తాజా బొప్పాయిలో కొబ్బరిపాలు కలిపి, చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా శాటిన్ లా మెత్తగా మారుతుంది. మరీ వేడి నీటితో స్నానం చేయటం మంచి పద్దతి కాదు. ఇలా చెయటం వల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది. వెల్లుల్లి రసం తెగిన, కాలిన గాయలను, మచ్చలను తగ్గిస్తుంది. దోమలు కుడితే నిమ్మరసంకు కొంచెం నీరు కలిపి దూదితో దోమ కుట్టిన చోట రుద్దితే మంట తగ్గిపోతుంది.- కీరదోసకాయ రసంలో దూదిని ముంచి రోజుకి రెండుసార్లు రాసుకుంటే చర్మానికి మెరుపు వస్తుంది.
పావుకప్పు ఓట్లు, పాలపొడి, చిక్కటి గంజి తీసుకోవాలి. వీటన్నిటినీ పేస్టులా కలుపుకోవాలి. స్నానానికి ఇరవై నిముషాలముందు శరీరమంతా పట్టించుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.
మీ చర్మం ముడతలు, పగుళ్ళు గా ఉన్నట్లయితే మీరు మీ చర్మాన్ని సంరక్షించుకోవాలి. మొదట ఒక మంచి చర్మ వ్యాధుల నిపుణుని కలవండి. మీకున్న సమస్య చిన్నదేనా లేదా ప్రమాదకరమైనదా అనేది నిర్ధారించుకోవాలి. క్రమం తప్పకుండా ఫేషియల్స్, క్లీనప్స్ చేయించుకుంటుంటే మంచిగా చర్మాన్ని సంరక్షించుకోవాలి. వీలైనన్ని తాజా పళ్ళూ, కూరగాయలను ఆహారంలో తీసుకోండి. రోజులో వీలైనంత మంచినీరు తాగడానికి ప్రయత్నించండి. స్నానానికి బాగా వేడిగా లేదా చల్లగా ఉన్న నీళ్ళను వాడటం దాదాపుగా ఆపేయాలి. గోరు వెచ్చని లేదా మామూలుగా చల్లగా ఉండే నీళ్ళను వాడటం క్షేమం. మాయిశ్చరైజర్ ఉన్న సబ్బును వాడాలి. స్నానం చేసిన అనంతరం మాయిశ్చరైజ్ లోషన్‌ను పూసుకుంటే చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. పోషక విలువలున్న ఆహార పదార్ధాలతో సమతుల ఆహారం తీసుకుంటే అది చర్మానికి అందాన్ని ప్రసాదించడమే కాకుండా అనేక చర్మసంబంధిత వ్యాధులకు గురికాకుండా రక్షిస్తుంది. చర్మం పై పొరను పరిశుభ్రపరచడానికి ఒక మెరుపులాంటి ఛాయను ఇవ్వడానికి మాయిశ్చరైజింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పుడో ఎవరో చెప్పినప్పుడు అని కాకుండా క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. శ్వాసక్రియకు సంబంధించిన వ్యాయామం చేయడం కూడా చర్మసౌందర్యానికి ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్లెన్సింగ్ కూడా చర్మ సంరక్షణలో ఒక ప్రధానమైన చర్య. క్లెన్సింగ్ అప్లై చేసి ఒక నిముషంపాటు వదిలేసి తరువాత శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి అంతా పోయి చర్మం ఎలాంటి ముడుతలూ లేకుండా తాజా పండులా తయారవుతుంది. మేకప్‌కు కూడా ఎంతో సహకరిస్తుంది.పొడి చర్మం అయితే ఇలా చేయాలి
- ఎప్పుడూ కాటన్ దగ్గర పెట్టుకొని ముఖాన్ని తుడుచుకుంటూ ఉండాలి. లేదంటే బ్యాక్టీరియా చాలా తొందరగా ఈ చర్మం పై చేరుతుంది. వయసు ప్రభావం వల్ల, చర్మం పలుచదనం వల్ల తొందరగా సూర్యకిరణాల తాకిడికి, పొగకు, కాలుష్యానికి ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొడిచర్మం ఉన్నవారిలో లోపల ఉన్న తేమకూడా త్వరగా ఆవిరైపోతుంది. కాబట్టి అలాంటి చర్మం కలవారు వెంటనే మాయిశ్చరైజ్ చేయించుకోవాలి.
- నూనె, నీరు కొన్ని ఇతర ఔషధాలు కలిపిన ద్రవపదార్ధంతో మాయిశ్చరైజ్ చేసుకోవటం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మ సంరక్షణలో ప్రధాన పాత్రను పోషిస్తూ ముడుతలు, పొడిబారటం, మంట, పగుళ్ళు లేకుండా చేయడంతోపాటు చర్మానికి ఒక ఆరోగ్యమైన సహజసిద్దమైన మెరుపును అందిస్తుంది.
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼