Pages

Monday, 23 September 2013

సాధారణంగా ముఖం నల్లగా అయిపోతే టాన్ వచ్చిందేమో అనుకుంటాం. కానీ అది మూడు నాలుగు వారాలైనా పోకపోతే కచ్చితంగా డెర్మటాలజిస్టును కలవాల్సిందే.


gluta-mod talangana patrika telangana culture telangana politics telangana cinemaఈ మధ్య కాలంలో పిగ్మెం సమస్యగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ముఖానికి ఈ పిగ్మెం వస్తుంది. అందంగా ఉన్న ముఖం కాస్తా ఈ పిగ్మెం మచ్చలతో వికారంగా తయారవుతోంది. అయితే చర్మంపై వచ్చే టాన్‌కు.. ఈ పిగ్మెం కొద్దిపాటి తేడామావూతమే ఉంటుంది. సాధారణంగా ముఖం నల్లగా అయిపోతే టాన్ వచ్చిందేమో అనుకుంటాం. కానీ అది మూడు నాలుగు వారాలైనా పోకపోతే కచ్చితంగా డెర్మటాలజిస్టును కలవాల్సిందే. మరి ఈ పిగ్మెం తగ్గడానికి కొన్ని సహజమైన పద్ధతులను, చిట్కాలను ఇప్పుడు చూద్దాం... 


- ఒక చెంచా పాలపొడి తీసుకుని దానికి ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మరసం, సగంచెంచా బాదం నూనె కలిపి పేస్టు తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మర్దనా చేసిన 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది ముఖంలో టాన్‌ను పోగొట్టి కొత్తకాంతినిస్తుంది.
- ఓట్స్ తీసుకుని వీటికి టమాటారసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.
- ఆలుగడ్డను అడ్డంగా కోసి పలుచని పొరలను మచ్చలున్న చోట పది నిమిషాలపాటు ఉంచాలి. ఇది మచ్చలను పోగొడుతుంది.
- పసుపుకు నిమ్మరసం కలిపి ముఖానికి మర్దనా చేయాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. నిమ్మరసం ముఖానికి మంచి బ్లీచ్‌లా పనిచేస్తుంది.
- కమలాపండు తొక్కల్ని ఎండిన తరువాత పొడి చేసి దానికి కొంచెం పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇది కమిలిపోయిన చర్మానికి నునుపుదనాన్నిస్తుంది.
- కొన్ని లేత వేపాకులు లేదా వేప చిగురు తీసుకోవాలి. దీనికి కొంచెం పసుపు, నిమ్మరసం కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్టును రాత్రిపూట ముఖానికి రాసుకుని ఉదయం కడిగేయాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే రోజూ చేసినా మంచిదే.
- పొడిచర్మం ఉన్నవాళ్లు ఎండలో అసలు తిరగకూడదు. తప్పనిసరై వెళ్లాల్సివస్తే ముఖానికి ఏదైనా మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
- వారానికోసారి ఛాయ్ డికాషన్‌తో ముఖానికి ఆవిరిపట్టండి. మంచి ఫలితం ఉంటుంది.
- పుదీనా ఆకులను మెత్తని పేస్టులాగా చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాలాగి చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా 15 రోజులు వరుసగా చేస్తే రంగు మారుతుంది.
- ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు స్వీట్స్, ఐస్‌క్షికీమ్స్, కొవ్వు పదార్థాలు తినడం తగ్గించి తాజా పళ్లు, పళ్లరసాలు, సలాడ్స్ తీసుకోవడం మంచిది.
- పాలలో ఉప్పువేసి దాంతో ముఖానికి 5 నిమిషాలపాటుమర్దనా చేసి 20 నిమిషాలాగి కడిగేయండి.
- ఒక స్పూను గంధంపొడిలో కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాలాగి కడిగేయండి. ముఖానికి మెరుపురావడమే కాదు... నునుపుదనం కూడా సంతరించుకుంటుంది.
- టమాట చర్మానికి మంచి క్లెన్సర్. బాగా పండిన టమాట గుజ్జును తీసుకుని ముఖానికి రుద్ది పావుగంట తరువాత కడిగేయండి. ఇలా 20రోజులపాటు చేయడం వల్ల చర్మానికి కొత్తకాంతి వస్తుంది.
- పెరుగు తీసుకుని దానికి నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరువాత కడిగేయాలి. మంచి ఫలితం ఉంటుంది.
- పాలలో కొంచెం శనగపిండి, కొంచెం గంధం పొడి కలిపి పేస్టు తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి మెడకు మృదువుగా మర్దనా చేయాలి. శనగపిండి చర్మంపై ఉన్న మురికిని, మృతకణాలను తొలగిస్తే గంధం చర్మానికి మెరుపునిస్తుంది.