శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించడం లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి చేరుకుని నేతితో దీపమెలిగించడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం లభిస్తుంది. ఇంకా ఈతిబాధలు తొలగిపోవడం, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడం వంటి శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఇంకా శుక్రవారం నాడు అమ్మవారి ఆలయ దర్శనం గావించి అమ్మవారికి తెల్లపువ్వులు సమర్పించడంతో గృహంలో ప్రశాంతత నెలకొంటుందని విశ్వాసం. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఆ కుటుంబమంతా సుఖసంతోషాలతో, ప్రశాంతతతో ఉంటుందని పండితులు అంటున్నారు. ఇకపోతే.. ధవళ వర్ణ వస్త్రాలు ధరించడం, అరటి పండు జ్యూస్ తాగడం లేదా అరటి పండు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని పురోహితులు చెబుతున్నారు. శుక్రవారం రోజున పాలుతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరమునందు ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.