- మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుమానుకుండే ముల్లును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని పట్టిస్తే ఫలితం ఉంటుంది.
- కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి.
- ఒక కప్పు పుదీనా ఆకులను రెండు కప్పుల నీళ్లలో ఉడికించి చల్లారిన తరువాత ఆ నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం తెల్లబడుతుంది.
- ముల్లంగి రసం, పెరుగు కలిపి ఫ్రిజ్‌లో ఉంచి రోజుకి రెండుసార్లు ముఖానికి, చేతులకీ రాసుకుంటే ఎండ వల్ల వచ్చిన నలుపుదనం పోతుంది.
- మిగిలిపండిన టమోటా రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి, మెడకు రాసుకుని 20 నిముషాల తరువాత కడిగేస్తే చర్మం మెరుస్తుంది.
- పాలలో నానేసిన గులాబీరేకులను ముఖం మీద రుద్దుకుని కొద్దిసేపటి తర్వాత కడుక్కుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
- బంగాళదుంప ముక్కతో తరచుగా ముఖాన్ని, ముఖ్యంగా కళ్ల కింది భాగంలో రాసుకుంటుండాలి. ఇలా రాసుకుని కొద్దిసేపటి తరువాత చల్లటి నీటితో కడగాలి. దీనివల్ల కళ్ల కింది నల్లని వలయాలు మాయమై ముఖం మెరుపు లీనుతుంది.
- కొద్దిపాటి ఆముదాన్ని తేనెలో కలిపి ముఖానికి మసాజ్ చేసుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మొటిమలు తగ్గే అవకాశం ఉంది.
- పుచ్చకాయరసాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత చన్నీళ్ళతో కడుక్కుంటే చర్మం తాజాగా ఉంటుంది.
- చక్రాల్లా తరిగిన కీరా ముక్కలతో ముఖమంతా రుద్దాలి. ఐదు నిమిషాలు ఆగి చల్లని నీటితో కడిగేయాలి. ముఖంపై మురికి తొలగిపోయి చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.
- టమాటా గుజ్జును ముఖానికి, మెడకు పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇది మంచి క్లెన్సర్‌లా పని చేస్తుంది.
- రెండు చెంచాల బాదంపొడి, అరచెంచా నిమ్మరసం, రెండుచెంచాల తేనెను బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించాలి. ఆరిన తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
- రాత్రి పడుకునే ముందు తాజా నిమ్మరసాన్ని ముఖానికి మర్దన చేసి ఐదు నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయండి. నిమ్మ మంచి యాస్ట్రింజెంట్ గా... బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది.
- ముఖంపై ముడతలు పోవాలంటే గిoజలు లేని ద్రాక్ష చక్కని పరిష్కారం. సగం కోసిన ద్రాక్ష ముక్కను ముఖానికి, మెడకు పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి.
- అరటిపండు గుజ్జుకు సరిపడా తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, కురులకు పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత కడిగేస్తే కొత్త మెరుపు వస్తుంది.
- ఉప్పు, పంచదార సమపాళ్ళలో తీసుకోవాలి. ఈ రెండు కరిగేలా కొన్ని చుక్కల నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ సమస్యకు ఇది సులువైన పరిష్కారం.
- ఉసిరిరసం, పొడితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ముడతలు పడిన చర్మానికి ఇది ఎంతో ప్రయోజనకరం. ఉసిరికాయను ఎండబెట్టి పొడి చేసి దాంట్లో పాలు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.
- ఆపిల్ గుజ్జు తీసుకొని తేనె లేదా పాలు కలిపితే అద్భుతమైన ఫేస్ మాస్క్ తయారవుతుంది.
- అరటి గుజ్జు, తేనె లేదా పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. చర్మం నునుపు తేలుతుంది.
- చర్మంపై ముడతలను పోగొట్టడానికి క్యారెట్ అద్భుతంగా పనిచేస్తుంది. క్యారెట్ గుజ్జులో బాదం ఆయిల్, తేనె కలిపి రాయాలి.
- నిమ్మకాయ రసం చర్మంపై ముడతలను, తలలో చుండ్రును పోగొడుతుంది.
- చాలా సౌందర్య చికిత్సల్లో ఉల్లిని వాడతారు. ఉల్లి రసం రాస్తే మొటిమలు, కాలిన గాయాల తాలూకు మచ్చలు తగ్గుతాయి.
- ఆలు ఉడకబెట్టి గుజ్జును ముఖానికి రాసుకుంటే తెగిన, కాలిన గాయాలు మానుతాయి. మొటిమలు తగ్గి, ముఖం అందంగా తయారవుతుంది.
- టేబుల్ స్పూన్ తేనెకు పావు చెంచా క్యారెట్ రసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో తీసేయాలి. దీనివల్ల ముడతలు పోవడంతో పాటు చర్మం మృదువుగా తయారవుతుంది.
- ఎండకు ముఖ చర్మం కములుతుంది. అలాంటప్పుడు రెండు టేబుల్ స్పూన్ల టమాట రసం, నాలుగు టేబుల్ స్పూన్ల మజ్జిగ తీసుకుని రెండిటిని బాగా కలిపి కమిలిన ప్రాంతాల్లో రాయాలి. అరగంటాగి చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితముంటుంది.
- ఆలోవెరాకు చిటెకెడు గంధంపొడి కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమల తాలూక మచ్చలు, ముడుతలు పోయి ముఖం నునుపుతేలుతుంది.
- మెత్తగా పండిన అరటి పండు గుజ్జును ముఖానికి ప్యాక్ లా వేసుకుని అరాక చల్లని నీటితో కడిగేయండి. ముడతలకిది చక్కని పరిష్కారం.
- ఎండలో బయటకు వెళ్లేముందు ఒక గ్లాసు టమాటా రసం తాగితే వేడి నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది.
- చెంచా టమాటా రసం, చెంచా శనగ పిండి, అర చెంచా నిమ్మరసం తీసుకొని బాగా కలిపి కళ్ల చుట్టూ రాస్తే నల్లటి వలయాలు తొలగిపోతాయి. బ్లాక్ హెడ్స్ పై రాసుకున్నా చక్కని ఫలితం ఉంటుంది.
- టమాటాకు కొద్దిగా నిమ్మ రసం కలిపి ముఖానికి రాసుకుని కొద్దిసేపటి తర్వాత కడిగేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది.
- టమాటా రసానికి కొద్దిగా పెరుగు జోడించి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ జిడ్డు చర్మానికి చక్కటి పరిష్కారం.
- ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలపాటు నీటిలో నానపెట్టి... తర్వాత దాన్ని రుబ్బి ఆ మిశ్రమాన్ని మొఖానికి పట్టిస్తే...మొటిమలు మటుమాయం.
- వేసవి ఎండలో బయట తిరిగే వారు రోజూ రెండు మూడు సార్లు మంచి ఫేస్ వాష్ తో ముఖం కడుక్కుని వెంటనే మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండాలి.
- కాస్మటిక్ స్పాంజ్లు, మేకప్ బ్రష్ లను రెండు నెలలకోసారి మార్చాలి. లేకపోతే వాటి మీద బ్యాక్టీరియా తయారై చర్మానికి హాని చేస్తుంది. మేకప్ బ్రష్ లను కూడా నెలకోసారి మైల్డ్ షాంపూతో శుభ్రం చేయాలి. నీడపట్టునే తడి ఆరిపోయేదాకా ఉంచి ఆ తర్వాత వాడుకోండి.
- రోజు రెండు, మూడు సార్లు ముఖాన్ని మంచి నీటితో కడగాలి. ముఖాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రి పడుకునేముందు తప్పకుండా మంచి ఔషధ గుణాలున్న సబ్బు నురగను సబ్బుతో మచ్చలపై మృదువుగా రాసి కడగాలి.
- అప్పుడప్పుడు ఫేషియల్స్ చేయించుకోవాలి. దీనివల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తగ్గి చర్మం నునుపుతేలుతుంది.
- ముఖాన మొటిమలుంటే ముందుగా రోజ్ వాటర్, కర్పూరం కలిపిన నీటితో కడగాలి. టమాటాని అడ్డంగా కోసి ఆ సగం చక్క తో ముఖమంతా రుద్దాలి. దాంతో జిడ్డుతగ్గుతుంది. ఇప్పుడు గంధం పొడిలో కొంచం కర్పూరం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే హాయిగా ఉంటుంది.
- పొడిబారినట్లున్న చర్మానికి తేనె, ఆలివ్ నూనె, పసుపు, గంధంపొడి కలిపి రాసి ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి.
- గంధం పొడి, పసుపు, పాలు కలిపి ముఖానికి పట్టించి ఆరాక గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే చర్మం మెరిసి పోతుంటుంది.
- బొప్పాయి గుజ్జును ముఖానికి మాస్క్ లా వేసుకోవచ్చు. బొప్పాయిలో ఉండే కొన్ని ఎంజైంలు చర్మంలో మృతకణాలను తొలగించి మీ చర్మానికి కొత్త కాంతి నిస్తాయి.
- ముల్తాన మట్టికి కొంచెం పెరుగు కలిపి మాస్క్ వేసుకుంటే ముఖానికి సరికొత్త మెరుపు వస్తుంది.
- సాధారణ చర్మతత్వం ఉంటే చెంచా ముల్తాన మట్టి, సరిపడా పెరుగు, కాస్త ద్రాక్ష గుజ్జు, రెండు చుక్కల రోజ్ వాటర్ బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని పదిహేను నిమిషాలాగి కడిగేయాలి.
- జిడ్డుగా ఉంటే...చెంచా ముల్తాన మట్టి, సరిపడా పెరుగు, కొద్దిగా కీరాదోస లేదా క్యారెట్ గుజ్జు, రెండు చుక్కల నిమ్మ రసం...వీటన్నిటినీ కలిపి ముఖానికి పటించాలి. చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.
- ఇంట్లోనే బ్లీచ్ తయారు చేసుకోవాలనుకునే వారు ఇలా ప్రయత్నిస్తే సరి... నిమ్మరసం, కమలా పండు రసం ఒక్కో చెంచాడు చొప్పున తీసుకోవాలి. టమాటా గుజ్జులో ఈ రసాలను కపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్ లా వేసుకోవాలి.కొద్దిసేపటి తర్వాత కడిగేయాలి.
- చెంచాడు పాలపిండిలో తేనె కలిపి పేస్టులా చేసి దానిని మొహానికి రాసుకుని ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగి వేయాలి. దీని వల్ల ముఖం మీద మచ్చలు, ముడుతలు పోతాయి.
- కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి.
- క్యారెట్ ఉడికించిన నీళ్ళతో ముఖం కడుక్కుంటే చర్మం మృదువుగా, తాజాగా ఉంటుంది.
- ఫేస్ స్క్రబ్ సహాయంతో చర్మంపైన మృత కణాలను ఎప్పటికప్పుడు తొలిగించుకోవాలి. అయితే స్క్రబ్తో గట్టిగా వత్తకూడదు. దీని వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముంది. ఒకవేళ చర్మం కందిపోయినట్లు అయితే వెంటనే స్క్రబ్ వాడటం ఆపేయాలి.
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼