ప్రస్తుత కాలంలో మహిళలు అందంగా ఉండేందుకు నిరంతరం పరితపిస్తున్నారు. ఇందుకోసం మార్కెట్‌లోకి వచ్చే వివిధ రకాల సౌందర్య సాధనాలను ఉపయోగిస్తున్నారు. అయితే వీటివల్ల ఎక్కువ ఇబ్బందులు పడేది గర్భంతో ఉన్న మహిళలు. వివిధ రకాల లిప్‌స్టిక్‌ల వల్ల గర్భంలోని శిశువుకు హాని కలుగుతుంది. క్రీములు, పర్ఫ్యూమ్‌లు, కాస్మొటిక్స్ గర్భంలోని పసికందుపై ప్రభావం చూపుతాయి. అందులోనూ మగబిడ్డ అయితే.. దుష్ఫలితాలు అధికంగా ఉంటాయట. జ్ఞాపకశక్తి తగ్గుదల, శరీర అవయవాల పెరుగుదలలాంటి అంశాలపై ప్రభావం ఉంటుంది. ఎనిమిదో వారం నుంచి 12వ వారం వరకు.. గర్భస్త శిశువు అవయవాల పెరుగుదల కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో హార్మోన్లు పిండంపై ప్రభావం చూపడం వల్లే జ్ఞాపకశక్తి తగ్గుదల లోపాలు కనిపిస్తాయి. అందుకే ఆ సమయంలో తల్లి ఉపయోగించే అలంకరణ వస్తువులు బిడ్డ పునరుత్పత్తి హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల పిల్లలకు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి గర్భం దాల్చిన మహిళలు ప్రసవం అయ్యేంత వరకు సౌందర్య సాధనాలకు కొంచెం దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Monday, 23 September 2013
కాస్మొటిక్స్‌తో జాగ్రత్త!