇష్టపడరని వారంటున్నారు. కాబట్టి, తగవులు పడే తల్లిదండ్రుల్లారా...! మీ పిల్లల గురించి ఇప్పటికైనా కాస్తంత ఆలోచిస్తారు కదూ...!

తిండికి, లైంగిక సంబంధాలకు మధ్య బాదరాయణ బంధం ఉందో లేదో కాదు కానీ, తిండితో సహా అన్ని రకాల కుటుంబ పరమైన క్రమశిక్షణలకు దూరమైన వారు, కుటుంబంలో తీవ్రమైన అసంతృప్తికి గురైన టీనేజర్లు తమ నిరాశా నిస్పృహలనుంచి బయటపడే మార్గంగా సెక్స్ సంబంధాల వైపు పోతున్నారని ఈ సర్వే చెబుతోంది. పాశ్చాత్యీకరణకు లోనైన జపాన్ కుటుంబాలలో పొడసూపుతున్న ఈ నూతన ధోరణులు జపాన్ సాంప్రదాయిక వ్యవస్థకు పెను సవాల్ వంటివే..