Pages

Monday, 23 September 2013

‘అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడ ముత్యమేలే’

beauty













‘అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడ ముత్యమేలే’ అంటూ ప్రేమికుడు మురిసిపోతాడు. ఒక్క మొటిమ ఉంటే బాగానే ఉంటుంది. మరి ఎక్కువ అయితే ముఖం అంద విహీనంగా తయారవుతుంది. మొటిమలు లేని అందమైన ముఖారవిందం మీ సొంతం చేసుకోవాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు...
- నిమ్మరసం, రోజ్‌వాటర్ సమపాళ్లలో తీసుకోవాలి. దీనిని ముఖంపై మొటిమలు ఉన్న భాగంలో రాయాలి. అరగంట తరువాత కడిగేయాలి. తరచూ దీన్ని చేస్తే మూడు, నాలుగువారాల్లో మొటిమలు తగ్గిపోతాయి.
- పల్లీనూనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మర్దనా చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు తగ్గిపోవడమే కాదు.. మొటిమలతో వచ్చే ఇతర సమస్యలూ మాయమవుతాయి.
- మొటిమల ముఖానికి తేనె కూడా మేలు చేస్తుంది. మూడు తేనెకు ఒక దాల్చిన చెక్క పొడిని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, పూర్తిగా ఆరిపోయిన తరువాత కడిగేయాలి. రెండు వారాలు వరుసగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- ఆపిల్ పేస్టుకు తేనెను కలిపి ముఖానికి ఫేషియల్ వేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తరువాత కడిగేస్తే మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.
- మొటిమలు ఎక్కువగా బాధిస్తుంటే వెల్లుల్లిని తీసుకుని పేస్ట్ చేసి, ఆ పేస్ట్‌ను మొటిమలున్న చోట పెట్టాలి. దీనిని ఆహారంలోకూడా తీసుకుంటే సత్వర ఫలితాలుంటాయి.
- టమాట గుజ్జును తరచుగా ముఖానికి మర్దనా చేస్తే మొటిమలు పోవడమే కాదు... ముఖం కాంతివంతమవుతుంది.
- కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ముఖానికి రాసి అరగంట తరువాత చన్నీళ్లతో కడిగేస్తే మొటిమలు మాయం.
- పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజూ రాత్రిపూట ముఖానికి రాసుకోవాలి. పొద్దునే గోరు నీటితో కడిగి తుడిచేయాలి. ఇలా వారం రోజులపాటు చేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
- ముఖంపై మొటిమలు మచ్చలు రాకుండా ఉండాలంటే చిన్నపాటి ఆలుగడ్డను తీసుకుని ఉడికించాలి. దానిని పేస్ట్‌లా చేసుకుని అందులో నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే మొటిమలు పోతాయి.
- ఉసిరి విత్తనాలు నాలుగైదు గంటలపాటు నీటిలో నానబెట్టి, ఆ తరువాత వాటిని పేస్ట్ చేసి ముఖానికి పట్టిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.
- పాలలో టమాటారసం కలిపి రాస్తే మొటిమలు తగ్గుతాయి.
- చందనం పొడి, కర్పూరం పొడి నీటిలో కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు నెమ్మదిగా మాయమవుతాయి.
- కీరదోస లేదా దోస గుజ్జును ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి.
- వీటితోపాటు... ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే, రాత్రి పడుకునే ముందు సల్ఫర్ ఉన్న సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
- జుట్టు ముఖం మీదకి వస్తే వెంట్రుకల్లో ఉండే ఆయిల్స్ ముఖంపై చేరి మొటిమలు రావడానికి కారణమవుతాయి. సో జుట్టు ముఖం మీదకి రాకుండా చూసుకోవాలి.
- ఎక్కువగా మేకప్ వేసుకోవడం కూడా మొటిమలు, మచ్చలకు దారి తీస్తుంది. అందుకే వాటర్ బేస్‌డ్ మేకప్ కాస్మొటిక్స్ వాడటం మంచిది.
- ఒక్క మొటిమ అయినా అస్తమానం చేయి దానిమీదికే పోతుంది. దాన్ని పిండుతూ ఉంటారు. దీనివల్ల మొటిమలు ముఖమంతా వ్యాపించే అవకాశం ఉంటుంది.